రైడింగ్‌కి సిద్దమేనా.. భారత్‌లో Hero Xpulse 200T 4V విడుదలైపోయింది: ధర & వివరాలు చూడండి

'హీరో మోటోకార్ప్' దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు తన 'ఎక్స్‌‌పల్స్ 200టి 4వి' బైక్ విడుదల చేసింది. ఈ బైక్ ధర రూ. 1,25,726 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). దేశీయ విఫణిలో విడుదలైన ఈ కొత్త 'హీరో ఎక్స్‌‌పల్స్ 200టి 4వి' గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

గత కొన్ని రోజులుగా టెస్టింగ్ దశలో ఉన్న 'హీరో ఎక్స్‌‌పల్స్ 200టి 4వి' కొత్త సంవత్సరం రాక ముందే దేశీయ మార్కెట్లో విడుదలైపోయింది. ఈ బైక్ ఆధునిక డిజైన్, లేటెస్ట్ ఫీచర్స్ పొందుతుంది. ఈ బైక్ మొత్తమ్ మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి మాట్ ఫంక్ లైమ్ ఎల్లో, మాట్ షీల్డ్ గోల్డ్ మరియు స్పోర్ట్స్ రెడ్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

భారత్‌లో Hero Xpulse 200T 4V విడుదలైపోయింది

కొత్త Hero Xpulse 200T 4V ఎల్‌ఈడీ హెడ్‌లైట్, బెల్లీ పాన్, ఫోర్క్ గైటర్స్, కొత్త ఫ్లై స్క్రీన్, కొత్త డ్యూయల్-టోన్ సీటు వంటి వాటితో పాటు మరిన్ని కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లను కూడా పొందుతుంది. అంతే కాకుండా ఇందులో బ్లూటూత్ కనెక్టివిటీతో కూడిన ఎల్‌సిడి ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ ఉంటుంది. ఇది టర్న్-బై-టర్న్ నావిగేషన్, గేర్ ఇండికేటర్, ట్రిప్ మీటర్, సర్వీస్ రిమైండర్ వంటి వాటిని ప్రదర్శిస్తుంది.

ఇక ఇంజిన్ విషయానికి వస్తే, Hero Xpulse 200T 4V బైక్ దాని Xpulse 200 4V మాదిరిగానే అదే 199.6సిసి ఎయిర్-అండ్-ఆయిల్ కూల్డ్ ఇంజిన్ పొందుతుంది. ఇది 8,500 ఆర్‌పిఎమ్ వద్ద 19.1 హెచ్‌పి పవర్ మరియు 6,500 ఆర్‌పిఎమ్ వద్ద 17.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. ఇది దాని Xpulse 200T 2V ఎక్కువ పవర్ అవుట్‌పుట్ అందిస్తుంది.

భారత్‌లో Hero Xpulse 200T 4V విడుదలైపోయింది

మెకానికల్స్ పరంగా హీరో ఎక్స్‌‌పల్స్ 200టి 4వి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇందులో 7 టైప్స్ అడ్జస్టబుల్ మోనోషాక్‌ సస్పెన్షన్ సెటప్ కలిగి ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క ముందు భాగంలో 276 మిమీ డిస్క్ బ్రేక్స్, వెనుక భాగంలో 220 మిమీ డిస్క్ బ్రేక్ కలిగి సింగిల్ ఛానల్ ఏబీఎస్ తో జతచేయబడి ఉంటుంది. కావున మంచి బ్రేకింగ్ సిస్టం ఇందులో అందుబాటులో ఉంటుంది.

హీరో ఎక్స్‌‌పల్స్ 200టి 4వి బైక్ యొక్క రెండు చివర్లలో 17-ఇంచెస్ రిమ్స్ ఉంటాయి. ఈ బైక్ ముందు భాగంలో 100/80-17 ట్యూబ్‌లెస్ టైర్స్ మరియు వెనుక వైపు 130/70-R17 ట్యూబ్‌లెస్ టైర్స్ అందుబాటులో ఉంటాయి. మొత్తం మీద కొత్త హీరో ఎక్స్‌‌పల్స్ 200టి 4వి దాని మునుపటి మోడల్స్ కంటే కూడా ఉత్తమ పనితీరుని అందించే విధంగా రూపొందించబడింది. కావున ఇది బైక్ రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో Hero Xpulse 200T 4V విడుదలైపోయింది

దేశీయ మార్కెట్లో విడుదలైన కొత్త హీరో ఎక్స్‌‌పల్స్ 200టి 4వి తన విభాగంలో యమహా FZS FI మరియు హోండా ఎక్స్‌బ్లేడ్ వంటి 150 సిసి బైకులకు ప్రత్యర్థిగా ఉంటుంది. కావున అమ్మకాల పరంగా ఈ బైక్ కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే తప్పకుండా మంచి అమ్మకాలు పొందే అవకాశం ఉందని భావిస్తున్నాము. అయితే ఎలాంటి అమ్మకాలు పొందుతుంది అనే వివరాలు మాత్రం తెలియాల్సి ఉంది.

Hero Xpulse 200T 4V పై మా అభిప్రాయం:

దేశీయ మార్కెట్లో ఆధునిక హంగులతో విడుదలైన 'హీరో ఎక్స్‌‌పల్స్ 200టి 4వి' తప్పకుండా బైక్ ప్రేమికుల మనసును దోచుకునే అవకాశం ఉంది. రానున్న న్యూ ఇయర్ సమయంలో భారతీయ మార్కెట్లో తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుందని ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలతో పాటు మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు కొత్త బైకుల గురించి ఎప్పటికప్పుడు మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Hero xpulse 200t 4v launched in india price features details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X