బజాజ్ ద్విచక్ర వాహనాల ధరలపై 9 శాతం పెంపు; రూ.12,749 వరకూ పెరిగిన ధరలు

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) మరోసారి తమ టూవీలర్ ధరలను పెంచింది. బజాజ్ టూవీలర్ ప్రోడక్ట్ లైనప్ లో అన్ని వాహనాల ధరలను 9 శాతం వరకు పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. తాజా ధరల పెంపు తర్వాత కస్టమర్ ఎంచుకునే మోడల్ మరియు వేరియంట్ ను బట్టి ధరలు రూ. 12,749 వరకూ పెరిగాయి. ప్రస్తుతం, బజాజ్ టూవీలర్ ప్రోడక్ట్ లైనప్ లో సిటి100 నుండి చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్ వరకూ వివిధ రకాల మోడళ్లను కంపెనీ విక్రయిస్తోంది.

బజాజ్ ద్విచక్ర వాహనాల ధరలపై 9 శాతం పెంపు; రూ.12,749 వరకూ పెరిగిన ధరలు

బజాజ్ ఆటో విక్రయిస్తున్న ప్లాటినాలో ఓ వెర్షన్ మరియు కొత్తగా విడుదల చేసిన పల్సర్ ఎన్160 (సింగిల్ మరియు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్) మోడళ్లు మినహా మిగిలిన అన్ని టూవీలర్ల ధరలు పెరిగాయి. బజాజ్ ఆటో టూవీలర్ లైనప్ లో ఎంట్రీ లెవల్ మోడల్ అయిన ప్లాటినా 100 ఈఎస్ (ఎలక్ట్రిక్ స్టార్ట్) ధరలు 3.23 శాతం (రూ.1,978) పెరిగాయి, ఈ పెంపు అనంతరం ప్లాటినా 100 ఈఎస్ ధరలు రూ.63,130 నుండి ప్రారంభం అవుతాయి. అలాగే, మరొక ఎంట్రీ లెవల్ మోటార్‌సైకిల్ బజాజ్ సిటి110ఎక్స్ ధరలు రూ. 845 పెరిగాయి మరియు ఇప్పుడు బైక్ ధర రూ. 66,298 నుండి ప్రారంభం అవుతుంది.

బజాజ్ ద్విచక్ర వాహనాల ధరలపై 9 శాతం పెంపు; రూ.12,749 వరకూ పెరిగిన ధరలు

అలాగే, బేస్ మోడల్ బజాజ్ ప్లాటినా 110 ధర రూ. 826 పెరిగింది. ఇప్పుడు ఈ బైక్ ధర రూ. 66,317 గా ఉంది. క్రూయిజర్ మోటార్‌సైకిల్ లైనప్ లో బజాజ్ అవెంజర్ 160 మరియు బజాజ్ అవెంజర్ 220 మోడళ్ల ధరలు వరుసగా రూ. 365 మరియు రూ. 563 మేర పెరిగాయి. ఇప్పుడు ఈ రెండు బైక్‌ల ధరలు వరుసగా రూ. 1,11,827 మరియు రూ. 1,38,368 గా ఉన్నాయి.

బజాజ్ ద్విచక్ర వాహనాల ధరలపై 9 శాతం పెంపు; రూ.12,749 వరకూ పెరిగిన ధరలు

బజాజ్ పల్సర్ సిరీస్ లో అతిపెద్ద పెంపు బజాజ్ పల్సర్ ఎన్250 యొక్క సింగిల్ ఛానెల్ వెర్షన్‌కు వర్తిస్తుంది. మునుపటి ధరతో పోలిస్తే, ఈ మోడల్ ధర రూ. 1,299 పెరిగింది. తాజా పెంపు తర్వాత బజజాజ్ పల్సర్ ఎన్250 యొక్క సింగిల్ ఛానెల్ ఏబిఎస్ వెర్షన్ ఇప్పుడు రూ. 1,44,979 గా ఉంది. ఇకపోతే, పల్సర్ ఎన్ఎస్ 125 ధర రూ. 1,165 పెరగగా, పల్సర్ 125 స్ప్లిట్ సీట్ లైనప్ ధర రూ. 1,101 మేర పెరిగింది.

Bajaj Range New Price Old Price Difference
CT110X ₹66,298 ₹65,453 ₹845
Platina 100 ES Drum ₹63,130 ₹61,152 ₹1,978
Platina 110 ES Drum ₹63,317 ₹65,491 ₹826
Platina 100 ES Disc ₹69,216 ₹69,216 0
Avenger 160 ₹1,11,827 ₹1,11,462 ₹365
Avenger 120 ₹1,38,368 ₹1,37,805 ₹563
Pulsar 125 Drum Single Seat ₹81,389 ₹81,389 0
Pulsar 125 Drum Split Seat ₹84,000 ₹84,000 0
Pulsar 125 Disc Single Seat ₹87,149 ₹86,048 ₹1,101
Pulsar 125 Drum Split Seat ₹90,003 ₹88,902 ₹1,101
Pulsar 150 NEON ₹1,04,448 ₹1,03,731 ₹717
Pulsar 150 Single Disc ₹1,11,174 ₹1,10,458 ₹716
Pulsar 150 Twin Disc ₹1,14,176 ₹1,13,459 ₹717
Pulsar NS 125 ₹1,04,371 ₹1,03,206 ₹1,165
Pulsar NS 160 ₹1,23,750 ₹1,22,854 ₹896
Pulsar NS 200 ₹1,40,666 ₹1,39,667 ₹999
Pulsar RS 200 ₹1,70,067 ₹1,68,979 ₹1,088
Pulsar N 160 Single ABS ₹1,22,854 - -
Pulsar N 160 Dual ABS ₹1,27,853 - -
Pulsar N250 Single ABS ₹1,44,979 ₹1,43,680 ₹1,299
Pulsar N250 Dual ABS ₹1,49,978 - -
Pulsar F250 Single ABS ₹1,44,979 ₹1,44,979 0
Pulsar F250 Dual ABS ₹1,49,978 - -
Dominar 250 ₹1,75,002 ₹1,68,602 ₹6,400
Dominar 400 ₹2,23,538 ₹2,22,386 ₹1,152
Chetak (Pune Price) ₹1,54,189 ₹1,41,440 ₹12,749
బజాజ్ ద్విచక్ర వాహనాల ధరలపై 9 శాతం పెంపు; రూ.12,749 వరకూ పెరిగిన ధరలు

బజాజ్ మోటార్‌సైకిల్ లైనప్‌ లోని అన్ని బైక్‌ లలో కెల్లా అత్యధిక పెంపును అందుకున్న మోటార్‌సైకిల్ బజాజ్ డొమినార్ 250. బజాజ్ డామినార్ 250 ధర రూ. 6,400 మేర పెరిగి రూ. 1,75,002 లకు చేరుకుంది. అలాగే, బజాజ్ డొమినార్ 400 ధర రూ. 1,152 పెరిగి రూ. 2,23,538 చేరుకుంది. ఇక చివరిగా, బజాజ్ అందిస్తున్న ఏకైక ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ ఈవీ ధర రూ. 12,749 మేర పెరిగింది. కాగా, ఈ తాజా ధరల పెంపుకు గల కారణాన్ని కంపెనీ ఇంకా వెల్లడించలేదు.

బజాజ్ ద్విచక్ర వాహనాల ధరలపై 9 శాతం పెంపు; రూ.12,749 వరకూ పెరిగిన ధరలు

బజాజ్ ఆటో ప్రస్తుతం భారత మార్కెట్లో సిటి100, ప్లాటినా 100సీసీ, ప్లాటినా 110సీసీ, అవెంజర్ 160 స్ట్రీట్, అవెంజర్ 220 క్రూయిజ్, డొమినార్ 250, డొమినార్ 400 మరియు పల్సర్ సిరీస్‌లో 125సీసీ నుండి 250సీసీ వరకూ వివిధ రకాల మోడళ్లను విక్రయిస్తోంది. వీటికి అదనంగా కంపెనీ ఎంపిక చేసిన నగరాలలో తమ ఎలక్ట్రిక్ స్కూటర్ బజాజ్ చేతక్ ఈవీని కూడా విక్రయిస్తోంది. బజాజ్ పల్సర్ సిరీస్ లో కంపెనీ ఇటీవలే తమ కొత్త 2022 మోడల్ పల్సర్ ఎన్160 కి మార్కెట్లో విడుదల చేసింది.

బజాజ్ ద్విచక్ర వాహనాల ధరలపై 9 శాతం పెంపు; రూ.12,749 వరకూ పెరిగిన ధరలు

కొత్త బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఇందులో ఒకటి 'సింగిల్ ఛానల్ ఏబీఎస్' కాగా, మరొకటి 'డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్'. మార్కెట్లో వీటి ధరలు వరుసగా రూ.1,22,854 మరియు రూ. 1,27,853 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) గా ఉన్నాయి. కొత్త పల్సర్ ఎన్160 డిజైన్ ను గమనిస్తే, ఇది దాదాపు పల్సర్ ఎన్250 బైక్ డిజైన్ ను పోలి ఉంటుంది. అయితే ఇది నేక్డ్ స్ట్రీట్ బైక్ మాదిరిగా ఉంటుంది మరియు ఇందులో అదే సింగిల్ ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ ను గమనించవచ్చు.

బజాజ్ ద్విచక్ర వాహనాల ధరలపై 9 శాతం పెంపు; రూ.12,749 వరకూ పెరిగిన ధరలు

ఈ బైక్ లోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, ఫ్యూయెల్ ట్యాంక్‌ ఎక్స్‌టెన్షన్స్, స్ప్లిట్ సీట్, అల్లాయ్ వీల్, ఎల్ఈడి టెయిల్‌ ల్యాంప్స్, యూఎస్‌బి ఛార్జింగ్ పోర్ట్, 14 లీటర్స్ ఫ్యూయల్ ట్యాంక్, గేర్ పొజిషన్, క్లాక్, ఫ్యూయల్ ఎకానమీ మరియు రేంజ్ డిస్‌ప్లే చేసే డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైన ఫీచర్లను కలిగి ఉంటుంది. ఇక కలర్ ఆప్షన్స్ విషయానికి వస్తే, కొత్త బజాజ్ పల్సర్ ఎన్160 సింగిల్ ఛానల్ ఏబీఎస్ వేరియంట్ కరేబియన్ బ్లూ, రేసింగ్ రెడ్ మరియు టెక్నో గ్రే అనే మూడు కలర్స్ లో అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Bajaj auto increases two wheeler prices by up to rs 12749 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X