ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్.. ఖండాంతరాలు దాటుతున్న Honda SP 125 బైక్

ద్విచక్ర వాహన విభాగంలో తనకంటూ ఒక కొత్త చరిత్రను సృష్టించుకున్న 'హోండా మోటార్‌సైకిల్ ఇండియా' (Honda Motorcycle India) భారతీయ మార్కెట్లో మాత్రమే కాకుండా విదేశీ మార్కెట్లో కూడా తన సత్తా చాటుతోంది. ఈ నేపథ్యంలో భాగంగానే కంపెనీ తన హోండా SP125 కమ్యూటర్ మోటార్‌సైకిల్‌ను 'న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా' దేశాలకు ఎగుమతి చేయడం ప్రారంభించింది. దీని గురించి మరింత సమాచారం ఇక్కడ తెలుసుకుందాం.. రండి.

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్.. ఖండాంతరాలు దాటుతున్న Honda SP125 బైక్

భారతీయ మార్కెట్లో ఎంతగానో ప్రజాదరణ పొందిన హోండా SP125 బైక్ ఇప్పుడు భారతీయ తీరాలను దాటి సిబియు మార్గం ద్వారా న్యూజిలాండ్ మరియు ఆస్ట్రేలియా దేశాలకు ఎగుమతి చేయబడతాయి. ఈ దేశాల్లో హోండా SP125 బైక్ సిబి125 గా విక్రయించనున్నట్లు తెలిసింది. రాజస్థాన్‌లోని హోండా యొక్క 'తపుకరా' ప్లాంట్‌లో తయారు చేయబడిన ఈ SP125 బైకులు ఎగుమతి చేయబడతాయి.

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్.. ఖండాంతరాలు దాటుతున్న Honda SP125 బైక్

కంపెనీ ఈ నెల ప్రారంభంలో మొత్తం 250 యూనిట్ల SP125 బైకులను పంపించింది. నిజానికి హోండా మోటార్‌సైకిల్ ఇండియా 2001 నుంచి ఈ ప్లాంట్ (తపుకరా ప్లాంట్‌) నుంచి విదేశాలకు వాహనాలను ఎగుమతి చేయడం ప్రారంభించింది. మొదటి సారిగా కంపెనీ తన 'యాక్టివా' స్కూటర్లను ఎగుమతి చేయడం ప్రారంభించింది.

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్.. ఖండాంతరాలు దాటుతున్న Honda SP125 బైక్

హోండా యాక్టివా తో ప్రారంభమైన ఎగుమతులు ప్రస్తుతం కంపెనీ 19 మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా 38 కంటే ఎక్కువ దేశాలకు ఎగుమతి చేస్తోంది. 2022 ఏప్రిల్ మరియు జూన్ 2022 మధ్య, కంపెనీ మొత్తం 1,02,653 ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేసింది. ఇది 2021 కంటే కూడా 25 శాతం వృద్ధిని నమోదు చేసింది. 2021 లో కంపెనీ మొత్తం 82,394 యూనిట్లను ఎగుమతి చేయగలిగింది. నిజంగా చాలా గొప్ప విషయం.

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్.. ఖండాంతరాలు దాటుతున్న Honda SP125 బైక్

కంపెనీ చేస్తున్న ఎగుమతుల గురించి 'హోండా మోటార్‌సైకిల్ మరియు స్కూటర్ ఇండియా' (HMSI) ప్రెసిడెంట్ మరియు సీఈఓ 'అట్సుషి ఒగాటా' మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా కంపెనీ యొక్క ఉత్పత్తులకు పెరుగుతున్న ఆదరణ వల్ల ఎగుమతులు సాధ్యమవుతున్నాయి. కస్టమర్లు కంపెనీ యొక్క వాహనాలపైన ఆసక్తి చూపుతున్నారు, కావున కస్టమర్లకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటానికి కృషి చేస్తాము, అంతే కాకుండా ఎప్పటికప్పుడు కొత్త ఉత్పత్తులను అందించటానికి ప్రయత్నిస్తామన్నారు.

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్.. ఖండాంతరాలు దాటుతున్న Honda SP125 బైక్

హోండా SP 125 బైక్ ప్రస్తుతం మార్కెట్లో రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి ఒకటి డిస్క్ వేరియంట్ కాగా, మరొకటి డ్రమ్ వేరియంట్. హోండా SP 125 డ్రమ్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 82,486 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) మరియు డిస్క్ వేరియంట్ ధర రూ. 86,486 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్.. ఖండాంతరాలు దాటుతున్న Honda SP125 బైక్

హోండా SP 125 బైక్ 124 సిసి సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజన్ అందుబాటులో ఉంటుంది. ఇది 10 బిహెచ్‌పి పవర్ మరియు 11 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఇంజిన్ 5-స్పీడ్ గేర్‌బాక్స్ తో జతచేయబడి ఉంటుంది. కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్.. ఖండాంతరాలు దాటుతున్న Honda SP125 బైక్

హోండా SP 125 బైక్ కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 2,020 మిమీ, వెడల్పు 785 మిమీ మరియు ఎత్తు 1,103 మిమీ వరకు ఉంటుంది. అదే సమయంలో ఈ బైక్ యొక్క వీల్‌బేస్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 1,285 మిమీ, 160 మిమీ వరకు ఉంటుంది. దీనిసీటు యొక్క ఎత్తు 790 మిమీ, కావున ఇది బైక్ రైడర్లకు అన్ని విధాలా అనుకూలంగా ఉంచి.

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్.. ఖండాంతరాలు దాటుతున్న Honda SP125 బైక్

హోండా SP 125 బైక్ యొక్క సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుకవైపు హైడ్రాలిక్ సస్పెన్షన్ యూనిట్ ఉంటుంది. అంతే కాకుండా దీనికి ముందు మరియు వెనుక 18-ఇంచెస్ ట్యూబ్‌లెస్ టైర్లు లభిస్తాయి. ఇది 5-స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను పొందుతుంది.

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్.. ఖండాంతరాలు దాటుతున్న Honda SP125 బైక్

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే, SP125 బైక్ యొక్క ముందువైపు 240 మిమీ డిస్క్ బ్రేక్ మరియు 130 మిమీ డ్రమ్ బ్రేక్ ఆప్సన్స్ పొందుతుంది. అయితే వెనుకవైపు 130 మిమీ డ్రమ్ బ్రేక్ మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 11 లీటర్లు కాగా, ఈ బైక్ మొత్తమ్ బరువు 117 కేజీలు వరకు ఉంటుంది.

ప్రపంచ మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్.. ఖండాంతరాలు దాటుతున్న Honda SP125 బైక్

కంపెనీ తన హోండా SP 125 లో ఎప్పటికప్పుడు అప్డేట్స్ చేస్తూనే ఉంది. ఇందులో సైలెంట్ స్టార్టర్, ఫుల్లీ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంటేషన్, రేంజ్ ఇండికేటర్, యావరేజ్ ఫ్యూయెల్ రేంజ్, ​​సైడ్-స్టాండ్ కట్-ఆఫ్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, ఇంజిన్ స్టార్ట్/స్టాప్ టెక్, ఎకో ఇండికేటర్ మరియు గేర్ పొజిషన్ ఇండికేటర్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ ఇప్పుడు బిఎస్ 6 ఉద్గార ప్రమాణాలకు అనుకూలంగా అప్డేట్ చేయబడింది. కావున మంచి పనితీరుని మరియు మైలేజ్ అందిస్తుంది.

Most Read Articles

English summary
Honda sp 125 export starts to australia and new zealand details
Story first published: Friday, July 29, 2022, 10:13 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X