షాకింగ్ న్యూస్: బజాజ్ పల్సర్ 180 బైక్ కావాలన్నా దొరకదు.. కారణం ఇదే..!!

భారతీయ ద్విచక్ర వాహన విభాగంలో ఒక వెలుగు వెలిగిన 'బజాజ్' (Bajaj) కంపెనీ యొక్క 'పల్సర్ 180' (Pulsar 180) బైక్ ఇప్పుడు మార్కెట్లో నిలిపివేయబడింది. దీనికి ప్రధాన కారణం అయితే కంపెనీ వెల్లడించలేదు.

Recommended Video

Maruti Alto K10 Launched At Rs 3.99 Lakh In Telugu | What’s New On The Hatchback? Dual-Jet VVT & AMT

ఒకప్పుడు మార్కెట్ ని శాసించిన ఈ బైక్ యొక్క ఉత్పత్తి ఎందుకు నిలిపివేయబడింది, దీని వెనుక వున్న అసలు కారణం ఏమిటి అనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

బజాజ్ పల్సర్ 180 బైక్ కావాలన్నా దొరకదు.. ఎందుకంటే?

నివేదికల ప్రకారం, బజాజ్ ఆటో యొక్క 'పల్సర్ 180' స్టాక్ ని డీలర్స్ కూడా తీసుకోవడం లేదని తెలుస్తోంది. ఎందుకంటే కొత్త కస్టమర్లు కొత్త ఉత్పత్తులపైన ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో కంపెనీ కూడా ఈ బైక్ యొక్క ఉత్పత్తిని కూడా ఇప్పటికే నిలిపివేసినట్లు తెలుస్తోంది. అయితే కంపెనీ పల్సర్ 180 యొక్క ఉత్పత్తి మరియు సరఫరా నిలిపివేయడంపైన సమాచారం వెల్లడించనప్పటికీ, కొత్త ఉత్పత్తులు వస్తున్న క్రమంలో ఈ పల్సర్ 180 కున్న డిమాండ్ తగ్గిపోవడం వల్ల నిలిపివేసి ఉంటుందని భావిస్తున్నాము.

బజాజ్ పల్సర్ 180 బైక్ కావాలన్నా దొరకదు.. ఎందుకంటే?

2001 లో బజాజ్ ఆటో తన పల్సర్ 150 మరియు 180 వంటి ఫెర్ఫామెన్స్డ్ మోటార్‌సైకిళ్లను పరిచయం చేసింది. అప్పటినుంచే వీటి అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. అయితే రాను రాను ఈ పల్సర్ శ్రేణిలో కొత్త ఉత్పత్తులు పుట్టుకురావడం ప్రారంభమయింది. కొత్త ఉత్పత్తులకు ఆదరణ పెరిగి మునుపటి మోడల్స్ కి ఆదరణ క్రమంగా తగ్గిపోయింది.

బజాజ్ పల్సర్ 180 బైక్ కావాలన్నా దొరకదు.. ఎందుకంటే?

బజాజ్ పల్సర్ 180 అద్భుతమైన డిజైన్ కలిగి, చూడగానే ఆకర్శించే విధంగా ఉంటుంది. ఇందులో 15 లీటర్ల కెపాసిటీ కలిగిన మస్కులర్ ఫ్యూయల్ ట్యాంక్, ఎల్ఈడీ డిఆర్ఎల్ లతో కూడిన హాలోజన్ హెడ్‌ల్యాంప్స్, యాంగ్యులర్ మిర్రర్స్, క్లిప్-ఆన్ హ్యాండిల్‌బార్లు, స్ప్లిట్ సీట్లు, గ్రాబ్ రైల్స్ మరియు డ్యుయల్ ఎల్ఈడీ టెయిల్ లాంప్ వంటివి ఉన్నాయి. ఫీచర్స్ పరంగా ఇందులో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

బజాజ్ పల్సర్ 180 బైక్ కావాలన్నా దొరకదు.. ఎందుకంటే?

బజాజ్ ఆటో యొక్క పల్సర్ 180 బైక్ 178.6 సిసి, ఎయిర్-కూల్డ్, సింగిల్-సిలిండర్, DTSi ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 16.78 బిహెచ్‌పి పవర్ మరియు 14.52 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జతచేయబడి ఉంటుంది. ఇది అద్భుతమైన పనితీరుని అందిస్తుంది.

బజాజ్ పల్సర్ 180 బైక్ కావాలన్నా దొరకదు.. ఎందుకంటే?

పల్సర్ 180 యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో 5-స్టెప్ అడ్జస్టబుల్ నైట్రోక్స్ షాక్ అబ్జార్బర్‌ వంటివి ఉంటాయి.

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే.. ఇందులో మెరుగైన బ్రేకింగ్ పనితీరు కోసం సింగిల్-ఛానల్ ABSతో పాటు ముందు మరియు వెనుక చక్రాలపై డిస్క్ బ్రేక్‌లు అందుబాటులో ఉన్నాయి. కావున రైడింగ్ సమయంలో రైడర్ కి అనుకూలంగా ఉంటాయి.

బజాజ్ పల్సర్ 180 బైక్ కావాలన్నా దొరకదు.. ఎందుకంటే?

బజాజ్ పల్సర్ 180 ధర భారతీయ మార్కెట్లో రూ. 1.18 లక్షలు (ఎక్స్-షోరూమ్). అయితే ప్రస్తుతం ఈ బైక్ ఇక మార్కెట్లో అందుబాటులో లేదు, అంతే కాకుండా బ్రాండ్ వెబ్‌సైట్‌లో కూడా అందుబాటులో లేదు. అయితే కంపెనీ దీని స్థానంలో తప్పకుండా మరో కొత్త బైకును తీసుకువచ్చే అవకాశం ఉందని ఆసితున్నాము.

బజాజ్ పల్సర్ 180 బైక్ కావాలన్నా దొరకదు.. ఎందుకంటే?

ఇదిలా ఉండగా బజాజ్ కంపెనీ తన కొత్త బజాజ్ సిటి 125ఎక్స్ (Bajaj CT 125X) విడుదల చేసేందుకు సిద్దమవుతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఈ కొత్త బైక్ బజాజ్ ఆటో డీలర్‌షిప్ కేంద్రంలో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే ఇది భారతీయ మార్కెట్లో త్వరలోనే విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.

బజాజ్ పల్సర్ 180 బైక్ కావాలన్నా దొరకదు.. ఎందుకంటే?

బజాజ్ సిటి 125ఎక్స్ యొక్క డిజైన్ విషయానికి వస్తే, ఇది దాదాపు దాని బజాజ్ సిటి 110ఎక్స్ కి చాలా దగ్గర పోలికను కలిగి ఉంటుంది. అయితే ఇది కొత్త మోడల్ అని చూపించడానికి ఈ బైక్ పైన '125X' బ్యాడ్జింగ్ ఉంటుంది. అంతే కాకుండా కొద్దిగా భిన్నమైన గ్రాఫిక్స్, రిబ్బెడ్ సీట్ మరియు బ్లాక్ కలర్ కిక్ రాడ్ వంటివి కూడా ఇందులో గమనించవచ్చు. ఇందులో USB ఛార్జింగ్ సాకేట్ కూడా అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

బజాజ్ ఆటో నుండి విడుదలకానున్న ఈ కొత్త సిటి 125ఎక్స్ బైక్ దేశీయ మార్కెట్లో హోండా ఎస్‌పి125, హోండా షైన్, హీరో గ్లామర్ మరియు హీరో సూపర్ స్ప్లెండర్ వంటివాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

బజాజ్ పల్సర్ 180 బైక్ కావాలన్నా దొరకదు.. ఎందుకంటే?

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో ఇప్పటికి కూడా బజాజ్ పల్సర్ 180 ని ఎక్కువమంది ఇష్టపడేవారు ఉన్నారు. అయితే ఇప్పటికీ చాలా కంపెనీలు తమ ఉత్పత్తులలో కొంత అప్డేట్స్ తీసుకురావడం కానీ, కొత్త ఉత్పత్తులను తీసుకురావడం గానీ చేస్తున్నాయి. ఈ కారణంగా బజాజ్ కూడా తమ ప్రత్యర్థులకు గట్టి పోటీ ఇవ్వడానికి కొత్త ఉత్పత్తులను తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏది ఏమైనా బజాజ్ పల్సర్ 180 నిలిపివేయడం పల్సర్ 180 ప్రియులకు ఒక చేదు వార్త అనే చెప్పాలి.

Most Read Articles

English summary
Bajaj pulsar 180 motorcycle discontinued from indian market details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X