తక్కువ ధర వద్ద ఎక్కువ రేంజ్ అందించే కైనెటిక్ హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్: పూర్తి వివరాలు

ఆధునిక కాలంలో ఎలక్ట్రిక్ వాహనాలను పెరుగుతున్న ఆదరణ అంతా.. ఇంతా.. కాదు. ఈ కారణంగానే చిన్న కంపెనీలు, పెద్ద కంపెనీలు అని తేడా లేకుండా అన్నీ కూడా ఎలక్ట్రిక్ వాహనాలు తయారీలోనే నిమగ్నమై ఉన్నాయి. ఇందులో భాగంగానే అగ్రగామి ఎలక్ట్రిక్ వాహన తయారీ సంస్థ 'కైనెటిక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పవర్ సొల్యూషన్స్' దేశీయ మార్కెట్లో ఒక హై-స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది.

Recommended Video

ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్

కైనెటిక్ కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన కొత్త హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో చూద్దాం.. రండి.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్ అందించే కైనెటిక్ ఎలక్ట్రిక్ స్కూటర్

కైనెటిక్ కంపెనీ దేశీయ మార్కెట్లో విడుదల చేసిన హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు 'జింగ్ హెచ్ఎస్ఎస్'. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 85,000 (ఎక్స్-షోరూమ్). ఇది మొత్తమ్ మూడు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి రెడ్, బ్లూ మరియు వైట్ కలర్స్, ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్ అందించే కైనెటిక్ ఎలక్ట్రిక్ స్కూటర్

కొత్త కైనెటిక్ గ్రీన్ జింగ్ హెచ్‌ఎస్‌ఎస్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ భారతదేశంలోని యువ రైడర్‌లను లక్ష్యంగా చేసుకుని తయారుచేయబడింది. కావున ఆధునిక డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులో భాగంగానే ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ మల్టీ-స్పీడ్ మోడ్, పార్ట్ ఫెయిల్యూర్ ఇండికేటర్, అడ్జస్టబుల్ సస్పెన్షన్ మరియు రీజెనరేటివ్ బ్రేకింగ్ సిస్టమ్ వంటి వాటిని పొందుతుంది.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్ అందించే కైనెటిక్ ఎలక్ట్రిక్ స్కూటర్

అంతే కాకుండా ఇందులో USB పోర్ట్, స్పీడ్ స్విచ్ మెకానిజం, స్మార్ట్ రిమోట్ కీ, మల్టిపుల్ ఫంక్షనల్ డ్యాష్‌బోర్డ్ వంటి వాటిని కూడా పొందుతుంది. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్ అందించే కైనెటిక్ ఎలక్ట్రిక్ స్కూటర్

కొత్త కైనెటిక్ జింగ్ హెచ్ఎస్ఎస్ 60V, 28Ah లిథియం-అయాన్ బ్యాటరీని పొందుతుంది. ఈ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది గరిష్టంగా గంటకు 60 కిలోమీటర్ల వరకు వేగవంతం అవుతుంది. ఇందులో నార్మల్, ఎకో, పవర్ అనే రైడింగ్ మోడ్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ బ్యాటరీని 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేయడానికి కేవలం 3 గంటల సమయం మాత్రమే పడుతుంది. ఈ బ్యాటరీపైన కంపెనీ 3 సంవత్సరాల వారంటీ కూడా అందిస్తుంది.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్ అందించే కైనెటిక్ ఎలక్ట్రిక్ స్కూటర్

ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ 160 మిమీ కాగా, లోడింగ్ సామర్థ్యం 150 కేజీల వరకు ఉంటుంది. ఇది 3×10 ఇంచెస్ ట్యూబ్‌లెస్ టైర్‌లను పొందుతుంది. అదే సమయంలో బ్రేకింగ్ కోసం రెండు చివర్లలో డిస్క్ బ్రేక్‌లను కలిగి ఉంటుంది. కావున రైడర్ కి చాలా మంచి రైడింగ్ అనుభూతిని తప్పకుండా కలిగిస్తుంది.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్ అందించే కైనెటిక్ ఎలక్ట్రిక్ స్కూటర్

కైనెటిక్ జింగ్ హెచ్ఎస్ఎస్ లాంచ్ సందర్భంగా కంపెనీ సీఈఓ 'సులాజా ఫిరోడియా మోత్వానీ' మాట్లాడుతూ.. కంపెనీ యొక్క ఈ కొత్త హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆధునిక టెక్నాలజీ కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఇది మంచి రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగంలో ఒకటిగా నిలుస్తుంది. రానున్న రోజుల్లో కంపెనీ మరిన్ని ఆధునిక వాహనాలు విడుదల చేయడానికి సన్నద్ధమవుతుందని అన్నారు.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్ అందించే కైనెటిక్ ఎలక్ట్రిక్ స్కూటర్

కైనెటిక్ గ్రీన్ జింగ్ హెచ్ఎస్ఎస్ కొనుగోలును మరింత సులభతరం చేయడానికి కంపెనీ సులభమైన ఫైనాన్సింగ్ పథకాలను అందించడానికి శ్రీరామ్ సిటీ యూనియన్, ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్, టాటా క్యాపిటల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఇండస్ఇండ్ బ్యాంక్ వంటి వాటితో కూడా భాగస్వామ్యం కుదుర్చుకుంది. కావున కొనుగోలుదారులు వీటి ద్వారా కూడా ఫైనాన్సింగ్ సదుపాయం పొందవచ్చు.

2023 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ తన ఇ-లూనా ఎలక్ట్రిక్ స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ తెలిపింది. కైనెటిక్ గ్రీన్ భారతదేశంలోని 300 ప్రత్యేక డీలర్‌లను కలిగి ఉంది, కావున వీటి ద్వారా తమ కొత్త హై స్పీడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విక్రయించే అవకాశం ఉంటుంది.

ధర తక్కువ & ఎక్కువ రేంజ్ అందించే కైనెటిక్ ఎలక్ట్రిక్ స్కూటర్

డ్రైవ్‌స్పార్క్ అభిప్రాయం:

భారతీయ మార్కెట్లో విడుదలైన కొత్త 'జింగ్ హెచ్ఎస్ఎస్' (Zing HSS) కంపెనీ యొక్క మూడవ ఎలక్ట్రిక్ స్కూటర్‌ కానుంది. ఇది తక్కువ ధర వద్ద మంచి రేంజ్ అందిస్తూ.. ఆధునిక ఫీచర్స్ కలిగి ఉండటం వల్ల దేశీయ విఫణిలో తప్పకుండా మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నాము.దేశీయ మార్కెట్లో విడుదలయ్యే కొత్త కార్లు మరియు బైకుల గురించి ఎప్పటికప్పుడు అప్డేటెడ్ సమాచారం తెలుసుకోవడానికి తెలుగు డ్రైవ్‌స్పార్క్ చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Kinetic green zing e scooter launched at rs 85000 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X