హీరో మోటోకార్ప్ వెబ్‌సైట్‌లో కనిపించని Xpulse 200 2V: భారత్‌లో నిలిపివేయబడుతుందా..?

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన టూ వీలర్ తయారీ సంస్థ 'హీరో మోటోకార్ప్' తన వెబ్‌సైట్ జాబితాలో Xpulse 200 2V ని తొలగించింది. కంపెనీ దేశీయ మార్కెట్లో Xpulse 200 2V యొక్క అమ్మకాలను నిలిపివేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. దీని గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

హీరో మోటోకార్ప్ తన Xpulse 200 2V బైకుని వెబ్‌సైట్ నుంచి తొలగించడానికి గల కారణాన్ని వెల్లడించనప్పటికీ, Xpulse లైనప్‌ను క్రమబద్ధీకరించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకుని ఉండవచ్చని తెలుస్తోంది. బహుశా కంపెనీ త్వరలో తీసుకురానున్న 300 సిసి అడ్వెంచర్ బైక్ కి తన లైనప్‌లో చోటు కల్పించే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నాము. ప్రస్తుతం ఈ లైనప్‌లో Xpulse 200 4V మరియు Xpulse 200T ఉన్నాయి.

హీరో మోటోకార్ప్ వెబ్‌సైట్‌లో కనిపించని Xpulse 200 2V

భారతీయ మార్కెట్లో Hero Xpulse 200 2V బైక్ ధర రూ. 1.27 లక్షలు వద్ద ఉంది. అయితే ఇది దాని Xpulse 200 4V కంటే కూడా రూ. 10,000 తక్కువ. అంటే మార్కెట్లో ప్రస్తుతం Xpulse 200 4V ధర రూ. 1.37 లక్షలు. దీన్ని బట్టి చూస్తే హీరో మోటోకార్ప్ యొక్క 200 2V సరసమైన అడ్వెంచర్ టూరింగ్ బైక్. కావున ఎక్కువమంది ఈ బైక్ వినియోగించడానికి ఆసక్తి చూపుతారు.

Hero Xpulse 200 2V బైక్ 199.6 సిసి సింగిల్ సిలిండర్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.8 బిహెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 16.45 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ ఇంజిన్ 5 స్పీడ్ గేర్ బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. కాగా ఇది 200 4V కంటే కూడా 1.3 హెచ్‌పి పవర్ మరియు 0.9 ఎన్ఎమ్ టార్క్ తక్కువగా ప్రొడ్యూస్ చేస్తుంది.

Hero Xpulse 200 2V మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఎల్‌ఈడీ హెడ్‌లైట్, ఎల్‌ఈడీ టెయిల్‌లైట్, బ్లూటూత్ కనెక్ట్ చేయబడిన ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటివి ఉన్నాయి. అంతే కాకూండా ఈ బైక్ వైట్, మ్యాట్ గ్రీన్, మ్యాట్ గ్రే, స్పోర్ట్స్ రెడ్ మరియు పాంథర్ బ్లాక్ అనే కలర్ ఆప్సన్స్ లో కూడా లభిస్తుంది. కావున బైక్ రైడర్లు ఇందులో తమకు నచ్చిన కలర్ ఆప్సన్ ఎంచుకోవచ్చు.

హీరో Xpulse 200 2V సస్పెన్షన్ విషయానికి వస్తే, ఈ బైక్ యొక్క ముందు భాగంలో 37 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్‌లు మరియు వెనుక భాగంలో 10 వే అడ్జస్టబుల్ మోనో-షాక్ సెటప్ పొందుతుంది. ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు వైపున 276 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్ మరియు వెనుక భాగంలో 220 మిమీ పెటల్ డిస్క్ బ్రేక్ కలిగి ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్ సింగిల్ ఛానల్ ABS తో అందుబాటులో ఉంటుంది.

ఇదిలా ఉండగా హీరో మోటోకార్ప్ తన వాహనాల ధరలను 2022 డిసెంబర్ 01 నుంచి రూ. 1,500 ధరలను పెంచింది. ఈ ధరల పెరుగుదల ఈ సంవత్సరంలో ముచ్చటగా నాలుగవ సారి కావడం గమనార్హం. 2022 సెప్టెంబర్ నెలలో కంపెనీ తమ ద్విచక్ర వాహనాలపైన రూ. 1,000 ధరలను పెంచింది. ఇప్పుడు మరో సారి (2022 డిసెంబర్ 01) రూ. 1,500 పెంచింది. పెరుగుతున్న ఇన్‌పుట్ ధరల కారణంగానే కంపెనీ ధరలను పెంచినట్లు తెలిసింది.

కంపెనీ ప్రస్తుతం స్కూటర్ విభాగంలో హీరో ప్లెజర్+ XTEC, డెస్టిని 125 XTEC, మాస్ట్రో ఎడ్జ్ 125 మరియు మాస్ట్రో ఎడ్జ్ 110 వంటి వాటిని విక్రయిస్తోంది. పెరిగిన ధరలు ప్రస్తుతం HF డీలక్స్, స్ప్లెండర్, ప్లెజర్ మొదలైన ఎంట్రీ-లెవల్ మోడల్‌లపై కూడా ప్రభావం చూపుతాయి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు మరియు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు, బైకుల గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hero motocorp removed xpulse 200 2v in website details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X