తగ్గుముఖం పడుతున్న బజాజ్ సేల్స్.. జులై 2022 నెలలోనూ అదే పరిస్థితి.. ఈవీ ప్లాంట్ కోసం కంపెనీ ప్లాన్..

ప్రముఖ దేశీయ ద్విచక్ర మరియు త్రిచక్ర వాహనాల తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) గడచిన జూలై 2022 నెల విక్రయాల నివేదికను విడుదల చేసింది. జూలై 2022లో బజాజ్ ఆటో మొత్తం 3,54,670 యూనిట్ల (ద్విచక్ర మరియు త్రిచక్ర) వాహనాలను విక్రయించింది. అయితే, గత ఏడాది ఇదే నెలలో (జులై 2021లో) కంపెనీ మొత్తం విక్రయాలు 3,69,116 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో బజాజ్ ఆటో విక్రయాలు 4 శాతం క్షీణతను నమోదు చేశాయి. గడచిన జూన్ నెలలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. ఆ సమయంలో కూడా కంపెనీ టూవీలర్ అమ్మకాలు 19.63 శాతం తగ్గాయి.

తగ్గుముఖం పడుతున్న బజాజ్ సేల్స్.. జులై 2022 నెలలోనూ అదే పరిస్థితి.. ఈవీ ప్లాంట్ కోసం కంపెనీ ప్లాన్..

బజాజ్ ఆటో టూవీలర్ విభాగంలో విస్తృతమైన పల్సర్ రేంజ్ మోడళ్లతో పాటుగా ఇతర మోడళ్లతో బలమైన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని కలిగి ఉన్నప్పటికీ, మార్కెట్లో పోటీదారుల తీసుకువస్తున్న సరికొత్త మోడళ్ల కారణంగా బజాజ్ టూవీలర్ అమ్మకాలు స్వల్పంగా ప్రభావితం అవుతున్నాయి. గత నెలలో (జులై 2022 నెలలో) బజాజ్ ఆటో మొత్తం 3,15,054 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఇందులో దేశీయ అమ్మకాలు మరియు ఎగుమతులు రెండూ కలిసి ఉన్నాయి.

తగ్గుముఖం పడుతున్న బజాజ్ సేల్స్.. జులై 2022 నెలలోనూ అదే పరిస్థితి.. ఈవీ ప్లాంట్ కోసం కంపెనీ ప్లాన్..

కాగా, జులై 2021 నెలలో బజాజ్ ఆటో మొత్తం 3,30,569 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించింది. ఈ సమయంలో బజాజ్ టూవీలర్ సేల్స్ 5 శాతం క్షీణతను నమోదు చేశాయి. కేవల దేశీయ మార్కెట్లో మాత్రమే విక్రయించిన ద్విచక్ర వాహనాల అమ్మకాలను పరిశీలిస్తే, కంపెనీ జూలై 2021 నెలలో విక్రయించిన మొత్తం 1,56,232 యూనిట్లతో పోలిస్తే గడచిన జులై 2022 నెలలో ఇవి 5 1,64,384 యూనిట్లకు చేరుకున్నాయి. ఈ సమయంలో బజాజ్ ఆటో దేశీయ టూవీలర్ విక్రయాలు 5 శాతం పెరిగాయి.

తగ్గుముఖం పడుతున్న బజాజ్ సేల్స్.. జులై 2022 నెలలోనూ అదే పరిస్థితి.. ఈవీ ప్లాంట్ కోసం కంపెనీ ప్లాన్..

అయితే, గత నెలలో ద్విచక్ర వాహనాల ఎగుమతులు మాత్రం తగ్గుముఖం పట్టాయి. జులై 2021 నెలలో కంపెనీ మొత్తం 1,74,337 యూనిట్ల ద్విచక్ర వాహనాలను భారతదేశం నుండి ఎగుమతి చేయగా, గడచిన జులై 2022 నెలలో కేవలం 1,50,670 యూనిట్ల ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసింది. ఈ సమయంలో బజాజ్ ఆటో టూవీలర్ ఎగుమతులు 14 శాతం క్షీణించాయి.

తగ్గుముఖం పడుతున్న బజాజ్ సేల్స్.. జులై 2022 నెలలోనూ అదే పరిస్థితి.. ఈవీ ప్లాంట్ కోసం కంపెనీ ప్లాన్..

ఇక వాణిజ్య వాహనాల విషయానికి వస్తే, గత నెలలో బజాజ్ ఆటో మొత్తం 39,616 యూనిట్ల వాణిజ్య వాహనాల విక్రయాలతో 3 శాతం వృద్ధిని నమోదు చేసింది. జూలై 2021 నెలలో మొత్తం వాణిజ్య వాహనాల విక్రయాలు 38,547 యూనిట్లుగా ఉన్నాయి. ఈ సమయంలో, దేశీయ విపణిలో వాణిజ్య వాహనాల విక్రయాలు 68 శాతం వృద్ధితో 18,572 యూనిట్లకు చేరుకోగా, వాణిజ్య వాహనాల ఎగుమతులు 23 శాతం క్షీణించి 21,044 యూనిట్లకు పడిపోయాయి.

తగ్గుముఖం పడుతున్న బజాజ్ సేల్స్.. జులై 2022 నెలలోనూ అదే పరిస్థితి.. ఈవీ ప్లాంట్ కోసం కంపెనీ ప్లాన్..

ఇదిలా ఉంటే, బజాజ్ ఆటో ఎలక్ట్రిక్ వెహికల్ సెగ్మెంట్‌లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి, పూణేలో ఓ కొత్త తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేస్తోంది. కంపెనీ గతంలో పెట్రోల్‌తో నడిచే చేతక్ స్కూటర్‌లను తయారు చేసే ప్లాంట్ ను పునరుద్ధరించి, అదే ప్లాంట్ లో ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేసేందుకు సిద్ధమైంది. బజాజ్ ఆటో ఈ కొత్త ప్లాంట్ కోసం రూ. 300 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ ప్లాంట్‌లో ఏడాదికి 5 లక్షల ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేయాలని బజాజ్ భావిస్తోంది.

తగ్గుముఖం పడుతున్న బజాజ్ సేల్స్.. జులై 2022 నెలలోనూ అదే పరిస్థితి.. ఈవీ ప్లాంట్ కోసం కంపెనీ ప్లాన్..

ప్రస్తుతం, బజాజ్ ఆటో దేశీయ మార్కెట్లో చేతక్ పేరిట ఓ ఎలక్ట్రిక్ స్కూటర్ ను విక్రయిస్తోంది. కాగా, కంపెనీ ఇప్పుడు ఈ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఓ కొత్త మోడల్‌ను కూడా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. కొత్త చేతక్ ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువ రేంజ్ మరియు ఎక్కువ ఛార్జింగ్ ఆప్షన్లతో రానుంది. టీవీఎస్ అందిస్తున్న ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ను ఆ కంపెనీ ఇటీవలే అప్‌గ్రేడ్ చేసిన నేపథ్యంలో, బజాజ్ ఆటో కూడా తమ చేతక్ ఈవీని అప్‌గ్రేడ్ చేయాలని చూస్తోంది. ప్రస్తుత బజాజ్ చేతక్ 3.8kW ఎలక్ట్రిక్ మోటార్ మరియు 3kWh IP67 రేటింగ్ నాన్-రిమూవబల్ లిథియం-అయాన్ బ్యాటరీతో లభిస్తుంది.

తగ్గుముఖం పడుతున్న బజాజ్ సేల్స్.. జులై 2022 నెలలోనూ అదే పరిస్థితి.. ఈవీ ప్లాంట్ కోసం కంపెనీ ప్లాన్..

బజాజ్ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లో ఎకో మరియు స్పోర్ట్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు ఉన్నాయి. ఈ స్కూటర్ ఎకో మోడ్‌లో 95 కిమీల రేంజ్‌ను అందిస్తుంది, అయితే స్పోర్ట్ మోడ్‌లో ఇది 85 కిమీ లకు పడిపోతుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 60 కిమీ. దీని 5 ఆంప్ పవర్ సాకెట్ తో పూర్తిగా ఛార్జ్ చేయడానికి 5 గంటల సమయం పడుతుంది. జాజ్ చేతక్‌ ఐకానిక్ రెట్రో డిజైన్ తో లభిస్తుంది. ఇందులో ఎల్ఈడి డేటైమ్ రన్నింగ్ లైట్లు మరియు హెడ్‌ల్యాంప్‌లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, USB పోర్ట్, అల్లాయ్ వీల్స్ మరియు డిస్క్ బ్రేక్‌ వంటి ఫీచర్లు ఉన్నాయి.

తగ్గుముఖం పడుతున్న బజాజ్ సేల్స్.. జులై 2022 నెలలోనూ అదే పరిస్థితి.. ఈవీ ప్లాంట్ కోసం కంపెనీ ప్లాన్..

ఇంకా ఇందులో లైవ్ ట్రాకింగ్ ఫీచర్‌ను కూడా ఉంటుంది. దీని సహాయంతో స్కూటర్ యజమాని ఓ స్మార్ట్‌ఫోన్ అప్లికేషన్ ద్వారా తన స్కూటర్‌ను ట్రాక్ చేయవచ్చు. ఇందులో రివర్స్ మోడ్ కూడా ఉంది. ఈ మోడ్ సాయంతో రైడర్ ఎలాంటి శ్రమ లేకుండా తన స్కూటర్ ను పరిమిత వేగంతో వెనకకు కూడా రైడ్ చేయవచ్చు. సమాచారం ప్రకారం, కొత్తగా రాబోయే చేతక్ ఈవీ ప్రస్తుత చేతక్ కంటే ఎక్కువ శ్రేణిని అందిస్తుంది. ఇది పూర్తి చార్జ్ పై 150 కిమీల రేంజ్‌ను అందించవచ్చని అంచనా. ఈ కొత్త ఇ-స్కూటర్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మరియు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్‌తో రావచ్చని నివేదించబడింది.

Most Read Articles

English summary
Bajaj auto july 2022 sales 354670 units details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X