భారతదేశంలో తగ్గిన బజాజ్ బైక్ సేల్స్.. కానీ విదేశాల్లో మాత్రం భేష్..!

భారతదేశపు అగ్రగామి టూవీలర్ కంపెనీలలో ఒకటైన బజాజ్ ఆటో (Bajaj Auto) భారత మార్కెట్లో బడ్జెట్ బైక్‌లు మొదలుకొని ప్రీమియం మోటార్‌సైకిళ్ల వరకూ విక్రయిస్తోంది. అయితే, ఇటీలి కాలంలో ఈ బ్రాండ్ అమ్మకాలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడచిన జూన్ 2022 నెలలో బజాజ్ ఆటో దేశీయ అమ్మకాలు క్షీణించాయి. బజాజ్ గత నెలలో భారత మార్కెట్లో 1,25,083 యూనిట్ల ద్విచక్ర వాహనాలను మాత్రమే విక్రయించింది. జూన్ 2021 నెలలో కంపెనీ విక్రయించిన 1,55,640 యూనిట్లతో పోలిస్తే ఇవి 19.63 శాతం తగ్గాయి.

భారతదేశంలో తగ్గిన బజాజ్ బైక్ సేల్స్.. కానీ విదేశాల్లో మాత్రం భేష్..!

అయితే, ఇదే సమయంలో బజాజ్ ఆటో ఎగుమతులు మాత్రమే భారీగా పెరిగాయి. జూన్ 2021 నెలలో బజాజ్ ఆటో 1,54,938 యూనిట్ల ద్విచక్ర వాహనాలను భారతదేశం నుండి వివిధ అంతర్జాతీయ మార్కెట్లకు ఎగుమతి చేయగా, జూన్ 2022 నెలలో 1,90,865 యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఈ సమయంలో బజాజ్ ఆటో మొత్తం ఎగుమతులు 23.19 శాతం పెరిగాయి.

భారతదేశంలో తగ్గిన బజాజ్ బైక్ సేల్స్.. కానీ విదేశాల్లో మాత్రం భేష్..!

దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులు కలిపి చూస్తే, జూన్ 2022 నెలలో బజాజ్ మొత్తం అమ్మకాలు 3,15,948 యూనిట్లుగా నమోదయ్యాయి. అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (జూన్ 2021 నెలలో) ఇవి 3,10,578 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో మొత్తం అమ్మకాలు 1.73 శాతం వృద్ధి చెందాయి.

భారతదేశంలో తగ్గిన బజాజ్ బైక్ సేల్స్.. కానీ విదేశాల్లో మాత్రం భేష్..!

కాగా, మే 2022 నెలతో పోలిస్తే జూన్ 2022 నెలలో బజాజ్ ఆటో నెలవారీ దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులు కూడా పెరిగాయి. మే 2022 నెలలో బజాజ్ ఆటో మొత్తం 96,102 యూనిట్లను దేశీయ మార్కెట్లో విక్రయించగా, గత నెలలో 1,25,083 యూనిట్లను విక్రయించింది. ఈ సమయంలో దేశీయ అమ్మకాలు 30 శాతం పెరిగాయి. కాగా, ఇదే సమయంలో విదేశీ ఎగుమతులు 1,53,397 యూనిట్ల నుండి 1,90,865 యూనిట్లకు పెరిగి 24.43 శాతం వృద్ధి చెందాయి.

భారతదేశంలో తగ్గిన బజాజ్ బైక్ సేల్స్.. కానీ విదేశాల్లో మాత్రం భేష్..!

బజాజ్ ఆటో ప్రస్తుతం భారత మార్కెట్లో సిటి100, ప్లాటినా (100సీసీ, 110సీసీ), అవెంజర్ (160 స్ట్రీట్, 220 క్రూయిజ్), డొమినార్ (250సీసీ, 400సీసీ) మరియు పల్సర్ సిరీస్‌లో 125సీసీ నుండి 250సీసీ వరకూ వివిధ రకాల మోడళ్లను విక్రయిస్తోంది. వీటికి అదనంగా కంపెనీ ఎంపిక చేసిన నగరాలలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ ఈవీని కూడా విక్రయిస్తోంది. బజాజ్ పల్సర్ సిరీస్ లో కంపెనీ ఇటీవలే తమ కొత్త 2022 మోడల్ పల్సర్ ఎన్160 కి మార్కెట్లో విడుదల చేసింది.

Bajaj Jun-22 Jun-21 Growth (%)
Domestic 1,25,083 1,55,640 -19.63
Exports 1,90,865 1,54,938 23.19
Total 3,15,948 3,10,578 1.73
Bajaj Jun-22 May-22 Growth (%)
Domestic 1,25,083 96,102 30.16
Exports 1,90,865 1,53,397 24.43
Total 3,15,948 2,49,499 26.63
భారతదేశంలో తగ్గిన బజాజ్ బైక్ సేల్స్.. కానీ విదేశాల్లో మాత్రం భేష్..!

భారత మార్కెట్లో బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి 'సింగిల్ ఛానల్ ఏబీఎస్' కాగా, మరొకటి 'డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్'. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.1,22,854 మరియు రూ. 1,27,853 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉన్నాయి. కొత్త పల్సర్ ఎన్160 డిజైన్ ను గమనిస్తే, ఇది దాదాపు పల్సర్ ఎన్250 బైక్ డిజైన్ ను పోలి ఉంటుంది. అయితే ఇది నేక్డ్ స్ట్రీట్ బైక్ మాదిరిగా ఉంటుంది మరియు ఇందులో అదే సింగిల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ ను గమనించవచ్చు.

భారతదేశంలో తగ్గిన బజాజ్ బైక్ సేల్స్.. కానీ విదేశాల్లో మాత్రం భేష్..!

కొత్త 2022 బజాజ్ పల్సర్ ఎన్160 బైక్ లో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, ఫ్యూయెల్ ట్యాంక్‌ ఎక్స్‌టెన్షన్స్, స్ప్లిట్ సీట్, అల్లాయ్ వీల్, ఎల్ఈడి టెయిల్‌ ల్యాంప్స్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, గేర్ పొజిషన్, క్లాక్, ఫ్యూయల్ ఎకానమీ మరియు రేంజ్ డిస్‌ప్లే చేసే డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇక కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త బజాజ్ పల్సర్ ఎన్160 సింగిల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ కరేబియన్ బ్లూ, రేసింగ్ రెడ్ మరియు టెక్నో గ్రే అనే మూడు కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

భారతదేశంలో తగ్గిన బజాజ్ బైక్ సేల్స్.. కానీ విదేశాల్లో మాత్రం భేష్..!

కాగా, బజాజ్ పల్సర్ ఎన్160 డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ బ్రూక్లిన్ బ్లాక్ అనే సింగిల్ కలర్ ఆప్సన్ లో మాత్రమే అందుబాటులో ఉంటుంది. కొత్త 2022 బజాజ్ పల్సర్ ఎన్160 లో 164.82 సిసి 2-వాల్వ్, ఆయిల్-కూల్డ్, సింగిల్ సిలిండర్ ఇంజన్‌ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 8,750 ఆర్‌పిఎమ్ వద్ద 15.7 బిహెచ్‌పి పవర్ మరియు 6,750 ఆర్‌పిఎమ్ వద్ద 14.65 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది.

భారతదేశంలో తగ్గిన బజాజ్ బైక్ సేల్స్.. కానీ విదేశాల్లో మాత్రం భేష్..!

మెకానికల్ ఫీచర్లను గమనిస్తే, కొత్త పల్సర్ ఎన్160 లో ముందువైపు 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుకవైపు మోనో షాక్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. ఈ మోటార్‌సైకిల్ లో ముందు వైపు 100/80-17 ప్రొఫైల్ తో కూడిన టైర్ మరియు వెనుక వైపు 130/70-17 ప్రొఫైల్ టైర్ ఉంటాయి. ఇవి రెండూ కూడా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ పై అమర్చబడి ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, డ్యూయల్-ఛానల్ ఏబీఎస్ వెర్షన్‌లో ముందు వైపు 300 మిమీ డిస్క్ మరియు సింగిల్ ఛానల్ వెర్షన్‌లో ముందు వైపు 280 మిమీ డిస్క్ బ్రేక్స్ ఉంటాయి. అయితే ఈ రెండు వేరియంట్లల వెనుక వైపు ఒకేరకమైన 230 మిమీ డిస్క్‌ బ్రేక్ లను కలిగి ఉంటాయి.

Most Read Articles

English summary
Bajaj auto domestic two wheeler sales dropped by 19 63 percent in june 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X