ఆంపియర్ ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్; డిసెంబర్ 2021లో 10,000 యూనిట్లకు పైగా సేల్స్!

గ్రీవ్స్ కాటన్ లిమిటెడ్ యాజమాన్యంలో ఉన్న ఎలక్ట్రిక్ మొబిలిటీ విభాగం గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ (Greaves Electric Mobility) దేశంలో తన వ్యాపారాన్ని వేగంగా విస్తరిస్తోంది. ఈ కంపెనీ ఆంపియర్ బ్రాండ్ పేరుతో ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తోంది. ఇటీవలే తమిళనాడులోని రాణిపేటలో ఓ అతిపెద్ద ఎలక్ట్రిక్ వాహన తయారీ కేంద్రాన్ని కూడా ప్రారంభించింది. రాణిపేటలో సుమారు 35 ఎకరాల విస్తీర్ణంలో కంపెనీ తమ కొత్త ఎలక్ట్రిక్ వాహన తయారీ ప్లాంట్‌ని నిర్మించింది.

ఆంపియర్ ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్; డిసెంబర్ 2021లో 10,000 యూనిట్లకు పైగా సేల్స్!

నెట్‌వర్క్ విస్తరణ మరియు వాహనాల ఉత్పత్తిని పెంచిన కారణంగా గడచిన డిసెంబర్ 2021లో గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ గణనీయమైన విక్రయాలను నమోదు చేసింది. గత నెలలో ఈ కంపెనీ 10,000 కంటే ఎక్కువ వాహనాలను విక్రయించింది. గతేడాది ఇదే సమయంలో ఈ కంపెనీ విక్రయించే ఈ-త్రీవీలర్ల విక్రయాలు 101 శాతం పెరిగాయి. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎలక్ట్రిక్ టూవీలర్స్ మరియు ఎలక్ట్రిక్ త్రీవీలర్స్ సెగ్మెంట్ రెండింటిలోనూ మార్కెట్ లీడర్‌గా తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటోంది.

ఆంపియర్ ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్; డిసెంబర్ 2021లో 10,000 యూనిట్లకు పైగా సేల్స్!

వాల్యూమ్ పరంగా చూస్తే, ఆంపియర్ గత సంవత్సరం ఇదే నెలతో పోలిస్తే డిసెంబర్ 2021లో ఆదాయంలో దాదాపు 6 రెట్లు వృద్ధిని నమోదు చేసిందని మరియు ఇ-3-వీలర్స్ వ్యాపారంలో 101 శాతం వృద్ధిని నమోదు చేసిందని కంపెనీ పేర్కొంది. అలాగే, అక్టోబర్-డిసెంబర్ 2021 త్రైమాసికంలో కంపెనీ ప్రోత్సాహకర ఫలితాలను నమోదు చేసింది. ఈ సమయంలో కంపెనీ రాణిపేటలో తమ మెగా EV ఫ్యాక్టరీని మరియు మరో ఈ-త్రీ వీలర్ కంపెనీ ఎమ్ఎల్ఆర్ ఆటో (తేజా) బ్రాండ్‌ను ప్రారంభించింది.

ఆంపియర్ ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్; డిసెంబర్ 2021లో 10,000 యూనిట్లకు పైగా సేల్స్!

అంతేకాకుండా, ఇ-త్రీ-వీలర్ కంపెనీ ఈఎల్ఈ (ఇ-రిక్షా)లో కూడా 100 శాతం వాటాను కొనుగోలు చేసినట్లు కంపెనీ తెలిపింది. గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటి తమ మెగా ఈవీ ప్లాంట్ ను ప్రారంభించినట్లు ఆంపియర్ ఇటీవల ప్రకటించిన తర్వాత డిసెంబర్‌లో అధిక వృద్ధి సంఖ్యలు వచ్చాయని కంపెనీ తెలియజేసింది. కంపెనీ ఇటీవల విడుదల చేసిన మాగ్నస్ ఈఎక్స్ వేరియంట్, పెద్ద ఫ్యామిలీ ఇ-స్కూటర్ కూడా కస్టమర్‌లకు ఆకట్టుకుంటోంది.

ఆంపియర్ ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్; డిసెంబర్ 2021లో 10,000 యూనిట్లకు పైగా సేల్స్!

ఇటీవలి కాలంలో పెట్రోల్ ధరలు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో, కస్టమర్లు ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో, అధునాతన డిటాచబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్ తో వచ్చిన మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఛార్జ్ పై గరిష్టంగా 100 కి.మీ కంటే ఎక్కువ రేంజ్‌ను అందిస్తుందని, ఇది ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మరియు వినియోగదారులకు లాభదాయకంగా ఉంటుందని కంపెనీ తెలిపింది.

ఆంపియర్ ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్; డిసెంబర్ 2021లో 10,000 యూనిట్లకు పైగా సేల్స్!

ఈ సందర్భంగా ఆంపియర్ వెహికల్స్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రాయ్ కురియన్ మాట్లాడుతూ, ఆంపియర్‌ బ్రాండ్ తో తమ ఇ-టూవీలర్ సెగ్మెంట్ గొప్ప విజయాన్ని సాధించిందని మరియు డిసెంబర్ 2021 అమ్మకాల పనితీరు దానికి నిదర్శనమని అన్నారు. తాము ఇటీవల ప్రారంభించిన Magnus EX ఎలక్ట్రిక్ స్కూటర్ కు దేశవ్యాప్తంగా వినియోగదారుల నుండి విస్తృతమైన ఆదరణ లభిస్తోందని చెప్పారు.

ఆంపియర్ ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్; డిసెంబర్ 2021లో 10,000 యూనిట్లకు పైగా సేల్స్!

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీ కంపెనీ తన లాంగ్ రేంజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ను అక్టోబర్ 2021లో భారత మార్కెట్లో విడుదల చేసింది. దేశీయ విపణిలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రారంభ ధర రూ. 68,999 (ఎక్స్-షోరూమ్) గా ఉంటుంది. ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ యొక్క అత్యంత అద్భుతమైన లక్షణం ఏంటంటే, సింగిల్ చార్జ్ పై అది ఆఫర్ చేసే రేంజ్. ఏఆర్ఏఐ సర్టిఫై చేసిన దాని ప్రకారం, ఇది పూర్తి ఛార్జ్‌పై 121 కిమీ రేంజ్ ను అందిస్తుందని కంపెనీ తెలిపింది.

ఆంపియర్ ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్; డిసెంబర్ 2021లో 10,000 యూనిట్లకు పైగా సేల్స్!

కొత్త ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఇ-స్కూటర్ లో వేరు చేయగలిగిన, తేలికైన మరియు పోర్టబుల్ లిథియం బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. ఇంకా ఇందులో 1200-వాట్ల ఎలక్ట్రిక్ మోటార్ కూడా ఉంటుంది. ఇది ఈ విభాగంలో అత్యధిక రేటింగ్ పొందిన ఎలక్ట్రిక్ మోటార్లలో ఒకటి. ఈ మోటార్ పనితీరును గమనిస్తే, ఇది కేవలం 10 సెకన్లలోనే స్కూటర్‌ను 0 నుండి 40 కి.మీ వరకు వేగవంతం చేస్తుందని కంపెనీ పేర్కొంది.

ఆంపియర్ ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్; డిసెంబర్ 2021లో 10,000 యూనిట్లకు పైగా సేల్స్!

అంతేకాకుండా, ఈ స్కూటర్‌లో సూపర్ సేవ్ ఎకో మోడ్ మరియు పెప్పియర్ పవర్ మోడ్ అనే రెండు రైడింగ్ మోడ్‌లు కూడా ఉన్నాయి. ఆంపియర్ మాగ్నస్ ఈఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఇతర ఫీచర్లను పరిశీలిస్తే, ఇందులో ఎల్ఈడి హెడ్‌లైట్, 450 మిమీ పెద్ద లెగ్‌రూమ్ స్పేస్, కీలెస్ ఎంట్రీ, వెహికల్ ఫైండర్, యాంటీథెఫ్ట్ అలారం, రిమూవబల్ బ్యాటరీ ప్యాక్, మెరుగైన డ్రైవింగ్ రేంజ్, లేటెస్ట్ డిజైన్ మరియు సౌకర్యవంతమైన వెడల్పాటి సీటు వంటి మరెన్నో ఫీచర్లను కలిగి ఉంది.

ఆంపియర్ ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్; డిసెంబర్ 2021లో 10,000 యూనిట్లకు పైగా సేల్స్!

గ్రీవ్స్ ఎలక్ట్రిక్ మొబిలిటీకి చెందిన ఆంపియర్ బ్రాండ్ తమ బిజినెస్ టు బిజినెస్ (బి2బి) మోడల్ క్రింద డెలివరీ భాగస్వాములు మరియు రైడ్-షేరింగ్ కంపెనీలకు పెర్ఫార్మెన్స్ స్కూటర్లను అందిస్తోంది. అలాగే వ్యక్తిగత కస్టమర్ల కోసం ఆంపియర్ విస్తృత స్థాయి ఎలక్ట్రిక్ స్కూటర్లను అందిస్తోంది. ఆంపియర్ అందిస్తున్న కొన్ని రకాల ఎలక్ట్రిక్ స్కూటర్లలో రియో, మాగ్నస్, జిల్, వి48తో పాటుగా మరికొన్ని ఇతర మోడళ్లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Most Read Articles

English summary
Greaves electric mobility sold over 10000 electric vehicles in december 2021 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X