Just In
- 9 hrs ago
కియా ఈవీ6 టెస్ట్ డ్రైవ్ రివ్యూ.. మెరుపు వేగం, సుదీర్ఘమైన రేంజ్..
- 10 hrs ago
ఆంధ్రప్రదేశ్‌లో కార్లు వినియోగించే కుటంబాలు కేవలం 2.8% మాత్రమే.. తెలంగాణాలో ఎంతో తెలుసా?
- 14 hrs ago
Honda City e:HEV బుక్ చేసుకున్నారా.. అయితే ఇది మీ కోసమే
- 17 hrs ago
విడుదలకు ముందే ప్రారంభమైన Citroen C3 బుకింగ్స్.. ఇక లాంచ్ ఎప్పుడంటే?
Don't Miss
- Sports
చెత్త ఫీల్డింగ్ మా కొంప ముంచింది: కేఎల్ రాహుల్
- News
నేడు హైదరాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోడీ: బెంగళూరుకు సీఎం కేసీఆర్, ఈసారీ దూరమే
- Movies
Karthika Deepam నిరుపమ్ పెళ్లి నా మనవరాలితోనే.. తేల్చి చెప్పిన సౌందర్య
- Finance
లాభాల్లో క్రిప్టో మార్కెట్, ఐనా 30,000 డాలర్ల దిగువనే బిట్ కాయిన్
- Technology
PhonePeలో రూ.100 SIP పెట్టుబడి పద్దతిలో బంగారంను పొందవచ్చు
- Lifestyle
ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ ఆహారాలు తింటే విషం... జాగ్రత్త...!!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బజాజ్ బ్లేడ్ (Bajaj Blade) పేరు కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు.. ఇది కొత్త ఎలక్ట్రిక్ టూవీలరా..?
దేశీయ టూవీలర్ బ్రాండ్ బజాజ్ ఆటో (Bajaj Auto) భారత మార్కెట్లో తన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరించుకునే దిశగా అడుగులు వేస్తోంది. బజాజ్ ఇటీవలే తమ పాపులర్ పల్సర్ బ్రాండ్ సిరీస్ లో 'పల్సర్ ఎలాన్' (Pulsar Elan) మరియు 'పల్సర్ ఎలిగాంజ్' (Pulsar Eleganz) అనే రెండు కొత్త పేర్లను ట్రేడ్‌మార్క్ చేసిన సంగతి తెలిసినదే. కాగా, బజాజ్ ఆటో ఇప్పుడు మరో కొత్త పేరు కోసం కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు చేసింది. ఈసారి బజాజ్ బ్లేడ్ (Bajaj Blade) అనే పేరు కోసం కంపెనీ ట్రేడ్‌మార్క్ దాఖలు చేసింది.

తాజా సమాచారం ప్రకారం, బజాజ్ బ్లేడ్ అనే పేరును కంపెనీ తమ కొత్త ఎలక్ట్రిక్ టూవీలర్ కోసం ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ఈ మూడు పేర్ల కోసం గడచిన మార్చ్ నెలలో ట్రేడ్‌మార్క్ దాఖలు కాగా, వీటిలో పల్సర్ ఎలిగాంజ్ పేరు కోసం కంపెనీ ఆమోదం పొందగా, పల్సర్ ఎలాన్ మరియు బజాజ్ బ్లేడ్ ఆమోదం కోసం వేచి ఉన్నాయి. త్వరలోనే వీటికి కూడా అప్రూవల్ రావచ్చని భావిస్తున్నారు.

కాగా, బజాజ్ బ్లేడ్ కోసం ట్రేడ్‌మార్క్ దాఖలు చేసిన అప్లికేషన్ దీనిని క్లాస్-12 కింద ఫైల్ చేశారు. ఇది మోటార్‌సైకిళ్లు, స్కూటర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు మరియు మూడు చక్రాల వాహనాల వర్గం క్రిందకు వస్తుంది. కాబట్టి, ప్రస్తుతానికి ఇది ఖచ్చితంగా దేని కోసం ఉపయోగించబడుతుందనేది చెప్పడం కష్టం. అయితే, ఈ పేరును బట్టి (బ్లేడ్) చూస్తే, ఇది హోండా ఎలక్ట్రిక్ టూవీలర్ కి ఉపయోగించవచ్చని అంచనా.

బజాజ్ ఆటోలో ఇటీవలి పరిణామాలను చూస్తుంటే, కంపెనీ తన ప్రధాన దృష్టిని పల్సర్ మోటార్‌సైకిళ్లపై ఉంచినట్లుగా తెలుస్తోంది. కంపెనీ ప్రస్తుతం తన పల్సర్ శ్రేణిని అప్‌గ్రేడ్ చేయడానికి మరియు మరిన్ని కొత్త మోడళ్లను పరిచయం చేయడానికి పని చేస్తోంది. ఇది కాకుండా, కంపెనీ యొక్క మరొక ఫోకస్ ప్రాంతం ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, ఇక్కడ బజాజ్ బ్లేడ్ అనే పేరు బాగా సరిపోతుంది. కంపెనీ గత 2006 ఆటో ఎక్స్‌పోలో ప్రదర్శించిన ఓ 125 సిసి స్కూటర్ కోసం బజాజ్ బ్లేడ్ అనే పేరును ఉపయోగించింది.

ఈ నేపథ్యంలో, కొత్తగా ట్రేడ్‌మార్క్ చేయబడిన బజాజ్ బ్లేడ్ పేరు, మునుపటి బజాజ్ బ్లేడ్ స్కూటర్‌కి మోడ్రన్ వెర్షన్ గా ఉంటుందనే అంచనాలను పెంచుతోంది. బజాజ్ బ్లేడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ స్పోర్టియర్ స్టైలింగ్‌ను కలిగి ఉంటుందని భావిస్తున్నారు మరియు ఇది యువ కస్టమర్లను లక్ష్యంగా చేసుకొని వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం మార్కెట్లో లభిస్తున్న పాత కాలపు క్లాసిక్ అండ్ రెట్రో లుకింగ్ బజాజ్ చేతక్ కన్నా భిన్నంగా ఉంటుందని సమాచారం.

ఆసక్తికరమైన విషయం ఏంటంటే, బ్లేడ్ అనే పేరు కోసం మహీంద్రా టూ వీలర్స్ కూడా గతంలో ట్రేడ్‌మార్క్ దాఖలు చేసింది. అదే సమయంలో బజాజ్ కూడా 2006లో బ్లేడ్ పేరు కోసం ట్రేడ్‌మార్క్ కోసం దరఖాస్తు చేసింది. ఆ సమయంలో ఈ పేర్లు తిరస్కరించబడినట్లు సమాచారం. కాగా, ఇప్పుడు బజాజ్ ఆటో 2022 సంవత్సరంలో ఈ పేరు (బ్లేడ్) కి మరోసారి ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు దాఖలు చేసింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

బజాజ్ చేతక్ (Bajaj Chetak) ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి క్లుప్తంగా...
ప్రస్తుతం, బజాజ్ ఆటో ఒకే ఒక ఎలక్ట్రిక్ స్కూటర్ ను విక్రయిస్తోంది, అదే బజాజ్ చేతక్ ఈవీ. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ను అర్బన్ మరియు ప్రీమియం అనే రెండు వేరియంట్లలో విక్రయిస్తోంది. మార్కెట్లో ఈ స్కూటర్ ధర సుమారు రూ.1.50 లక్షలు పైగానే ఉంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో 3 kWh IP 67 రేటెడ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇది ఆన్-బోర్డ్ 3.8 kW ఎలక్ట్రిక్ మోటార్ కు శక్తినిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 5 బిహెచ్‌పి శక్తిని మరియు 16.2 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

బజాజ్ చేతక్ ఈవీ లో ఎకో మరియు స్పోర్ట్స్ అనే రెండు రైడింగ్ మోడ్స్ ఉంటాయి. ఇది పూర్తిగా ఛార్జ్ పై ఎకో మోడ్ లో గరిష్టంగా 95 కిలోమీటర్ల రేంజ్ ను మరియు స్పోర్ట్ మోడ్ లో గరిష్టంగా గంటకు 70 కిమీ రేంజ్ ను అందిస్తుంది. చేతక్ ఈవీ స్టాండర్డ్ మరియు ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీలను సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ సాయంతో ఇందులోని బ్యాటరీలను 1 గంట పాటు చార్జ్ చేస్తే 25 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది.

చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ లోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు, ఎల్ఈడి హెడ్‌ల్యాంప్ మరియు టెయిల్ ల్యాంప్‌లు, పూర్తి డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫెథర్ టచ్ యాక్టివేట్ స్విచ్‌లు, ఫాస్ట్ చార్జింగ్ టెక్నాలజీ, క్రోమ్ గార్నిషింగ్, యుఎస్‌బి పోర్ట్, అల్లాయ్ వీల్స్, డిస్క్ బ్రేక్, లైవ్ ట్రాకింగ్, స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఫీచర్ వంటి అనేక ఇతర ఫీచర్లను కూడా కలిగి ఉంటుంది.