ఫైనల్ టెస్టింగ్‌లో ఒబెన్ రోర్ (Oben Rorr) ఎలక్ట్రిక్ బైక్.. మరికొద్ది రోజుల్లోనే లాంచ్..

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ కంపెనీ ఒబెన్ ఈవీ (Oben EV), గడచిన మార్చి 2022 నెలలో దేశీయ మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'ఓబెన్ రోర్' (Oben Rorr) ను ఆవిష్కరించిన సంగతి తెలిసినదే. కాగా, ఈ బైక్ ఇప్పుడు బెంగుళూరు నగర రోడ్లపై టెస్టింగ్ లో ఉండగా మా డ్రైవ్‌స్పార్క్ బృందం తమ కెమెరాలో బంధించింది. మునుపటి షెడ్యూల్ ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ బైక్ టెస్ట్ డ్రైవ్‌లు జూన్ నెలలో ప్రారంభం కానున్నాయి మరియు డెలివరీలు జులై నెలలో ప్రారంభం అవుతాయి.

బెంగుళూరు రోడ్లపై తిరుగుతూ కనిపించిన ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్, లాంచ్ ఎప్పుండంటే..?

ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ కోసం కంపెనీ ఇప్పటికే గడచిన మార్చి నెలలోనే బుకింగ్ లను ఓపెన్ చేసింది. దేశీయ మార్కెట్లో ఈ బైక్ ధర FAME-2 మరియు రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీల అమలు తర్వాత రూ. 99,999 (ఎక్స్-షోరూమ్, మహారాష్ట్ర)గా ఉంటుంది. వివిధ రాష్ట్రాలు అందించే సబ్సిడీని బట్టి దీని ధర రూ.1.25 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకూ ఉంటుంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 200 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. అయితే, ఇది రియల్ వరల్డ్ లో మారే అవకాశం ఉంది.

బెంగుళూరు రోడ్లపై తిరుగుతూ కనిపించిన ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్, లాంచ్ ఎప్పుండంటే..?

డిజైన్ విషయానికి వస్చే, ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ చూడటానికి సాధారణ పెట్రోల్ మోటార్‌సైకిళ్ల మాదిరిగానే కనిపిస్తుంది. కాకపోతే, ఇందులో ఇంజన్ స్థానంలో ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది, కాబట్టి ఇంజన్ భాగం నేలపై నుండి ఎత్తులో ఉన్నట్లు కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ ముందు భాగంలో ఇంటిగ్రేటెడ్ డేటైమ్ రన్నింగ్ లైట్‌తో కూడిన గుండ్రటి ఎల్ఈడి హెడ్‌ల్యాంప్, ఎల్ఈడి టర్న్ ఇండికేటర్‌లు మరియు ఎల్ఈడి టెయిల్‌ లాంప్‌ ఉంటాయి. దీని బాడీ ప్యానెల్స్ మూడు రంగులలో (ఆరెంజ్, సిల్వర్, బ్లాక్) ఉండి, చాలా షార్ప్ లుక్‌తో కనిపిస్తాయి.

బెంగుళూరు రోడ్లపై తిరుగుతూ కనిపించిన ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్, లాంచ్ ఎప్పుండంటే..?

ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో విశాలమైన హ్యాండిల్‌బార్, ఛార్జింగ్ పోర్ట్, స్ప్లిట్ సీట్లు, ఎల్ఈడి వింకర్‌లతో కూడిన మస్కులర్ ప్యానెల్ (ఇంధన ట్యాంక్ మాదిరిగా కనిపిస్తుంది), స్టైలిష్ అల్లాయ్ వీల్స్, షార్ప్-లుకింగ్ సైడ్ ప్యానెల్‌లు మరియు అండర్-కౌలింగ్ మొదలైన డిజైన్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను కలిగి ఉంటుంది. ఇది వేగం, బ్యాటరీ ఛార్జ్ స్థితి, మిగిలిన రైడింగ్ రేంజ్ మరియు మరిన్నింటితో సహా అన్ని అవసరమైన రీడౌట్‌లను తెలియజేస్తుంది.

బెంగుళూరు రోడ్లపై తిరుగుతూ కనిపించిన ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్, లాంచ్ ఎప్పుండంటే..?

పవర్‌ట్రైన్ విషయానికి వస్తే, ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ ఫైనల్ బెల్ట్ డ్రైవ్‌తో కూడిన మిడ్-మౌంటెడ్ మోటార్‌ను కలిగి ఉంటుంది. అంటే, ఇది ఇతర ఎలక్ట్రిక్ మోటార్‌సైకిళ్ల మాదిరిగా వెనుక చక్రంలో అమర్చబడి ఉండే హబ్ మౌంటెడ్ మోటార్‌ కు బదులుగా సెంటర్ లో అమర్చబడిన ఎలక్ట్రిక్ మోటార్ ను కలిగి ఉంటుంది. ఇది బెల్ట్ డ్రైవ్ సాయంతో వెనుక చక్రాన్ని ముందుకు కదుపుతుంది. ఒబెన్ రోర్ ఫిక్స్డ్ 4.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్, 13.4 bhp శక్తి మరియు 62 Nm గరిష్ట టార్క్‌ను జనరేట్ చేసే ఎలక్ట్రిక్ మోటార్ లను కలిగి ఉంటుంది.

బెంగుళూరు రోడ్లపై తిరుగుతూ కనిపించిన ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్, లాంచ్ ఎప్పుండంటే..?

పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, ఒబెన్ రోర్ ఇ-బైక్ కేవలం 3 సెకన్లలో గంటకు 0 నుండి 40 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది మరియు గరిష్టంగా గంటకు 100 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో పరుగులు తీస్తుంది. రేంజ్ విషయానికి వస్తే, ఇది పూర్తి చార్జ్ పై 200 కిమీ రేంజ్ అందిస్తుందని కంపెనీ చెబుతోంది. రైడర్ కంఫర్ట్ మరియు బ్యాటరీ సేవింగ్ కోసం ఇందులో మూడు రకాల రైడింగ్ మోడ్స్ కూడా ఉంటాయి. అయితే, రైడర్ ఎంచుకునే రైడ్ మోడ్ ను బట్టి ఎలక్ట్రిక్ బైక్ రేంజ్ మారుతూ ఉంటుంది.

బెంగుళూరు రోడ్లపై తిరుగుతూ కనిపించిన ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్, లాంచ్ ఎప్పుండంటే..?

ఇక చార్జింగ్ విషయానికి వస్తే, ఇందులో పెద్ద 4.4 kWh లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను 15A సాకెట్ ఉపయోగించి పూర్తిగా చార్జ్ చేయడానికి కేవలం 2 గంటలు మాత్రమే సమయం పడుతుందని కంపెనీ తెలిపింది. ఇందులోని మెకానికల్స్ ను గమనిస్తే, ముందు వైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుక వైపు మోనోషాక్ యూనిట్ సస్పెన్షన్ సెటప్ ఉంటాయి. అలాగే, సమర్థవంతమైన స్టాపింగ్ పవర్ కోసం ఒబెన్ రోర్ ఇ-బైక్ లో ఇరువైపులా డిస్క్ బ్రేకులు ఉంటాయి.

బెంగుళూరు రోడ్లపై తిరుగుతూ కనిపించిన ఒబెన్ రోర్ (Oben Rorr) ఇ-బైక్, లాంచ్ ఎప్పుండంటే..?

ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ బైక్ ఇతర ఫీచర్లను గమనిస్తే, ఇందులో డ్రైవర్ అలర్ట్ సిస్టమ్, యాంటీ థెఫ్ట్ అలారం, నావిగేషన్, టెలిఫోనీ, వెహికల్ డయాగ్నస్టిక్స్, సమీపంలోని ఛార్జింగ్ స్టేషన్‌ను గుర్తించడం వంటి మరెన్నో కనెక్టింగ్ టెక్నాలజీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఓబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను పూర్తిగా భారతదేశంలోనే అభివృద్ధి చేశామని మరియు దీనిని స్థానికంగానే తయారు చేస్తామని కంపెనీ పేర్కొంది. ఇది పూర్తిగా 100 శాతం దేశీయ ఉత్పత్తి (మేడ్ ఇన్ ఇండియా ప్రోడక్ట్) అని కంపెనీ తెలిపింది. ఒబెన్ రోర్ (Oben Rorr) ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ఈ విభాగంలో టోర్క్ క్రాటోస్ (Tork Kratos) మరియు రివోల్ట్ ఆర్‌వి400 (Revolt RV400) మోడళ్లకు పోటీగా నిలుస్తుంది.

Most Read Articles

English summary
Oben rorr e bike spotted testing on bengalure streets launch details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X