బజాజ్ పల్సర్ ఎన్160 వర్సెస్ టీవీఎస్ అపాచే ఆర్‌టీఆర్ 160 4వి: కంపారిజన్

భారత ద్విచక్ర వాహన మార్కెట్లో 160సీసీ మోటార్‌సైకిల్ విభాగం చాలా పోటీతో కూడుకున్నది. ఈ విభాగంలో దాదాపు ప్రతి బ్రాండ్ కూడా ఓ ఉత్పత్తిని అందిస్తోంది. అయితే, బజాజ్ ఆటో నుండి మాత్రం ఈ 160సీసీ విభాగంలో ఇప్పటి వరకూ ఎలాంటి ఉత్పత్తి అందుబాటులో లేదు. తాజాగా వచ్చిన బజాజ్ పల్సర్ ఎన్160 (Bajaj Pulsar N160) తో ఆ కొరత కాస్తా తీరిపోయింది. ఇది ఈ విభాగంలోని ఇతర 160సీసీ మోటార్‌సైకిళ్లతో ప్రత్యేకించి టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వితో నేరుగా పోటీ పడుతుంది. మరి ఈ రెండూ మోడళ్ల మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాలు ఏంటో ఈ కథనంలో చూద్దాం రండి.

బజాజ్ పల్సర్ ఎన్160 వర్సెస్ టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి: కంపారిజన్

సాధారణంగా, మార్కెట్లో 160 సీసీ సెగ్మెంట్ మోటార్‌సైకిళ్లు మంచి విజయం సాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇవి అటు పవర్ మరియు ఇటు మైలేజ్ కలయికతో రోజువారీ ప్రయాణానికి చాలా అనుకూలంగా ఉంటాయి. అంటే, ఇవి పనితీరు విషయంలో ఎక్కడా రాజీ పడకుండా మెరుగైన ఇంధన సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. మరి ఈ రెండు మోడళ్లలో (బజాజ్ పల్సర్ ఎన్160 వర్సెస్ టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి) ఏది మెరుగ్గా ఉందో ఈ కథనంలో తెలుసుకుందాం రండి.

బజాజ్ పల్సర్ ఎన్160 వర్సెస్ టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి: కంపారిజన్

డిజైన్:

టూవీలర్ డిజైన్ అనేది చాలా మందికి ఓ వ్యక్తిగత అభిప్రాయం. నాకు బాగా నచ్చిన డిజైన్ ఇతరులకు నచ్చకపోవచ్చు. కాబట్టి, ఈ విషయంలో తుది నిర్ణయం మాత్రం కొనుగోలుదారుల వ్యక్తిగత అభిప్రాయం మీదే ఆధారపడి ఉంటుంది. ఏదేమైనప్పటికీ, బజాజ్ పల్సర్ ఎన్160 మరియు టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి రెండు మోటార్‌సైకిళ్లు కూడా యువత దృష్టిని ఆకర్షించేలా చాలా స్పోర్టీగా రూపొందించబడ్డాయి.

బజాజ్ పల్సర్ ఎన్160 వర్సెస్ టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి: కంపారిజన్

బజాజ్ పల్సర్ ఎన్160 డిజైన్ విషయానికి వస్తే, ఇది దాని పెద్దన్న పల్సర్ ఎన్250 డిజైన్‌ని పోలి ఉంటుంది. కాబట్టి, దీని డిజైన్ అంత కొత్తగా ఏమీ అనిపించదు. అయితే, టీవీఎస్ ఆపాచే ఆర్టీఆర్ 160 4వి ఓవరాల్ డిజైన్ కళ్లకు చాలా ఫ్రెష్‌గా కనిపిస్తుంది. అంతేకాకుండా, ఇందులోని అండర్‌బెల్లీ ఎగ్జాస్ట్ మరియు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌ల వాడకం వంటి డిజైన్ ఫీచర్ల కారణంగా ఈ మోటార్‌సైకిల్ మరింత స్పోర్టీగా ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్160 వర్సెస్ టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి: కంపారిజన్

బజాజ్ పల్సర్ ఎన్160 ఈ సెగ్మెంట్లో కొత్తగా ప్రవేశపెట్టబడిన మోటార్‌సైకిల్ కాగా, టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి మోడల్‌లో కంపెనీ ఇటీవలే ఓ రిఫ్రెష్డ్ వెర్షన్ ను మార్కెట్లో విడుదల చేసింది. ఈ అప్‌డేట్స్‌లో భాగంగా హెడ్‌లైట్ అసెంబ్లీ, డేటైమ్ రన్నింగ్ లైట్లు, బాడీ గ్రాఫిక్స్ మరియు విభిన్న కలర్ ఆప్షన్‌లతో టీవీఎస్ మోటార్‌సైకిల్ మరింత షార్ప్ గా మరియు స్పోర్టీగా కనిపిస్తుంది. కాబట్టి, డిజైన్ విషయంలో మా ఓటు టీవీఎస్ అపాచేకి వెళ్తుంది.

బజాజ్ పల్సర్ ఎన్160 వర్సెస్ టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి: కంపారిజన్

ఫీచర్లు మరియు కంఫర్ట్:

సాధారణ కమ్యూటర్ మోటార్‌సైకిళ్ల మాదిరి కాకుండా ఈ 160సీసీ సెగ్మెంట్ మోటార్‌సైకిళ్లపై కస్టమర్లకు అనేక రకాల అవసరాలు మరియు అంచనాలు ఉంటాయి. అందుకే తయారీదారులు కూడా ఈ 160సీసీ సెగ్మెంట్ మోటార్‌సైకిళ్లను ఎక్కువ పనితీరును అందించే ఇంజన్‌తో పాటుగా ఆధునిక ఫీచర్లను కూడా జోడిస్తున్నారు. సాధారణంగా, భారతదేశంలో 250సీసీ కంటే ఎక్కువ ఇంజన్ సామర్థ్యం కలిగిన మోటార్‌సైకిళ్లకు తప్పనిసరిగా ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్) ఫీచర్‌ను అందించాలి. అయితే, బజాజ్ ఆటో తమ కొత్త పల్సర్ ఎన్160 లోనే ఈ ఫీచర్‌ను అందిస్తోంది.

బజాజ్ పల్సర్ ఎన్160 వర్సెస్ టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి: కంపారిజన్

ఈ విభాగంలో బజాజ్ ఆటో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ (ఆప్షనల్) ఫీచర్ ను అందించడం ద్వారా ఈ రేసులో ముందంజలో ఉంది. ఈ ఫీచర్ కొన్ని అత్యవసర పరిస్థితులలో ప్రాణాలను కాపాడుతుంది, ముఖ్యంగా రోడ్లు తడిగా ఉన్నప్పుడు. ఈ బైక్ లోని ఇతర ఫీచర్లను గమనిస్తే అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, ఎల్ఈడి ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లు, స్ప్లిట్ సీట్లు, గేర్ పొజిషన్ ఇండికేటర్, క్లాక్, ఫ్యూయల్ ఎకానమీ మీటర్ మరియు డిస్టెన్స్-టు-ఎంప్టీ రీడ్-అవుట్ మొదలైనవి ఉన్నాయి. బజాజ్ ఎన్160 డ్యూయల్-ఛానల్ ఏబిఎస్ వేరియంట్ పెద్ద 300 మిమీ ఫ్రంట్ డిస్క్‌తో వస్తుంది. కాగా, సింగిల్-ఛానల్ ఏబిఎస్ వేరియంట్ చిన్న 280 మిమీ ఫ్రంట్ డిస్క్ బ్రేక్‌తో వస్తుంది. అయితే, రెండు వేరియంట్‌లలోని వెనుక డిస్క్ బ్రేక్ ఒకేలా 230 మిమీతో ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్160 వర్సెస్ టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి: కంపారిజన్

ఇక టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి విషయానికి వస్తే, ఈ మోటార్‌సైకిల్‌లో ఫీచర్లకు కొదవేమీ లేదు. ఇందులో ఎల్ఈడి హెడ్‌ల్యాంప్‌లు, గేర్ పొజిషన్ ఇండికేటర్‌తో కూడిన డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ వంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంటుంది. అయితే, ఇందులో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, అండర్ బెల్లీ ఎగ్జాస్ట్, స్ప్లిట్ సీట్లు వంటి కొన్ని ఫీచర్లను కోల్పోతుంది. అంతేకాకుండా, టీవీఎస్ లో బ్రేక్‌ల పరిమాణం కూడా చిన్నవిగా ఉంటాయి. ఇందులో ముందువైపు 270 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుకవైపు 200 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి.

బజాజ్ పల్సర్ ఎన్160 వర్సెస్ టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి: కంపారిజన్

ఇంజన్:

కస్టమర్లు చవకైన 150సీసీ సెగ్మెంట్ బైక్ లను కాదని, ఖరీదైన 160సీసీ సెగ్మెంట్ బైక్ లను కొనడానికి ఇదొక ప్రధాన కారణం. ఈ విషయంలో బజాజ్ పల్సర్ ఎన్160 కొంచెం వెనుకబడి ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే, ఇందులోని ఇంజన్ 160సీసీ ఇంజన్ 15.7 బిహెచ్‌పి గరిష్ట శక్తిని మరియు 14.6 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఇది 154 కిలోల వద్ద కొంచెం బరువుగా ఉంటుంది. టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి విషయానికి వస్తే, ఇందులోని ఇంజన్ గరిష్టంగా 17.39 బిహెచ్‌పి శక్తిని మరియు 14.7 ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, ఈ మోటార్‌సైకిల్ 147 కిలోల బరువుతో తేలికైన బైక్ గా ఉంటుంది.

బజాజ్ పల్సర్ ఎన్160 వర్సెస్ టీవీఎస్ అపాచే ఆర్టీఆర్ 160 4వి: కంపారిజన్

ధర:

భారతదేశంలో, ప్రోడక్ట్ మరియు బ్రాండ్ తో సంబంధం లేకుండా చాలా మంది వ్యక్తుల కొనుగోలు నిర్ణయంలో ధర అనేది కీలక పాత్ర పోషిస్తుంది. పల్సర్ ఎన్160 మరియు అపాచే ఆర్టీఆర్160 రెండు మోడళ్ల ప్రారంభ ధరలు ఇంచుమించు ఒకేలా ఉంటాయి. పల్సర్ ఎన్160 శ్రేణి ధరలు రూ.1.23 లక్షల నుండి రూ.1.28 లక్షల మధ్యలో ఉండగా, అపాచే ఆర్టీఆర్ 160 4వి రేంజ్ బైక్ ధరలు రూ.1.21 లక్షల నుండి రూ.1.26 లక్షల మధ్యలో ఉన్నాయి (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

Most Read Articles

English summary
Comparison between bajaj pulsar n160 and tvs apache rtr 160 4v
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X