హంటర్ 350 సూపర్ హిట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కూడా బంపర్ హిట్..

ప్రపంచంలోని అత్యంత పురాతన మోటార్‌సైకిల్ బ్రాండ్లలో ఒకటైన రాయల్ ఎన్‌ఫీల్డ్ (Royal Enfield), ప్రస్తుతం భారతదేశంలో 350సీసీ మోటార్‌సైకిల్ విభాగంలో తన అధిపత్యాన్ని కొనసాగిస్తోంది. క్లాసిక్ 350, మీటియోర్ 350 మరియు కొత్తగా వచ్చిన హంటర్ 350 వంటి మోడళ్లతో కంపెనీ ఈ విభాగంలో బలమైన ప్రోడక్ట్ పోర్ట్‌ఫోలియోని మరియు అమ్మకాలను కలిగి ఉంది. గడచిన సెప్టెంబర్‌ 2022 నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 82,097 మోటార్‌సైకిళ్లను విక్రయించి, గతేడాది ఇదే సమయంతో పోలిస్తే 145 శాతం వృద్ధిని నమోదు చేసింది.

హంటర్ 350 సూపర్ హిట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కూడా బంపర్ హిట్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ సెప్టెంబర్ 2021 నెలలో కేవలం 33,529 ద్విచక్ర వాహనాలను మాత్రమే విక్రయించింది. అయితే, సెప్టెంబర్ 2022 నెలలో కంపెనీ అమ్మకాలు 82,097 యూనిట్లుగా నమోదయ్యాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి కొత్తగా వచ్చిన హంటర్ 350 ఆశించినదాని కన్నా ఎక్కువ విజయం సాధించడంతో అమ్మకాలు ఒక్కసారిగా పెరిగాయి. ఈ సమయంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ద్విచక్ర వాహన విక్రయాలు వార్షిక ప్రాతిపదికన 144.85 శాతం వృద్ధిని సాధించాయి.

హంటర్ 350 సూపర్ హిట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కూడా బంపర్ హిట్..

గత నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ దేశీయ మార్కెట్లో 73,646 యూనిట్ల అమ్మకాలను నమోదు చేసింది, వార్షిక ప్రాతిపదికన దేశీయ అమ్మకాలు (డొమెస్టిక్ సేల్స్) 170 శాతం వృద్ధిని సాధించాయి. గత ఏడాది కరోనా మహమ్మారి సమయంలో కంపెనీ ద్విచక్ర వాహనాల విక్రయాలు దెబ్బతిన్నాయి. అయితే, అంతకు ముందు సంవత్సరం ఇదే సమయంలో (సెప్టెంబర్ 2019 లో) రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు 54,858 యూనిట్లుగా నమోదయ్యాయి.

హంటర్ 350 సూపర్ హిట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కూడా బంపర్ హిట్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 మరియు ఇటీవల ప్రారంభించబడిన హంటర్ 350 మోడళ్లను కలిగి ఉన్న 350 సీసీ సెగ్మెంట్‌లో కంపెనీ అత్యధిక వృద్ధిని సాధించింది. ప్రత్యేకించి, కొత్త బైక్ హంటర్ 350 ఈ వృద్ధిలో కీలక పాత్ర పోషించింది మరియు గత నెలలో ఈ మోటార్‌సైకిల్ యొక్క అమ్మకాలు 18,197 యూనిట్లుగా నమోదయ్యాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క అత్యంత ప్రజాదరణ పొందిన క్లాసిక్ 350 మరియు హంటర్ 350 మోడళ్ల మధ్య కేవలం 796 యూనిట్ల వ్యత్యాసం మాత్రమే ఉంది.

హంటర్ 350 సూపర్ హిట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కూడా బంపర్ హిట్..

క్లాసిక్ 350 మరియు హంటర్ 350 మోడళ్లతో పోలిస్తే, ఇతర శక్తివంతమైన రాయల్ ఎన్‌ఫీల్డ్ వాహనాలైన మీటియోర్ 350, బుల్లెట్ 350, ఎలక్ట్రా 350, హిమాలయన్, స్క్రామ్ 411 మరియు 650 ట్విన్స్ చాలా వెనుకబడి ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ మోటార్‌సైకిళ్లకు దేశీయ మార్కెట్లోనే కాకుండా, పలు అంతర్జాతీయ మార్కెట్లలో కూడా మంచి డిమాండ్ ఉంది. ఆగస్ట్ 2022 నెలతో పోలిస్తే, గత నెలలో రాయల్ ఎన్‌ఫీల్డ్ 34.23 శాతం వార్షిక వృద్ధితో 8,451 యూనిట్లను ఎగుమతి చేసి, నెలవారీ ఎగుమతుల్లో 17.05 శాతం వృద్ధిని సాధించింది.

హంటర్ 350 సూపర్ హిట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కూడా బంపర్ హిట్..

సెప్టెంబరు 2022 అమ్మకాల గురించి రాయల్ ఎన్‌ఫీల్డ్ సీఈఓ బి గోవిందరాజన్ మాట్లాడుతూ, ఈ సంవత్సరం పండుగ సీజన్‌ చాలా గొప్పగా ప్రారంభమైందని, తాము ఇటీవల విడుదల చేసిన హంటర్ 350కి అద్భుతమైన స్పందన రావడంతో గత నెల అమ్మకాలలో తాము 145 శాతం వృద్ధిని చూస్తున్నామని అన్నారు. కొత్త హంటర్ 350 తమకు కొత్త మార్కెట్లను చేరుకునేందుకు మార్గం సుగమం చేస్తోందని చెప్పారు.

హంటర్ 350 సూపర్ హిట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కూడా బంపర్ హిట్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ నుండి తాజాగా మార్కెట్లోకి వచ్చిన హంటర్ 350 మోటార్‌సైకిల్ కంపెనీ అందించే ఇతర 350 సిసి మోటార్‌సైకిళ్ల కంటే చాలా భిన్నంగా కనిపిస్తుంది. స్క్రాంబ్లర్ టైప్ మోటార్‌సైకిల్ మాదిరిగా ఉండే హంటర్ 350, ఆధునికమైన రెట్రో డిజైన్‌ను కలిగి ఉంటుది. హంటర్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ మీటియోర్ మరియు కొత్త క్లాసిక్ 350లో ఉపయోగించిన J-సిరీస్ ఇంజన్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ సహాయంతో 20 బిహెచ్‌ పిపవర్ మరియు 27 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.

హంటర్ 350 సూపర్ హిట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కూడా బంపర్ హిట్..

రాయల్ ఎన్‌ఫీల్డ్ తమ ఇతర మోటార్‌సైకిల్‌ల మాదిరిగా కాకుండా, హంటర్ 350ని ఓ గ్లోబల్ మోడల్‌గా పరిచయం చేసింది. భారతదేశంతో పాటుగా పలు ఇతర అంతర్జాతీయ మార్కెట్లలో కూడా ఈ మోడల్ విక్రయించబడుతుంది. భారత మార్కెట్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మోటార్‌సైకిల్ ప్రారంభ ధర రూ. 1.49 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. ఇది రెట్రో, మెట్రో మరియు మెట్రో రెబెల్ అనే మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. ఈ ధర వద్ద హంటర్ 350 రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క చౌకైన బైక్‌గా నిలిచింది.

హంటర్ 350 సూపర్ హిట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కూడా బంపర్ హిట్..

హంటర్ 350 బైక్‌లో బ్లాక్-అవుట్ అల్లాయ్ వీల్స్, డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, 270 మిమీ రియర్ డిస్క్ బ్రేక్, ఎల్ఈడి టెయిల్ ల్యాంప్, ప్రీమియం-లుకింగ్ రౌండ్ టర్న్ ఇండికేటర్స్, ప్రీమియం స్విచ్ గేర్ మరియు డిజిటల్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ మొదలైనవి ఉన్నాయి. హంటర్ 350 ఈ సెగ్మెంట్‌లో హోండా సిబి350 ఆర్ఎస్, యెజ్డి స్క్రాంబ్లర్ మరియు ఇతర 300-350సీసీ మోటార్‌సైకిళ్లకు గట్టి పోటీనిస్తుంది.

హంటర్ 350 సూపర్ హిట్.. రాయల్ ఎన్‌ఫీల్డ్ అమ్మకాలు కూడా బంపర్ హిట్..

ధరల విషయానికి వస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మెట్రో వేరియంట్ ధర రూ. 1.63 లక్షలు మరియు రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350 మెట్రో రెబెల్ వేరియంట్ ధర రూ. 1.68 లక్షలు కాగా, బేస్ రెట్రో వేరియంట్ ధర రూ. 1.49 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఇండియా) గా ఉన్నాయి.

Most Read Articles

English summary
Royal enfield sold 82097 units in september 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X