భారత్‌లో విడుదలైన 'హోండా డియో స్పోర్ట్స్‌': ధర & వివరాలు

డియో.. డియో డిసక డిసక.. అనే పాట ఎంత పాపులరో అందరికి తెలుసు, అంతకంటే పాపులర్ మన 'హోండా మోటార్‌సైకిల్' (Honda Motorcycles) యొక్క 'డియో' (Dio) స్కూటర్. అయితే కంపెనీ ఇప్పుడు ఇందులో 'డియో స్పోర్ట్స్‌' (Dio Sports) విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త స్కూటర్ గురించి మరింత సమాచారం ఈ కథనంలో చూద్దాం.. రండి.

భారత్‌లో విడుదలైన 'హోండా డియో స్పోర్ట్స్‌': ధర & వివరాలు

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'హోండా డియో స్పోర్ట్స్' రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి స్టాండర్డ్ వేరియంట్ మరియు డీలక్స్ వేరియంట్. వీటి ధరలు వరుసగా రూ. 68,317 మరియు రూ. 73,317 (ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ కొత్త కొత్త డియో స్కూటర్ కొనుగోలు చేయాలనే కస్టమర్లు రెడ్ వింగ్ డీలర్‌షిప్ ద్వారా లేదా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు.

భారత్‌లో విడుదలైన 'హోండా డియో స్పోర్ట్స్‌': ధర & వివరాలు

హోండా డియో స్పోర్ట్స్ స్కూటర్ బ్లాక్ కలర్ స్కీమ్‌లతో స్ట్రోంటియమ్ సిల్వర్ మెటాలిక్ మరియు స్పోర్ట్స్ రెడ్‌లో అందుబాటులో ఉంటుంది. కావున ఇది చాలా ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా యువ కస్టమర్లను ఆకర్షించడంలో తప్పకుండా విజయం పొందుతుంది.

భారత్‌లో విడుదలైన 'హోండా డియో స్పోర్ట్స్‌': ధర & వివరాలు

ఈ స్కూటర్‌లో కొత్తగా రూపొందించిన గ్రాఫిక్స్ మరియు స్పోర్టీ రెడ్ రియర్ సస్పెన్షన్ వంటివి ఉన్నాయి. డీలక్స్ వేరియంట్‌లో స్పోర్టీ అల్లాయ్ వీల్స్ అందుబాటులో ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఫ్రంట్ పాకెట్‌ కూడా ఉంటుంది. ఇది స్టోరేజ్ స్పేస్ గా ఉపయోగపడుతుంది.

భారత్‌లో విడుదలైన 'హోండా డియో స్పోర్ట్స్‌': ధర & వివరాలు

'డియో స్పోర్ట్స్' స్కూటర్ లాంచ్ సందర్భంగా హోండా మోటార్‌సైకిల్ & స్కూటర్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, ప్రెసిడెంట్ & సీఈఓ అట్సుషి ఒగాటా మాట్లాడుతూ.. భారతీయ మార్కెట్లో డియో ప్రారంభమైనప్పటినుంచి కూడా ఉత్తమ అమ్మకాలను పొందుతూ ముందుకు సాగుతోంది. అయితే ఇప్పుడు విడుదలైన ఈ కొత్త డియో స్పోర్ట్స్ అనేది రిఫ్రెష్ కలర్ ఆప్సన్స్ తో అందుబాటులో ఉంటుంది. కావున ఇది తప్పకుండా కొనుగోలుదారులు ఆకర్శించే అవకాశం ఉంటుంది అన్నారు.

భారత్‌లో విడుదలైన 'హోండా డియో స్పోర్ట్స్‌': ధర & వివరాలు

హోండా డియో స్పోర్ట్స్ 109.51 సిసి సింగిల్ సిలిండర్, ఫ్యూయల్ ఇంజెక్టెడ్ ఇంజన్‌ కలిగి ఉంటుంది. ఇది 8,000 ఆర్‌పిఎమ్ వద్ద 7.65 బిహెచ్‌పి పవర్ మరియు 4,750 ఆర్‌పిఎమ్ వద్ద 9 ఎన్ఎమ్ టార్క్‌ ఉత్పత్తి చేస్తుంది. ఇది సివిటి ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా పవర్ వెనుక చక్రానికి పంపబడుతుంది.

భారత్‌లో విడుదలైన 'హోండా డియో స్పోర్ట్స్‌': ధర & వివరాలు

హోండా డియో స్పోర్ట్స్ స్కూటర్‌ ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 5.3 లీటర్లు. అదే సమయంలో దీని బరువు 105 కేజీల వరకు ఉంటుంది. ఈ కొత్త స్కూటర్ యొక్క సీటు ఎత్తు 650 మిమీ కాగా, గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ వరకు ఉంటుంది. కావున ఇది రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటుంది.

భారత్‌లో విడుదలైన 'హోండా డియో స్పోర్ట్స్‌': ధర & వివరాలు

హోండా డియో స్పోర్ట్స్ అద్భుతమైన డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులో ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఫ్రంట్ స్టోరేజ్ పాకెట్, సైలెంట్ స్టార్ట్, సైడ్ స్టాండ్ ఇంజన్ కటాఫ్ మరియు బయటవైపు ఉండే ఫ్యూయెల్ క్యాప్ వంటివి ఉన్నాయి. అంతే కాకుండా ఇందులో ఎల్ఈడీ హెడ్‌లైట్‌ వంటివి కూడా ఉన్నాయి.

భారత్‌లో విడుదలైన 'హోండా డియో స్పోర్ట్స్‌': ధర & వివరాలు

హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా ఇటీవల తన 2022 జులై నెల అమ్మకాల నివేదికలను విడుదల చేసింది. ఈ గణాంకాల ప్రకారం, కంపెనీ గత నెలలో 4,43,643 యూనిట్లకు విక్రయించగలిగి 15 శాతం వృద్ధిని నమోదు చేసింది. ఇందులో 4,02,701 యూనిట్లు దేశీయ మార్కెట్లో విక్రయించగా, 40,942 యూనిట్లను ఎగుమతి చేసింది.

అదే సమయంలో 2021 జులై అమ్మకాలు 3,85,533 యూనిట్లుగా ఉన్నాయి. ఇందులో 3,40,133 యూనిట్లు దేశీయ విక్రయాలు కాగా, 45,400 యూనిట్లు ఎగుమతులు. దీన్ని బట్టి చూస్తే కంపెనీ 2021 జులై కంటే కూడా 2022 జులై నెలలో ఉత్తమ అమ్మకాలను పొందిందఐ స్పష్టంగా తెలుస్తోంది.

భారత్‌లో విడుదలైన 'హోండా డియో స్పోర్ట్స్‌': ధర & వివరాలు

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

హోండా డియో అనేది భారతీయ మార్కెట్లో ఉత్తమ అమ్మకాలు పొందుతున్న బ్రాండ్ స్కూటర్. అయితే ఇప్పుడు 'హోండా డియో స్పోర్ట్స్' కూడా సరసమైన ధర వద్ద అందుబాటులో ఉంది. కావున ఇది కూడా మార్కెట్లో తప్పకుండా మంచి అమ్మకాలు పొందుతుంది అని ఆశిస్తున్నాము. అయితే ఇది ఎలాటి అమ్మకాలను పొందుతుంది అనే విషయాలు త్వరలోనే తెలుస్తాయి. ఎప్పటికప్పుడు కొత్త కార్లు మరియు బైకుల గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ ఫాలో ఉండండి.

Most Read Articles

English summary
Honda dio sports launched price rs 68317 look engine details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X