భారత్‌లో Cyborg Yoda ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణ: ఫీచర్స్ & మైలేజ్

దేశంలో ఎలక్ట్రిక్ వాహన యుగం ఇప్పటికే పరుగులు తీస్తోంది. ఎలక్ట్రిక్ వాహనాల ఉత్పత్తి మరియు వినియోగం చాలా ఎక్కువగా ఉంది. దీనిని దృష్టిలో ఉంచుకుని చాలా కంపెనీలు భారతీయ మార్కెట్లో కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేస్తున్నాయి. దేశంలో ఇంధన ధరలు అమాంతం పెరుగుతున్న కారణంగా ప్రజలు కూడా ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించడానికి ఆసక్తి చూపుతున్నారు.

ఇప్పుడు దేశీయ మార్కెట్లో కోసం ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ (Ignitron Motocorp) ఒక కొత్త ఎలక్ట్రిక్ బైక్ పరిచయం చేసింది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉండటంతో పాటు మంచి డిజైన్ కూడా పొందుతుంది. ఈ కొత్త బైక్ గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.

భారత్‌లో Cyborg Yoda ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణ: ఫీచర్స్ & మైలేజ్

ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ కంపెనీ భారతీయ ఎలక్ట్రిక్ టూ వీలర్ మార్కెట్లో సైబోర్గ్ (CYBORG) పేరుతో ఒక బైక్ పరిచయం చేసింది. ఈ విభాగంలో కంపెనీ అనేక ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్‌లను తీసుకురాబోతోంది. ప్రస్తుతం కస్టమర్లు కోరుకునే ఫీచర్స్ మరియు పరికరాలను ఇందులో అందించడమే కాకుండా, పర్యావరణానికి అనుకూలంగా ఉండే విధంగా కొత్త టెక్నాలజీలను ఈ బైక్ లో తీసుకురానుంది.

భారత్‌లో Cyborg Yoda ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణ: ఫీచర్స్ & మైలేజ్

కంపెనీ వెల్లడించిన ఈ బైక్ హై రేంజ్ ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్, ఇది స్వాప్ చేయగల బ్యాటరీతో అందించబడుతుంది. కావున ఈ బైక్ లో ఉన్న బ్యాటరీని బయటకు తీసి సులభంగా ఛార్జ్ చేసుకోవచ్చు. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో Cyborg Yoda ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణ: ఫీచర్స్ & మైలేజ్

ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ కంపెనీ గుర్గావ్ లోని మనేసర్‌లోని ప్లాంట్‌లో ఈ క్రూయిజర్ బైక్ ఉత్పత్తిని ప్రారంభించింది. 2022 మరియు 2023 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్లాంట్‌లో కంపెనీ 40,000 యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. సైబోర్గ్ మిడ్ మరియు హై స్పీడ్ సెగ్మెంట్లో మూడు ఉత్పత్తులను భారత మార్కెట్లోకి తీసుకురానున్నట్లు సమాచారం.

భారత్‌లో Cyborg Yoda ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణ: ఫీచర్స్ & మైలేజ్

ఇందులో భాగంగానే కంపెనీ తీసుకురానున్న మొదటి మోడల్ క్రూయిజర్ బైక్ యోడా (Yoda). యోడా అనేది భారతీయ కస్టమర్లను దృష్టిలో ఉంచుకుని రూపొందించబడిన క్రూయిజర్ బైక్. కావున భారతదేశంలోని అన్ని రకాల భూభాగాల్లో పరీక్షిస్తోంది. కావున ఇది తప్పకుండా భారతీయ వినియోగదారులకు మన్నికైన బైక్ కానుంది.

భారత్‌లో Cyborg Yoda ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణ: ఫీచర్స్ & మైలేజ్

భారతదేశంలో చాలా కంపెనీలు ఎలక్ట్రిక్ బైక్‌లను తయారు చేస్తున్నప్పటికీ, సైబోర్గ్ యోడా భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ క్రూయిజర్ బైక్. ఈ బైక్‌కు రెట్రో క్రూయిజర్ డిజైన్ ఇవ్వబడింది. కావున ఈ బైక్‌లో నిటారుగా ఉండే హ్యాండిల్ బార్, ఫ్రంట్ లీనింగ్ ఫుట్‌ప్యాడ్, పిలియన్ బ్యాక్‌రెస్ట్ మరియు వైడ్ స్ప్లిట్, టియర్ డ్రాప్ ఫ్యూయల్ ట్యాంక్, సర్క్యులర్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్, టైల్ లాంప్ మరియు టర్న్ ఇండికేటర్ వంటి వాటిని పొందుతుంది.

భారత్‌లో Cyborg Yoda ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణ: ఫీచర్స్ & మైలేజ్

కొత్త సైబోర్గ్ యోడా క్రూయిజర్ బైక్‌ యొక్క ఫీచర్స్ విషయానికి వస్తే, ఇందులో కీలెస్ ఇగ్నిషన్, యాంటీ-థెఫ్ట్ అలారం, అడ్జస్టబుల్ సస్పెన్షన్, సైడ్ లగేజ్ బాక్స్ వంటివి ఉన్నాయి. అయితే ప్రస్తుతం కంపెనీ ఈ బైక్‌కు సంబంధించిన ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్‌ను అధికారికంగా వెల్లడించలేదు. త్వరలో వెల్లడవుతాయి.

భారత్‌లో Cyborg Yoda ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణ: ఫీచర్స్ & మైలేజ్

దీని గురించి ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు 'రాఘవ్ కల్రా' మాట్లాడుతూ, మా కొత్త బ్రాండ్ CYBORGతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ మోటార్‌బైక్ విభాగంలోకి మా ప్రవేశాన్ని ప్రకటించినందుకు మేము సంతోషిస్తున్నాము. ఎలక్ట్రిక్ మొబిలిటీ రవాణా అనేది భవిష్యత్ లో వేగంగా ముందుకు దూసుకెళ్తుంది. కావున త్వరలో దేశీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేయడానికి సన్నాహాలు సిద్ధం చేస్తున్నామని ఆయన అన్నారు.

భారత్‌లో Cyborg Yoda ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణ: ఫీచర్స్ & మైలేజ్

కంపెనీ ఈ బైక్ యొక్క బ్యాటరీ, మోటార్ మరియు ఛార్జింగ్ యొక్క ఖచ్చితమైన వివరాలను వెల్లడించలేదు. అయితే సైబోర్గ్ యోడా బైక్ లిథియం-అయాన్ బ్యాటరీతో శక్తిని పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో దాదాపు 120 కి.మీ పరిధిని అందిస్తుందని ఆశిస్తున్నాము.

భారత్‌లో Cyborg Yoda ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణ: ఫీచర్స్ & మైలేజ్

ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ బైక్ రోడ్‌సైడ్ అసిస్టెన్స్ మరియు బ్యాటరీ స్వాపింగ్ స్టేషన్‌లను అందించడానికి స్థానిక విక్రేతలతో భాగస్వామి అవుతుంది. ఎలక్ట్రిక్ వాహనాలను ఛార్జ్ చేయడానికి కిలోమీటరుకు ఒక ఛార్జింగ్ స్టేషన్‌ను అందిస్తామని కూడా కంపెనీ పేర్కొంది. ఇది కాకుండా, కంపెనీ వినియోగదారుల ఇళ్ల వద్ద ఛార్జింగ్ పాయింట్లను కూడా ఏర్పాటు చేయడానికి కూడా సన్నద్ధమవుతోంది. ఈ ఛార్జింగ్ పిన్‌తో కేవలం ఒక గంటలో బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

భారత్‌లో Cyborg Yoda ఎలక్ట్రిక్ బైక్ ఆవిష్కరణ: ఫీచర్స్ & మైలేజ్

ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ ప్రైవేట్ లిమిటెడ్ CYBORG బ్రాండ్ పేరుతో భారతదేశంలో 2021 లో స్థాపించబడింది. మార్చి 2021లో కంపెనీ భారతదేశంలో ఖచ్చితమైన హై స్పీడ్ ఎలక్ట్రిక్ మోటార్‌బైక్‌లను అభివృద్ధి చేయడానికి అనుకూల నిర్మాణ వాహనాల్లోకి ప్రవేశించడం ద్వారా ముందుకు వచ్చింది. ఇగ్నిట్రాన్ మోటోకార్ప్ యొక్క లక్ష్యం భారతదేశంలో సురక్షితమైన మోటార్‌బైక్‌లను తయారు చేయడం.

Most Read Articles

English summary
Cyborg yoda electric cruiser bike features specifications unveiled details
Story first published: Sunday, January 2, 2022, 9:51 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X