Just In
- 4 hrs ago
దేశీయ విఫణిలో విడుదలైన కొత్త BMW X1: ధర రూ. 45.90 లక్షలు
- 7 hrs ago
కొత్త సంవత్సరంలో కూడా తగ్గని ధరల మోత: XUV700 ధరలు మళ్ళీ పెరిగాయ్..
- 8 hrs ago
మరింత అందంగా మారిపోయిన జావా 42 & యెజ్డీ రోడ్‌స్టర్: ఇవి తప్పకుండా మీ మనసు దోచేస్తాయ్..
- 11 hrs ago
రిషబ్ పంత్ ప్రాణాలు కాపాడిన వారికి గొప్ప గుర్తింపు.. వీడియో
Don't Miss
- News
త్రిపురలో 48 మందితో బీజేపీ తొలి జాబితా-మాజీ సీఎం విప్లవ్ కు షాక్-కేంద్రమంత్రి ప్రతిమకు చోటు
- Lifestyle
మీ పార్ట్నర్ ఎప్పుడూ మూడీగా ఉంటారా? వారితో వేగలేకపోతున్నారా? ఈ చిట్కాలు మీకోసమే
- Finance
Multibagger Stock: ఒక సంవత్సరంలో 1000 శాతం రాబడి అందించిన మల్టీబ్యాగర్ స్టాక్ ఇదే..!
- Movies
సీనియర్ నటి జమున బయోపిక్.. ఆ బ్యూటీఫుల్ హీరోయిన్ కోసం చర్చలు!
- Sports
INDvsNZ : ఉమ్రాన్ మాలిక్‌ను తీసేయండి.. రెండో టీ20కి మాజీ లెజెండ్ సలహా!
- Technology
ధర రూ.15000 ల లోపు మార్కెట్లో ఉన్న బెస్ట్ 5G ఫోన్లు! లిస్ట్ ,ధర వివరాలు!
- Travel
పచ్చని తలకోన.. చల్లని హార్స్లీ హిల్స్ చూసొద్దాం!
దేశీయ మార్కెట్లో బజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల.. ధర రూ. 95,000
భారతీయ మార్కెట్లో ప్రతి రోజు ఎదో ఒక వెహికల్ విడుదలవుతూనే ఉంది. ఇందులో పెట్రోల్ వెహికల్స్ మరియు ఎలక్ట్రిక్ వెహికల్స్ రెండూ ఉన్నాయి. ఇందులో భాగంగానే బెంగళూరుకు చెందిన 'స్టెల్లా మోటో' కంపెనీ తన మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ విడుదల చేసింది.
స్టెల్లా మోటో విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ పేరు 'బజ్' (Buzz). ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 95,000 (ఎక్స్-షోరూమ్). ఇది మొత్తమ్ నాలుగు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంది. అవి గ్రే, మ్యాట్ బ్లూ, రెడ్ మరియు బ్రౌన్ కలర్స్. ఈ స్కూటర్ మంచి డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతుంది. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ మీద మూడు సంవత్సరాలు వారంటీ అందిస్తుంది.

బజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ హెడ్ లైట్, ప్రత్యేకంగా రూపొందించిన బ్యాక్ లైట్ మరియు అల్లాయ్ రిమ్డ్ వీల్స్ వంటి వాటిని పొందుతుంది. అదే సమయంలో ఇందులో ఎ గ్రేడ్ లిథియం ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ఉంటుంది. ఈ బ్యాటరీ భారతీయ వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా రూపొందించబడి ఉంటుంది. కావున బ్యాటరీలో మంటలు వంటివి వచ్చే అవకాశం లేదు, ఇది చాలా సురక్షితమైన ఎలక్ట్రిక్ వెహికల్.
ఎలక్ట్రిక్ స్కూటర్ లో మంటల సమస్యను పరిష్కరించడానికి, కంపెనీ బ్యాటరీ ప్యాక్లో 4 టెంపరేచర్ సెన్సార్లను అమర్చింది. ఇది వెహికల్ యొక్క టెంపరేచర్ ని ఎప్పుడూ గమనిస్తూ ఉంటుంది. ఎక్కువ టెంపరేచర్ వద్ద పవర్ కట్ చేస్తుంది. ఇందులో మైక్రోప్రాసెసర్ బేస్డ్ స్మార్ట్ బిఎంఎస్ కూడా అందుబాటులో ఉంటుంది. బ్యాటరీ యొక్క ఖచ్చితమైన స్టేటస్ ను ట్రాక్ చేయడానికి వినియోగదారులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
కొత్త బజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ 2.16-కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ పొందుతుంది. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 90 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇందులో 2-కిలోవాట్ల బిఎల్ డిసి మోటారు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్టంగా గంటకు 55 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇది దాదాపు 150 కేజీల పే లోడ్ కెపాసిటీ కలిగి ఉంటుంది. కావున ఏదైనా చిన్న వస్తువులను రవాణా చేయడానికి ఉపయోగకరంగా ఉంటుంది.
బజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ నేల మీద నుండి 180 మి.మీ ఎత్తులో ఉంటుంది. కావున దాదాపు ఎలాంటి రోడ్డు మీద అయిన సజావుగా ముందుకు సాగుతుంది. అంతే కాకూండా ఇందులో బ్రేకింగ్ సిస్టం కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. కావున ఎలాంటి సమయంలో అయిన వాహనాన్ని కంట్రోల్ చేయడానికి అనుమతిస్తుంది. మొత్తమ్ మీద ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చూడటానికి సింపుల్ గా ఉన్నప్పటికీ మంచి పనితీరుని అందించేలా రూపొందించబడి ఉంటుంది.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ సందర్భంగా స్టెల్లా మోటో సీఈఓ మరియు ఫౌండర్ నకుల్ జైడ్కా మాట్లాడుతూ.. మొత్తానికి భారతీయ మార్కెట్లో మొదటి ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసేసాము. ప్రస్తుతం మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలను విపరీతంగా ఉన్న డిమాండ్ కారణంగా తప్పకుండా బజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ దేశీయ విఫణిలో మంచి ఆదరణ పొందుతుందని ఆశిస్తున్నాము. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను దేశవ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువస్తుందన్నారు.
బజ్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలు ఈ నెలలోనే ప్రారంభమవుతాయని కంపెనీ సిఈఓ తెలిపారు. కావున ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ కొనుగోలు చేయాలనుకునే కస్టమర్లు ఈ నెలలోనే డెలివరీలను కూడా పొందవచ్చు. తక్కువ ధర వద్ద మంచి రేంజ్ అందించే ఎలక్ట్రిక్ స్కూటర్ కావున మంచి అమ్మకాలు పొందుతుందనే ఆశిస్తున్నాము. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోవడానికి ఎప్పటికప్పుడు తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్ చూస్తూ ఉండండి.