త్వరపడండి.. హోండా టూవీలర్లపై పండుగ సీజన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మరియు నో కాస్ట్ ఈఎమ్ఐ స్కీమ్‌లు..

మీకు హోండా టూవీలర్ అంటే ఇష్టమా? ఈ పండుగ సీజన్‌లో మీరు కూడా హోండా టూవీలర్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీ కోసమే హోండా తమ టూవీలర్లపై గొప్ప తగ్గింపులు మరియు వివిధ రకాల ప్రయోజనాలను అందిస్తోంది. భారతదేశంలో ప్రస్తుత పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా లిమిటెడ్ తమ ఉత్పత్తులపై వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది.

త్వరపడండి.. హోండా టూవీలర్లపై పండుగ సీజన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మరియు నో కాస్ట్ ఈఎమ్ఐ స్కీమ్‌లు..

ఈ పండుగ సీజన్‌లో హోండా తమ టూవీలర్లపై క్యాష్‌బ్యాక్, జీరో డౌన్ పేమెంట్ మరియు వడ్డీ లేని ఈఎమ్ఐ వంటి ఆఫర్‌లను అందిస్తోంది. హోండా పండుగ ఆఫర్‌లో, మీరు ఏదైనా హోండా స్కూటర్ లేదా బైక్ కొనుగోలుపై 5 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. ఈ క్యాష్‌బ్యాక్ గరిష్టంగా రూ. 5000 వరకు ఉంటుంది. ఇది కాకుండా, మీరు ఫైనాన్స్ పొందడం ద్వారా ద్విచక్ర వాహనం కొనాలని ఆలోచిస్తున్నట్లయితే, దాని కోసం కంపెనీ కొన్ని షరతులతో జీరో డౌన్ పేమెంట్‌ స్కీమ్‌ను కూడా అందిస్తోంది.

త్వరపడండి.. హోండా టూవీలర్లపై పండుగ సీజన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మరియు నో కాస్ట్ ఈఎమ్ఐ స్కీమ్‌లు..

వెహికల్ ఫైనాన్స్ పొందడానికి మీరు ఎలాంటి వస్తువును తనఖా పెట్టనవసరం కూడా ఉండదు. వినియోగదారులకు నో కాస్ట్ ఈఎమ్ఐ (No Cost EMI) స్కీమ్ పేరుతో వడ్డీ లేకుండా రుణ ప్రయోజనాన్ని కూడా హోండా కల్పిస్తోంది. అయితే, ఈ ఆఫర్‌లకు కొన్ని షరతులు వర్తిస్తాయి. కాగా, క్యాష్‌బ్యాక్ కోసం కంపెనీ స్టాండర్డ్ చార్టర్డ్, ఫెడరల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఐడిఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, వన్ కార్డ్ వంటి కంపెనీలతో భాగస్వామ్యాన్ని కలిగి ఉంది. ఈ బ్యాంకుల కార్డులు కలిగి ఉన్న వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది.

త్వరపడండి.. హోండా టూవీలర్లపై పండుగ సీజన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మరియు నో కాస్ట్ ఈఎమ్ఐ స్కీమ్‌లు..

ఈ ఫైనాన్స్ స్కీమ్‌లు ఎంపిక చేసిన హోండా డీలర్‌షిప్‌లలో అందుబాటులో ఉంటాయి మరియు ఇవి అక్టోబర్ 31, 2022 వరకు చెల్లుబాటులో ఉంటాయి. హోండా టూవీలర్ డీలరును బట్టి ఆఫర్లు మారుతూ ఉంటాయి మరియు ఎలాంటి ముందస్తు నోటీసు లేకుండా ఈ ఆఫర్‌ను ఉపసంహరించుకోవచ్చని కూడా కంపెనీ తెలిపింది. కాబట్టి, ఈ ఆఫర్లకు సంబంధించిన మరింత ఖచ్చితమైన సమాచారం కోసం మీ సమీపంలో అధీకృత హోండా టూవీలర్ డీలర్‌షిప్‌ను సంప్రదించవచ్చు.

త్వరపడండి.. హోండా టూవీలర్లపై పండుగ సీజన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మరియు నో కాస్ట్ ఈఎమ్ఐ స్కీమ్‌లు..

భారతదేశంలో హీరో మోటోకార్ప్ తర్వాత అత్యధికంగా టూవీలర్లను విక్రయించే కంపెనీ హోండా. అయితే, గత నెలలో మాత్రం హోండా టూవీలర్ అమ్మకాలు హీరో టూవీలర్ అమ్మకాల కంటే ఎక్కువగా ఉన్నాయి. గడచిన సెప్టెంబర్ 2022 నెలలో హీరో మోటోకార్ప్ భారతదేశంలో 2,22,712 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించగా, ఇదే సమయంలో హోండా ఏకంగా 2,55,909 యూనిట్ల ద్విచక్ర వాహనాలను విక్రయించి, హీరో మోటోకార్ప్‌ను ఓవర్‌టేక్ చేసింది. హోండా నుండి కొత్తగా వస్తున్న టూవీలర్లు కంపెనీ మొత్తం అమ్మకాల పెరుగుదలలో కీలకంగా వ్యవహరిస్తున్నాయి.

త్వరపడండి.. హోండా టూవీలర్లపై పండుగ సీజన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మరియు నో కాస్ట్ ఈఎమ్ఐ స్కీమ్‌లు..

హోండా టూ వీలర్లలో హోండా షైన్ మరియు హోండా యాక్టివా స్కూటర్లు అత్యధికంగా అమ్ముడవుతున్న టాప్ 2 మోడళ్లుగా ఉన్నాయి. కంపెనీ ఇటీవలే హోండా షైన్ యొక్క సెలబ్రేషన్ ఎడిషన్‌ను విడుదల చేసింది. మార్కెట్లో ఈ స్పెషల్ ఎడిషన్ ధర రూ. 78,878 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. హోండా సిబి షైన్ సెలబ్రేషన్ ఎడిషన్ రెడ్ అండ్ బ్లాక్ కలర్‌ కాంబినేషన్‌తో ఆకర్షణీయమైన గోల్డెన్ పెయింట్‌తో అందించబడింది. ఇందులో బాడీ కలర్‌తో మ్యాచ్ అయ్యే బైక్ సీటు కూడా ఉంటుంది.

త్వరపడండి.. హోండా టూవీలర్లపై పండుగ సీజన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మరియు నో కాస్ట్ ఈఎమ్ఐ స్కీమ్‌లు..

కాగా, గడచిన ఆగస్టు నెలలో హోండా తమ బెస్ట్ సెల్లింగ్ స్కూటర్ యాక్టివాలో 6వ తరం మోడల్‌ను విడుదల చేసింది. హోండా యాక్టివా 6జి పేరుతో వచ్చిన ఈ కొత్త తరం స్కూటర్ ధర రూ. 75,400 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)గా ఉంది. ఈ స్కూటర్ టాప్-స్పెక్ హోండా యాక్టివా డిఎల్‌ఎక్స్ వేరియంట్ కంటే రూ. 1,000 ఖరీదైనదిగా ఉంటుంది. కాగా, హోండా యాక్టివా 6జి యొక్క స్టాండర్డ్ వేరియంట్ ధరలు రూ.72,400 (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతాయి.

త్వరపడండి.. హోండా టూవీలర్లపై పండుగ సీజన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మరియు నో కాస్ట్ ఈఎమ్ఐ స్కీమ్‌లు..

హోండా మొట్టమొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ వస్తోంది..

ఇదిలా ఉంటే, దేశంలోని అన్ని ప్రధాన టూవీలర్ కంపెనీలు ఎలక్ట్రిక్ టూవీలర్ మార్కెట్లోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో, హోండా కూడా ఈ విభాగంలో ప్రవేశించేందుకు సిద్ధమైంది. బజాజ్, టీవీఎస్ కంపెనీలు ఇప్పటికే ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయిస్తుండగా, హీరో మోటోకార్ప్ ఈనెల 7వ తేదీన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనుంది. ఈ నేపథ్యంలో, హోండా కూడా తమ మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను 2023 నాటికి భారతదేశంలో విడుదల చేస్తామని ప్రకటించింది.

త్వరపడండి.. హోండా టూవీలర్లపై పండుగ సీజన్ క్యాష్‌బ్యాక్ ఆఫర్లు మరియు నో కాస్ట్ ఈఎమ్ఐ స్కీమ్‌లు..

హోండా టూవీలర్ కంపెనీ ప్రెసిడెంట్ అట్సుషి ఒగాటా ప్రకారం, హోండా యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం కంపెనీ యొక్క అత్యధికంగా అమ్ముడవుతున్న యాక్టివా స్కూటర్ కంటే తక్కువ ధరను కలిగి ఉంటుంది. అంటే, హోండా ఎలక్ట్రిక్ స్కూటర్ ధర సుమారు రూ. 72,000 నుండి రూ. 75,000 (ఎక్స్-షోరూమ్) మధ్యలో ఉండొచ్చని అంచనా. హోండాతో పాటు యమహా, సుజుకి వంటి ద్విచక్ర వాహనాల కంపెనీలు కూడా ఎలక్ట్రిక్ స్కూటర్లను తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నాయి. మరిన్ని లేటెస్ట్ ఆటోమొబైల్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Festive discounts on honda motorcycles and scooters details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X