ఓలా ఎస్1 ఎయిర్ vs టీవీఎస్ ఐక్యూబ్: ఇందులో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?

భారతదేశపు అగ్రగామి ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల దీపావళి పండుగను పురస్కరించుకుని అతి తక్కువ ధరకే 'ఓలా ఎస్1 ఎయిర్' (Ola S1 Air) విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ విఫణిలో 'టీవీఎస్' (TVS) కంపెనీ యొక్క 'ఐక్యూబ్' (iQube) కి చాలా దగ్గర పోలికలను కలిగి ఉంటుంది. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల మధ్య ఉన్న వ్యత్యాసం గురించి ఈ కథనంలో తెలుసుకుందాం.

ఓలా ఎస్1 ఎయిర్ vs టీవీఎస్ ఐక్యూబ్: ఇందులో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?

ధరలు:

ఓలా ఎలక్ట్రిక్ ఇటీవల విడుదల చేసిన ఎస్1 ఎయిర్ ధర విడుదల సమయంలో రూ. 79,999 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అయితే ఈ ధరలు కేవలం రెండు రోజులు మాత్రమే అందుబాటులో ఉన్నాయి, అయితే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధరలు ఇప్పుడు రూ. 84,999 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) కి చేరింది.

ఓలా ఎస్1 ఎయిర్ vs టీవీఎస్ ఐక్యూబ్: ఇందులో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?

ఇక టీవీఎస్ ఐక్యూబ్ ధరల విషయానికి వస్తే, ఇది రూ. 93,057 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) వద్ద అందుబాటులో ఉంది. ధరలను బట్టి చూస్తే ఓలా ఎస్1 ఎయిర్ ధర కంటే టీవీఎస్ ఐక్యూబ్ ధర కొంత ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది.

ఓలా ఎస్1 ఎయిర్ vs టీవీఎస్ ఐక్యూబ్: ఇందులో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?

డిజైన్:

డిజైన్ విషయానికి వస్తే 'ఓలా ఎస్1 ఎయిర్' దాదాపుగా దాని మునుపటి మోడల్స్ మాదిరిగానే ఉంటుంది. అయితే ఇందులో ప్రత్యేకంగా కనిపించే కొన్ని డిజైన్ ఎలిమెంట్స్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులో డ్యూయల్-టోన్ ఫినిషింగ్ మరియు దిగువ ప్యానెల్‌లపై డార్క్ ఫినిషింగ్, సింపుల్ ట్యూబ్యులర్ గ్రాబ్ హ్యాండిల్స్ వంటివి ఇందులో ఉన్నాయి.

ఓలా ఎస్1 ఎయిర్ vs టీవీఎస్ ఐక్యూబ్: ఇందులో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?

టీవీఎస్ ఐక్యూబ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది బాక్సీ డిజైన్ థీమ్‌తో చాలా స్మార్ట్‌గా కనిపిస్తుంది. ఇది బాడీ-కలర్ గ్రాబ్ హ్యాండిల్స్, అల్లాయ్ వీల్స్‌తో కొంచెం ఎక్కువ ప్రీమియం అనుభూతిని కలిగిస్తుంది. ఈ మోడల్ ముందు భాగంలో స్టాండర్డ్ డిస్క్ బ్రేక్‌ను కూడా పొందుతుంది.

ఓలా ఎస్1 ఎయిర్ vs టీవీఎస్ ఐక్యూబ్: ఇందులో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?

ప్రాక్టికాలిటీ:

ఓలా ఎలక్ట్రిక్ యొక్క ఎస్1 మరియు ఎస్1 ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ల యొక్క అండర్ సీట్ కెపాసిటీ ఏకంగా 34 లీటర్ల కెపాసిటీ కలిగి ఉంటుంది. అయితే ఇటీవల విడుదలైన ఎస్1 ఎయిర్ అండర్ సీట్ స్టోరేజ్ 32 లీటర్ల వరకు ఉంటుంది. దీన్ని బట్టి చూస్తే దాని మునుపటి మోడల్స్ కంటే కూడా కేవలం 2 లీటర్లు తక్కువగా ఉంటుంది.

ఓలా ఎస్1 ఎయిర్ vs టీవీఎస్ ఐక్యూబ్: ఇందులో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?

ఇక టీవీఎస్ ఐక్యూబ్‌ విషయానికి వస్తే, అండర్ సీట్ స్టోరేజ్ ఓలా ఎస్1 ఎయిర్ కంటే చాలా తక్కువగా ఉంటుంది. కాబట్టి ఐక్యూబ్ అండర్ సీట్ స్టోరేజ్ 17 లీటర్ల వరకు ఉంటుంది. ఈ అండర్ సీట్ స్టోరేజ్ వినియోగదారులకు కొంత ఇబ్బందిగా ఉంటుంది.

ఓలా ఎస్1 ఎయిర్ vs టీవీఎస్ ఐక్యూబ్: ఇందులో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?

పవర్‌ట్రైన్:

'ఓలా ఎస్1 ఎయిర్' ఎలక్ట్రిక్ స్కూటర్ 2.5 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5 కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారును పొందుతుంది. కావున ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల (ఎకో మోడ్) పరిధిని అందిస్తుంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్లవరకు ఉంటుంది.

ఓలా ఎస్1 ఎయిర్ vs టీవీఎస్ ఐక్యూబ్: ఇందులో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?

టీవీఎస్ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ పెద్ద 3.04kWh బ్యాటరీ ప్యాక్‌ను కలిగి ఉంది. ఇందులోని హబ్-మౌంటెడ్ ఎలక్ట్రిక్ మోటార్ 4.4 kW గరిష్ట శక్తిని ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా, రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు మల్టిపుల్ రైడింగ్ మోడ్స్ కలిగి ఉంటుంది.

ఓలా ఎస్1 ఎయిర్ vs టీవీఎస్ ఐక్యూబ్: ఇందులో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?

ఛార్జింగ్:

ఛార్జింగ్ విషయానికి వస్తే 'ఎస్1 ఎయిర్‌' ఎలక్ట్రిక్ స్కూటర్ 500W పోర్టబుల్ హోమ్ ఛార్జర్‌ని ఉపయోగించి 0 నుంచి 100 శాతం ఛార్జ్ కావడానికి 4:30 గంటల సమయం పడుతుంది. కావున ఇది ఛార్జింగ్ విషయంలో కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

ఓలా ఎస్1 ఎయిర్ vs టీవీఎస్ ఐక్యూబ్: ఇందులో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?

టీవీఎస్ ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క ఛార్జింగ్ విషయానికి వస్తే, ఇది 650W ఛార్జర్‌తో వస్తుంది. కావున ఇందులోని బ్యాటరీ ప్యాక్‌ను 0 నుంచి 75 శాతం ఛార్జింగ్ ఎక్కేందుదు 4 గంటల సమయం పడుతుంది. కాగా 0 నుంచి 100 శాతం ఛార్జ్ చేసుకోవడానికి 5 గంటల సమయం పడుతుంది.

ఓలా ఎస్1 ఎయిర్ vs టీవీఎస్ ఐక్యూబ్: ఇందులో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?

పర్ఫామెన్స్:

కొత్త ఓలా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ కేవలం 4.3 సెకన్లలో గంటకు 40 కిలోమీటర్ల వరకు వేగవతం అవుతుంది. అయితే దీని టాప్ స్పీడ్ గంటకు 85 కిమీ వరకు ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది.

ఓలా ఎస్1 ఎయిర్ vs టీవీఎస్ ఐక్యూబ్: ఇందులో బెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఏది?

ఇక టీవీఎస్ ఐక్యూబ్ విషయానికి వస్తే, ఇది కేవలం 4.2 సెకన్లలో గంటకు 40 కిలోమీటర్ల వరకు వేగవతం అవుతుంది. అయితే దీని టాప్ స్పీడ్ గంటకు 78 కిమీ వరకు ఉంటుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 101 కిమీ పరిధిని అందిస్తుంది. రేంజ్ పరంగా ఇది ఓలా ఎస్1 ఎయిర్ కంటే కూడా 1 కిమీ ఎక్కువ రేంజ్ అందిస్తుంది.

Most Read Articles

English summary
New ola s1 air vs tvs iqube comparison features range charging and more
Story first published: Saturday, October 29, 2022, 15:14 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X