బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న 'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1'.. ఇప్పటికే 60,000 క్రాస్

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ 'బౌన్స్' (Bounce) గత సంవత్సరం మార్కెట్లో 'ఇన్ఫినిటీ E1' (Infinity E1) అనే ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసిన విషయం తెలిసిందే. అయితే కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం మంచి సంఖ్యలో బుకింగ్స్ పొందుతూ ఉంది. డెలివరీలను కూడా ఇప్పటికే ప్రారంభమయ్యాయి. కాగా కంపెనీ ఇప్పటివరకు బౌన్స్ ఇన్ఫినిటీ E1 కోసం 60,000 కంటే ఎక్కువ బుకింగ్స్ పొందినట్లు సమాచారం. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో చూద్దాం.. రండి.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న 'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1'.. ఇప్పటికే 60,000 క్రాస్

కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ని 'బ్యాటరీతో మరియు బ్యాటరీ లేకుండా' అనే ఆప్సన్స్ తో అందుబాటులోకి తీసుకువచ్చింది. కావున బ్యాటరీతో కూడిన ఈ స్కూటర్ ధర రూ. 68,999 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), కాగా బ్యాటరీ లేకుండా ఉండే ఈ స్కూటర్ ధర రూ. 45,099 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వరకు ఉంటుంది.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న 'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1'.. ఇప్పటికే 60,000 క్రాస్

కంపెనీ గతంలో ఆన్‌లైన్‌లో మాత్రమే స్కూటర్లను విక్రయించేది, అయితే ఇప్పుడు కంపెనీ డీలర్‌షిప్‌లను విస్తరించడంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగానే ఇటీవల ఢిల్లీలోని పితంపురాలో తన మొదటి ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌ను ప్రారంభించింది. ప్రస్తుతం బౌన్స్ కంపెనీ 36 ఆఫ్‌లైన్ స్టోర్‌లను నిర్వహిస్తోంది. ఇప్పటికే గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, కేరళ, ఒరిస్సా మరియు పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాల్లో రిటైల్ స్టోర్స్ ఉన్నాయి. అయితే ఈ సంవత్సరం చివరి నాటికి ఈ సంఖ్యను 75 కి చేర్చడానికి ప్రయత్నిస్తోంది.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న 'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1'.. ఇప్పటికే 60,000 క్రాస్

అంతే కాకుండా కంపెనీ ఇప్పుడు ఎక్కువమంది కస్టమర్లకు మరింత చేరువలో ఉండటానికి ఫ్లిప్‌కార్ట్‌తో భాగస్వామ్యం ఏర్పరచుకుంది. ఇప్పుడు బౌన్స్ కంపెనీ యొక్క ఇన్ఫినిటీ ఈ1 ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలనే కస్టమర్లు ఫ్లిప్‌కార్ట్‌ ద్వారా కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ లో బుక్ చేసుకున్న కేవలం 15 రోజులకు కస్టమర్ డెలివరీలను పొందవచ్చు. ఇది కొనుగోలుదారులకు మరింత సులభమైన పద్ధతి.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న 'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1'.. ఇప్పటికే 60,000 క్రాస్

బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ మొత్తం 5 కలర్ ఆప్సన్స్ ఆప్సన్స్ లో లభిస్తుంది. అవి స్పోర్టీ రెడ్, పెర్ల్ వైట్, స్పార్కిల్ బ్లాక్, కామెట్ గ్రే మరియు డెసర్ట్ సిల్వర్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అదే సమయంలో ఇది లేటెస్ట్ ఫీచర్స్ మరియు పరికరాలతో నిండి ఉంటుంది.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న 'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1'.. ఇప్పటికే 60,000 క్రాస్

కొత్త బౌన్స్ ఇన్ఫినిటీ E1 ఎలక్ట్రిక్ స్కూటర్‌ అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ కలిగి ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, ఎల్ఈడీ హెడ్‌లైట్, 12-లీటర్ బూట్ స్పేస్ మరియు హైడ్రాలిక్ సస్పెన్షన్ మరియు డిజిటల్ స్పీడోమీటర్‌ వంటివి ఉంటాయి.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న 'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1'.. ఇప్పటికే 60,000 క్రాస్

ఇక ఇందులోని ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో జియోఫెన్సింగ్, డ్రాగ్ మోడ్, రివర్స్ మోడ్, క్రూయిజ్ కంట్రోల్ మరియు యాంటిథెఫ్ట్ వంటి ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. అంతే కాకుండా ఇందులో బ్లూటూత్ ద్వారా స్కూటర్‌కు కనెక్ట్ చేయగల ఇన్ఫినిటీ స్మార్ట్ అప్లికేషన్‌ కూడా అందుబాటులో ఉంటుంది.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న 'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1'.. ఇప్పటికే 60,000 క్రాస్

బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్‌పై దాదాపు 85 కిమీ (ఎకో మోడ్‌) పరిధిని అందిస్తుంది. అదేవిధంగా పవర్ మోడ్‌లో 65 కిమీల పరిధిని అందిస్తుంది. అంతే కాకుండా ఈ కొత్త స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటాకు 65 కిమీ/గం వరకు ఉంటుంది.

కంపెనీ ఈ స్కూటర్‌లో 48వి IP67 సర్టిఫైడ్ వాటర్‌ప్రూఫ్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ని ఉపయోగించింది. కావున ఈ స్కూటర్‌ను ఏదైనా సాధారణ ఎలక్ట్రిక్ సాకెట్ నుండి ఛార్జ్ చేయవచ్చు. ఈ స్కూటర్ లో ఉండే బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ (0% నుంచి 100%) చేసుకోవడానికి 4 నుంచి 5 గంటల సమయం పడుతుంది.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న 'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1'.. ఇప్పటికే 60,000 క్రాస్

ఈ స్కూటర్ 83 ఎన్ఎమ్ టార్క్‌ అందిస్తుంది. అంతే కాకుండా ఇది కేవలం 8 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఇది అద్భుతమైన బ్రేకింగ్ సిస్టం కలిగి ఉంటుంది. దీనికోసం కంపెనీ ఈ స్కూటర్ యొక్క ముందు మరియు వెనుక భాగంలో డిస్క్ బ్రేక్‌లు అందించింది. కంపెనీ దానిలో ఎలక్ట్రానిక్ బ్రేకింగ్ సిస్టమ్ (EBS)ని ఉపయోగించింది, ఇది బ్రేకింగ్ పనితీరును మెరుగుపరచడమే కాకుండా, బ్రేకింగ్ చేసేటప్పుడు బ్యాటరీని కూడా ఛార్జ్ చేస్తుంది. ఇది నిజంగా వాహన వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న 'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1'.. ఇప్పటికే 60,000 క్రాస్

బౌన్స్ ఇన్ఫినిటీ E1 స్కూటర్ స్మార్ట్, రిమూవబుల్ Li-ion బ్యాటరీతో వస్తుంది. ఈ బ్యాటరీ ప్యాక్ అవసరమైనప్పుడు బయటకు తీయవచ్చు మరియు వినియోగదారుని సౌలభ్యం మేరకు దీనిని ఛార్జ్ చేసుకోవచ్చు. కంపెనీ తన ఎలక్ట్రిక్ స్కూటర్‌ను బ్యాటరీ లేకుండా కొనుగోలు చేసే అవకాశాన్ని కూడా ఇప్పుడు అందిస్తోంది. ఈ ఎంపిక కింద, వినియోగదారులు బ్యాటరీ లేకుండా స్కూటర్‌ను కొనుగోలు చేయవచ్చు.

బుకింగ్స్‌లో దూసుకెళ్తున్న 'బౌన్స్ ఇన్ఫినిటీ ఈ1'.. ఇప్పటికే 60,000 క్రాస్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న ఆదరణ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పటికే ఆన్‌లైన్‌లో మాత్రమే విక్రయాలను జరుపుతున్న కంపెనీలు కూడా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లను ప్రారంభిస్తున్నాయి. దీన్ని బట్టి మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికే ఓలా ఎలక్ట్రిక్ కూడా ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లను ప్రారంభిస్తోంది. రానున్న రోజుల్లో ఈ ఆఫ్‌లైన్ రిటైల్ స్టోర్‌లు మరింత ఎక్కువ సంఖ్యలో అందుబాటులోకి రానున్నాయి.

Most Read Articles

English summary
Bounce infinity e1 bookings crosses 60000 units features range and details
Story first published: Monday, October 17, 2022, 13:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X