రూ. 250 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు కానున్న బ్రిటీష్ సంస్థ: పూర్తి వివరాలు

భారతీయ మార్కెట్లో రోజు రోజుకి కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే బ్రిటీష్ బ్రాండ్ ఈ-స్కూటర్స్ కంపెనీ వన్-మోటో (One-Moto) ఇటీవల కాలంలోనే ఒక కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది. అయితే ఇప్పుడు దేశీయ మార్కెట్లో తన ఉనికిని మరింత బలోపేతం చేసుకోవడానికి తన తయారీ యూనిట్ ఏర్పాటు చేయడానికి కూడా సన్నాహాలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే తెలుగు రాష్ట్రాల్లో ఒకటైన తెలంగాణ రాష్ట్రంలో తన తయారీ యూనిట్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. దీని గురించి మరింత సమాచారం ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

రూ. 250 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు కానున్న బ్రిటీష్ సంస్థ: పూర్తి వివరాలు

నివేదికల ప్రకారం, బ్రిటీష్ బ్రాండ్ ఈ-స్కూటర్స్ కంపెనీ వన్-మోటో తెలంగాణ రాజధాని నగరమైన హైదరాబాద్ నగరంలో తయారీ యూనిట్ ను స్థాపించనున్నట్లు ప్రకటించింది. ఈ తయారీ యూనిట్ కోసం కంపెనీ దాదాపుగా రూ. 250 కోట్లు పెట్టుబడిని కూడా పెట్టనుంది. దీనికోసం కంపెనీ తెలంగాణ ప్రభుత్వంతో ఒక ఒప్పందం కూడా కుదుర్చుకుంది.

రూ. 250 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు కానున్న బ్రిటీష్ సంస్థ: పూర్తి వివరాలు

కంపెనీ యొక్క ఈ కొత్త ప్లాంట్ ఏర్పాటైన తరువాత ఎంతోమందికి ఇక్కడ ఉపాధి లభిస్తుంది. కొత్త తయారీ ప్లాంట్‌లో ఆధునిక నిర్మాణ యంత్రాలతో పాటు రోబోలను కూడా ఉపయోగించనున్నట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. తెలంగాణ రాజధాని హైదరాబాద్ శివార్లలో 15 ఎకరాల విస్తీర్ణంలో కొత్త ప్లాంట్ విస్తరించనుంది.

రూ. 250 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు కానున్న బ్రిటీష్ సంస్థ: పూర్తి వివరాలు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మద్దతుతో ఎలక్ట్రిక్ వాహన విభాగంలో ఒక విప్లవాన్ని సృష్టిస్తామని బలంగా నమ్ముతున్నట్లు వన్-మోటో సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. ఈ తయారీ యూనిట్ ఏర్పాటైన తరువాత దాదాపుగా 1,500 నుంచి 2,000 మందికి ఉద్యోగావకాశం లభిస్తుందని వన్-మోటో సంస్థ సీఈవో శుభంకర్ చౌదరి తెలిపారు.

రూ. 250 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు కానున్న బ్రిటీష్ సంస్థ: పూర్తి వివరాలు

వన్-మోటో కంపెనీ తెలంగాణాలో ఏర్పాటు చేయనున్న ఈ కొత్త తయారీ యూనిట్ మొదటి ఏడాదిలో దాదాపుగా 40 వేల ఎలక్ట్రిక్ వెహికల్స్ ను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కావున కంపెనీ దేశీయ మార్కెట్లో అతి త్వరలోనే అత్యంత ప్రజాదరణ పొందగలదని ఆశిస్తున్నాము.

రూ. 250 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు కానున్న బ్రిటీష్ సంస్థ: పూర్తి వివరాలు

ఇటీవలే గ్రేటర్ నోయిడా వేదికగా జరిగిన ఎక్స్‌పోలో తమ కొత్త ఈ-స్కూటర్ ను ఎలక్టాను వన్-మోటో సంస్థ విడుదల చేసింది. గతేడాది నవంబరులో భారత మార్కెట్లోకి వచ్చిన ఈ బ్రాండ్, ఇప్పటికే మూడు వేరియంట్స్ ను విఫణిలో ప్రవేశపెట్టింది. అవి బైకా, ఎలెక్టా, కమ్యూటా అనే వేరియంట్స్.

రూ. 250 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు కానున్న బ్రిటీష్ సంస్థ: పూర్తి వివరాలు

కంపెనీ యొక్క మూడు ఉత్పత్తులు ఒకే యాప్‌కు మద్దతునిస్తాయి. ఇది జియో-ఫెన్సింగ్, IoT మరియు బ్లూటూత్ వంటి ఫీచర్లను అందిస్తుంది. కానీ ఇప్పుడు విడుదలైన కొత్త స్కూటర్ ఇప్పటికే అందుబాటులో ఉన్న రెండు స్కూటర్‌ల నుండి వేరు చేస్తుంది. ఎందుకంటే ఇందులో 72 వి మరియు 45ఏ రిమూవబుల్ లిథియం-అయాన్ బ్యాటరీ కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ కేవలం నాలుగు గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేసుకోగలదు.

రూ. 250 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు కానున్న బ్రిటీష్ సంస్థ: పూర్తి వివరాలు

ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక్క ఛార్జ్ తో గరిష్టంగా 150 కి.మీ పరిధిని అందిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ 4KW QS బ్రష్‌లెస్ DC హబ్ మోటార్‌ను ఉపయోగిస్తుంది, ఇది 100 కిమీ/గం గరిష్ట వేగాన్ని పొందుతుంది. కావున వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

రూ. 250 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు కానున్న బ్రిటీష్ సంస్థ: పూర్తి వివరాలు

వన్-మోటో ఎలక్టా స్కూటర్ చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికి ఇది అద్భుతమైన ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటుంది. ఇందులో కంపెనీ అనలాగ్ డిస్‌ప్లేను ఉపయోగించింది, అంతే కాకూండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క రెండు చక్రాలపై హైడ్రాలిక్ డిస్క్ బ్రేక్‌లు మరియు ఆప్సనల్ క్రోమ్ అప్‌గ్రేడ్‌లు ఇవ్వబడ్డాయి. కావున ఇవన్నీ ఈ కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ కి మంచి క్లాసిక్ మరియు ఫ్రీమియం రూపాన్ని అందిస్తుంది.

రూ. 250 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు కానున్న బ్రిటీష్ సంస్థ: పూర్తి వివరాలు

One-Moto ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క కొలతల విషయానికి వస్తే, దీని పొడవు 890 మి.మీ, వెడల్పు 720 మి.మీ, ఎత్తు 1,090 మి.మీ మరియు వీల్‌బేస్ 1,390 మి.మీ వరకు ఉంటుంది. One-Moto Electa మొత్తం బరువు 115 కిలోలు మరియు 150 కిలోల పేలోడ్ సామర్థ్యంతో వస్తుంది.

రూ. 250 కోట్ల పెట్టుబడితో తెలంగాణలో ఏర్పాటు కానున్న బ్రిటీష్ సంస్థ: పూర్తి వివరాలు

One-Moto Electa మొత్తం 5 కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి మాట్ బ్లాక్, షైనీ బ్లాక్, బ్లూ, రెడ్ మరియు గ్రే కలర్స్. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి. మరియు చాలా ఆకర్షనీయంగా ఉంటుంది. భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న సమయంలో కంపెనీ ఈ కొత్త ఎలక్ట్రిక్ విడుదల చేయడం జరిగిందని వన్-మోటో ఇండియా సీఈవో శుభంకర్ చౌదరి తెలిపారు.

Most Read Articles

English summary
One moto to setup ev manufacturing unit in telangana details
Story first published: Tuesday, January 4, 2022, 9:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X