KTM నుంచి మరో కొత్త బైక్ లాంచ్: ధర రూ. 2.35 లక్షలు

ప్రముఖ బైక్ తయారీ సంస్థ కెటిఎమ్ (KTM) దేశీయ మార్కెట్లో ఎట్టకేలకు తన 'కెటిఎమ్ 250 అడ్వెంచర్' (KTM 250 Adventure) బైక్ యొక్క కొత్త వేరియంట్ విడుదల చేసింది. కంపెనీ విడుదల చేసిన ఈ కొత్త అడ్వెంచర్ బైక్ ధర రూ. 2.35 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). ఈ బైక్ గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

KTM నుంచి మరో కొత్త బైక్ లాంచ్: ధర రూ. 2.35 లక్షలు

కెటిఎమ్ కంపెనీ 2022 లో విడుదల చేసిన మొదటి బైక్ ఈ 2022 కెటిఎమ్ 250 అడ్వెంచర్. ఇది రెండు కొత్త కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉన్నాయి. అవి కెటిఎమ్ ఎలక్ట్రానిక్ ఆరెంజ్ మరియు కెటిఎమ్ ఫ్యాక్టరీ రేసింగ్ బ్లూ కలర్స్. దేశీయ మార్కెట్లో కెటిఎమ్ బ్రాడ్ యొక్క 250 అడ్వెంచర్ అనేది భారతదేశంలో అమ్మకానికి అందుబాటులో ఉన్న ఎంట్రీ-లెవల్ అడ్వెంచర్ మోటార్‌సైకిల్. ఈ బైక్ ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను పొందుతుంది.

KTM నుంచి మరో కొత్త బైక్ లాంచ్: ధర రూ. 2.35 లక్షలు

కెటిఎమ్ ఇండియా ఇప్పుడు ఈ బైక్‌ కొనుగోలును మరింత సులభతరం చేయడానికి ప్రత్యేక ఈఎమ్ఐ కూడా అందిస్తుంది. దీని ప్రకారం కొనుగోలుదారులు రూ.6,300 నుండి సులభమైన ఫైనాన్స్ ఎంపికలను పొందవచ్చు. కావున ఇది వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

KTM నుంచి మరో కొత్త బైక్ లాంచ్: ధర రూ. 2.35 లక్షలు

దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త కెటిఎమ్ 250 అడ్వెంచర్‌ బైక్ లో ఎలాంటి సాంకేతిక మార్పులు చేయలేదు. ఇందులో మునుపటి మోడల్ లో మాదిరిగానే 248 సిసి, సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ డిఓహెచ్సి, ఫోర్-వాల్వ్ ఇంజన్‌ అందుబాటులో ఉంది, కావున ఇది మంచి పనితీరుని అందిస్తుంది.

KTM నుంచి మరో కొత్త బైక్ లాంచ్: ధర రూ. 2.35 లక్షలు

కొత్త కెటిఎమ్ 250 అడ్వెంచర్ 19 ఇంచెస్ ఫ్రంట్ మరియు 17 ఇంచెస్ రియర్ అల్లాయ్ వీల్స్‌ పొందుతుంది. ఇది ముందువైపు 170 మిమీ అప్సైడ్డౌన్ టెలిస్కోపిక్ ఫోర్క్‌లను మరియు వెనుకవైపు 177 మిమీ 10 వే ప్రీలోడ్ అడ్జస్ట్‌మెంట్ మోనోషాక్ సస్పెన్షన్ సెటప్‌ ఉంటాయి.

KTM నుంచి మరో కొత్త బైక్ లాంచ్: ధర రూ. 2.35 లక్షలు

ఈ బైక్ యొక్క బ్రేకింగ్ సెటప్ విషయానికి వస్తే, ఈ బైక్ ముందు వైపు 320 మిమీ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుక 230 మిమీ బ్రేక్స్ అందుబటులో ఉంటాయి. ఇవి మాత్రమే కాకుండా ఇందులో డ్యూయల్ ఛానెల్ ఏబీఎస్ కూడా అందుబటులో ఉంటుంది. కావున వాహన వినియోగదారులకు మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

KTM నుంచి మరో కొత్త బైక్ లాంచ్: ధర రూ. 2.35 లక్షలు

ఈ కొత్త బైక్ ఫుల్లీ డిజిటల్ LCD ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను పొందుతుంది. ఇందులో స్పీడోమీటర్, ఓడోమీటర్, గేర్ ఇండికేటర్, ఫ్యూయల్ ఇండికేటర్, మైలేజ్ మరియు ఏబీఎస్ ఇండికేటర్ వంటి వాటిని గురించి మరింత సమాచారం వాహనదారునికి అందుబాటులో ఉంటుంది. ఇందులో ABSని ఆన్ మరియు ఆఫ్ చేయడానికి ఆప్సనల్ బటన్ కూడా ఉంటుంది.

KTM నుంచి మరో కొత్త బైక్ లాంచ్: ధర రూ. 2.35 లక్షలు

కొత్త కెటిఎమ్ 250 అడ్వెంచర్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించబడింది. కావున ఇది బైక్‌ను చాలా తేలికగా ఉండేట్లు చేస్తుంది. ఈ బైక్‌లో ఇంజన్ రేడియేటర్, ఇంజన్ గార్డ్, స్ప్లిట్ సీట్ మరియు ముందు భాగంలో ట్రాన్స్పరెంట్ విండ్‌స్క్రీన్ వంటివి అందుబటులో ఉన్నాయి. KTM అడ్వెంచర్ 250 అనేది సరసమైన అడ్వెంచర్ బైక్. ఇది దేశీయ మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ మరియు బిఎండబ్ల్యు జి 310 జిఎస్ వంటివాటికి ప్రత్యర్థిగా ఉంటుంది.

KTM నుంచి మరో కొత్త బైక్ లాంచ్: ధర రూ. 2.35 లక్షలు

ఇదిలా ఉండగా భారతదేశంలో కెటిఎమ్ కొత్త తరం KTM RC 125, RC 200 మరియు 390 అడ్వెంచర్‌లను గత ఏడాది విడుదల చేసింది. మిడిల్ వెయిట్ సెగ్మెంట్‌లో తమ అమ్మకాలను పెంచుకోవడానికి అడ్వెంచర్ 250 ఇప్పుడు బాగా సహాయపడే అవకాశం ఉంటుందని కంపెనీ ఆశిస్తోంది.

KTM నుంచి మరో కొత్త బైక్ లాంచ్: ధర రూ. 2.35 లక్షలు

కంపెనీ నివేదికల ప్రకారం KTM ఇండియా తన అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త తరం RC 390 ని చేర్చింది. కంపెనీ ఈ సంవత్సరం ఈ బైక్‌ను భారతదేశంలో విడుదల చేసే అవకాశం ఉంది. కొత్త తరం KTM RC 390 బైక్ RC సిరీస్‌లోని ఇతర మోటార్‌సైకిళ్లను పోలి ఉంటుంది.

KTM నుంచి మరో కొత్త బైక్ లాంచ్: ధర రూ. 2.35 లక్షలు

డిజైన్ పరంగా, కొత్త RC 390 ముందు హెడ్‌ల్యాంప్‌ల కోసం కొత్త లేఅవుట్‌ను పొందుతుంది, ఇందులో LED హెడ్‌లైట్, టర్న్ ఇండికేటర్‌లు మరియు DRLలతో సరికొత్త LED సెటప్ పొందుతుంది. ఇది కొత్త విండ్‌షీల్డ్‌ను కూడా పొందుతుంది, ఇది గాలి నుంచి రక్షణను అందిస్తుంది.

KTM నుంచి మరో కొత్త బైక్ లాంచ్: ధర రూ. 2.35 లక్షలు

కొత్త KTM RC 390 పూర్తిగా కొత్త డిజైన్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. కావున దీని డిజైన్ దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా భిన్నంగా ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్‌లో విజువల్ అప్పీల్‌ని పెంచడానికి స్పోర్టీ బాడీ ప్యానెల్స్ ఉపయోగించబడ్డాయి. ఈ బైక్ ఫీచర్స్ కూడా చాలా వరకు అప్‌డేట్ చేయబడి ఉన్నాయి. మొత్తానికి ఈ అప్డేటెడ్ బైక్ ఈ సంవత్సరం భారతీయ మార్కెట్లో అరంగేట్రం చేయనుంది.

Most Read Articles

English summary
New ktm 250 adventure launched in india price features details
Story first published: Friday, January 14, 2022, 13:46 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X