డైనమో (Dynamo) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన బజాజ్, ఇది కొత్త ఎలక్ట్రిక్ టూవీలరా లేకా పెట్రోల్ టూవీలరా?

ప్రముఖ దేశీయ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో (Bajaj Auto) భారత మార్కెట్లో తమ ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని విస్తరించాలని ప్లాన్ చేస్తోంది. గత కొన్ని నెలలుగా బజాజ్ ఆటో కొత్త పేర్లను ట్రేడ్‌మార్క్ కోసం ధరఖాస్తు చేస్తూ వస్తోంది. తాజాగా, ఇప్పుడు బజాజ్ ఆటో డైనమో (Dynamo) అనే పేరును ట్రేడ్‌మార్క్ చేసింది. అయితే, ఈ పేరు బజాజ్ ఆటో నుండి రాబోయే ద్విచక్ర వాహనాన్ని సూచిస్తుందా లేక త్రిచక్ర చక్రాల వాహనం కోసం ట్రేడ్‌మార్క్ చేయబడిందా అనే విషయంపై స్పషత లేదు.

డైనమో (Dynamo) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన బజాజ్, ఇది కొత్త ఎలక్ట్రిక్ టూవీలరా లేకా పెట్రోల్ టూవీలరా?

ఈ పేరుని విశ్లేషిస్తే, డైనమో అనేది ఎలక్ట్రిసిటీని ఉత్పత్తి చేసే యంత్రాన్ని సూచిస్తుంది కాబట్టి, ఇది బజాజ్ నుండి రాబోయే ఎలక్ట్రిక్ వాహనం కోసం ఉపయోగించవచ్చని తెలుస్తోంది. ప్రస్తుతం, బజాజ్ ఆటో ఒకే ఒక ఎలక్ట్రిక్ టూవీలర్ (బజాజ్ చేతక్ ఈవీ)ని మాత్రమే మార్కెట్లో విక్రయిస్తోంది. అయితే, దేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో, కంపెనీ మరిన్ని కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను భారతదేశంలో విడుదల చేసే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే, కంపెనీ ముందుగా కొన్ని కొత్త పేర్లను వెతికి మరీ ట్రేడ్‌మార్క్ చేయడం ప్రారంభించింది.

డైనమో (Dynamo) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన బజాజ్, ఇది కొత్త ఎలక్ట్రిక్ టూవీలరా లేకా పెట్రోల్ టూవీలరా?

గతంలో కూడా బజాజ్ ఆటో బ్లేడ్ (Blade) అనే పేరు కోసం ట్రేడ్‌మార్క్ చేసింది. బ్లేడ్ అనేది షార్ప్ (పదును)ను సూచిస్తుంది కాబట్టి, ఇది ఈ బ్రాండ్ నుండి రాబోయే స్పోర్టీయర్ వెర్షన్ మోటార్‌సైకిల్ అని తెలుస్తోంది. ఏదేమైనప్పటికీ, ప్రస్తుతం ట్రేడ్‌మార్క్ చేయబడిన పేర్లు తప్ప వాటిని ఏయే ఉత్పత్తులకు ఉపయోగిస్తారనే విషయంపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ రెండు పేర్లకు ముందు బజాజ్ తమ పాపులర్ పల్సర్ బ్రాండ్ సిరీస్ లో 'పల్సర్ ఎలాన్' (Pulsar Elan) మరియు 'పల్సర్ ఎలిగాంజ్' (Pulsar Eleganz) అనే రెండు కొత్త పేర్లను కూడా ట్రేడ్‌మార్క్ చేసింది.

డైనమో (Dynamo) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన బజాజ్, ఇది కొత్త ఎలక్ట్రిక్ టూవీలరా లేకా పెట్రోల్ టూవీలరా?

ప్రస్తుతం, భారత మార్కెట్లో హీరో మోటోకార్ప్ మరియు హోండా టూవీలర్స్ తర్వాత అతిపెద్ద ద్విచక్ర వాహన తయారీదారులలో బజాజ్ ఆటో కూడా ఒకటిగా ఉంది. ఈ కంపెనీ 1945లో స్థాపించబడింది మరియు 1959లో ద్విచక్ర వాహనాల తయారీకి లైసెన్స్ పొందింది. అప్పటి నుండి, బజాజ్ అనేక అద్భుతమైన మోటార్‌సైకిళ్లు మరియు స్కూటర్‌లను ఉత్పత్తి చేసింది. మార్కెట్లోకి వచ్చిన ప్రియా మరియు చేతక్ వంటి ఐకానిక్ స్కూటర్‌లు కావచ్చు లేదా యూత్‌ఫుల్ పల్సర్ రేంజ్ మోటార్‌సైకిళ్లు కావచ్చు, భారతీయ వినియోగదారుల గుండెల్లో చెరగని ముద్రలు వేశాయి.

డైనమో (Dynamo) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన బజాజ్, ఇది కొత్త ఎలక్ట్రిక్ టూవీలరా లేకా పెట్రోల్ టూవీలరా?

అయితే, గత కొన్ని సంవత్సరాలుగా భారత ద్విచక్ర వాహన మార్కెట్లో పోటీ తీవ్రతరమైంది. ద్విచక్ర వాహన తయారీదారులు వివిధ విభాగాలలో కొత్త ఉత్పత్తులను ప్రవేశపెడుతున్నారు మరియు కొత్త విభాగాల ప్రారంభానికి శ్రీకారం చుడుతున్నాయి. అయితే, బజాజ్ ఆటో మాత్రం కేవలం తమ పల్సర్ సిరీస్‌లోనే కొత్త మోడళ్లను తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తుంది తప్ప, కొత్త రకం మోటార్‌సైకిళ్లను విడుదల చేయడానికి ధైర్యం చేయడం లేదు. గమనించినట్లయితే, బజాజ్ పల్సర్ సిరీస్ 125సీసీ 250సీసీ వరకూ వివిధ రకాల వేరియంట్లలో పల్సర్ బైకులు లభిస్తున్నాయి.

డైనమో (Dynamo) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన బజాజ్, ఇది కొత్త ఎలక్ట్రిక్ టూవీలరా లేకా పెట్రోల్ టూవీలరా?

ఇక బ్రాండ్ నుండి లభించే ఇతర మోడళ్లలో డొమినార్, అవెంజర్, ప్లాటినా, సిటి సిరీస్‌లు చెప్పుకోదగినవి. హీరో మరియు హోండా వంటి బ్రాండ్లతో పోలిస్తే, బజాజ్ ఆటో వివిధ విభాగాలు మరియు విభిన్న డిజైన్లలో అందించే మోటార్‌సైకిళ్లు తక్కువే అని చెప్పాలి. ఈ నేపథ్యంలో, బజాజ్ ఆటో ఇదే అంశాన్ని పరిగణలోకి తీసుకొని, ఇప్పుడు కొత్త డిజైన్ మరియు కొత్త టూవీలర్ విభాగాలలో ద్విచక్ర వాహనాలను అందించేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే, కంపెనీ కొత్త కొత్త పేర్లను తమ భవిష్యత్ మోడళ్ల కోసం ముందుగానే ట్రేడ్‌మార్క్ చేసి ఉంచుతోంది.

డైనమో (Dynamo) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన బజాజ్, ఇది కొత్త ఎలక్ట్రిక్ టూవీలరా లేకా పెట్రోల్ టూవీలరా?

బజాజ్ ఆటో ఇప్పటి వరకూ బజాజ్ పల్సర్ ఎలాన్ (Bajaj Pulsar Elan), బజాజ్ పల్సర్ ఎలిగాంజ్ (Bajaj Pulsar Elganz), బజాజ్ బ్లేడ్ (Bajaj Blade) మరియు బజాజ్ ట్విన్నర్ (Bajaj Twinner) అనే పేర్లను ట్రేడ్‌మార్క్ చేసింది. తాజాగా ఫైల్ చేసిన బజాజ్ డైనమో (Bajaj Dynamo) పేరుకి కూడా ఆమోదం లభించింది. అంటే, కంపెనీ ఈ ఐదు పేర్లను ఐదు కొత్త ఉత్పత్తుల కోసం ఉపయోగించుకోవచ్చని అర్థం. మరి వీటిలో ఎన్ని ద్విచక్ర వాహనాలు ఉండబోతాయి, ఎన్ని త్రిచక్ర వాహనాలు ఉండబోతాయనేదానిపై ప్రస్తుతానికి ఎలాంటి సమాచారం లేదు.

డైనమో (Dynamo) పేరును ట్రేడ్‌మార్క్ చేసిన బజాజ్, ఇది కొత్త ఎలక్ట్రిక్ టూవీలరా లేకా పెట్రోల్ టూవీలరా?

సాధారణంగా, ఆటోమొబైల్ కంపెనీలు ఓ పేరును ట్రేడ్‌మార్క్ కోసం ఫైల్ చేసేటప్పుడు ఆ పేరుని విభిన్న విభాగాల కోసం ఉపయోగించుకునేలా ధరఖాస్తు చేస్తారు. వీటిలో వెహికల్ క్యాటగిరీ, టెక్నాలజీ తదితర విభాగాలు ఉంటాయి. కాబట్టి, ఏదైనా కంపెనీ కొత్త పేరుని ట్రేడ్‌మార్క్ చేసిందంటే దాని అర్థం అది ఖచ్చితంగా ఏదైనా వాహనం అయి ఉంటుందని కాదు. కాబట్టి, తాజాగా బజాజ్ ట్రేడ్‌మార్క్ చేసిన పేరు కూడా అలాంటిదే. ఇది ద్విచక్ర వాహనం కావచ్చు లేదా మూడు చక్రాల వాహనం కావచ్చు. మరిన్ని వివరాలు తెలియాలంటే, కంపెనీ ఈ విషయంపై అధికారికంగా స్పందిచాల్సిందే. అప్పటి వరకూ తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని ఫాలో అవుతూ ఉండండి.

Most Read Articles

English summary
Bajaj auto trademarks dynamo name will it be a new electric two wheeler
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X