దేశీయ విఫణిలో ఈ సంవత్సరం విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ టూ వీలర్స్.. పూర్తి వివరాలు

ఎలక్ట్రిక్ వాహనాలను పెరుగుతున్న ఆదరణ కారణంగా రోజురోజుకి దేశీయ మార్కెట్లో విడుదలవుతున్న ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య ఎక్కువవుతోంది. 202 లో భారతీయ విఫణిలో విడుదలైన టాప్ 5 ఎలక్ట్రిక్ టూ వీలర్స్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

దేశీయ విఫణిలో ఈ సంవత్సరం విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్

అల్ట్రావయోలెట్ ఎఫ్77:

బెంగళూరుకు చెందిన ప్రముఖ EV స్టార్టప్ కంపెనీ 'అల్ట్రావయోలెట్' దేశీయ మార్కెట్లో కొత్త 'ఎఫ్77' (F77) ఎలక్ట్రిక్ బైక్ విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ మూడు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి అల్ట్రావయోలెట్ ఎఫ్77, ఎఫ్77 రీకాన్ మరియు ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్. వీటి ధరలు వరుసగా రూ.3.80 లక్షలు, రూ.4.55 లక్షలు మరియు రూ. 5.50 లక్షలు (ధరలు, ఎక్స్ షోరూమ్).

దేశీయ విఫణిలో ఈ సంవత్సరం విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్

ఎఫ్77 లిమిటెడ్ ఎడిషన్ 10.3 కిలోవాట్ వాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఒక ఛార్జ్ తో 307 కిమీ పరిధి అందిస్తుంది. ఇది కేవలం 2.9 సెకన్లలో గంటకు 0 నుంచి 60 కిమీ మరియు 7.8 సెకన్లలో 0-100 కిమీ వరకు వేగవంతం అవుతుంది. ఇక బేస్ వేరియంట్ 7.1 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ కలిగి 207 కిమీ పరిధిని అందిస్తుంది. ఈ బైక్ కేవలం 3.4 సెకన్లలో గంటకు 0-60 కిమీ వేగవంతం అవుతుంది.

దేశీయ విఫణిలో ఈ సంవత్సరం విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్

హీరో విడా వి1:

హీరో మోటోకార్ప్ యొక్క 'విడా' ఎలక్ట్రిక్ స్కూటర్ రెండు వేరియంట్స్ లో అందుబాటులో ఉంటుంది. అవి 'వి1 ప్రో' (V1 Pro) మరియు 'వి1 ప్లస్' (V1 Plus). వీటి ధరలు వరుసగా రూ. 1.59 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 1.45 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ చాలా ఆకర్షణీయమైన డిజైన్ కలిగి ఉండటమే కాకుండా, అప్డేటెడ్ ఫీచర్స్ కలిగి వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటుంది.

దేశీయ విఫణిలో ఈ సంవత్సరం విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్

హీరో Vida V1 Plus ఎలక్ట్రిక్ స్కూటర్ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 143 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ. Vida V1 Pro ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇది ఒక సింగిల్ ఛార్జ్ తో గరిష్టంగా 165 కిలోమీటర్ల రేంజ్ అందిస్తుంది. ఈ స్కూటర్ టాప్ స్పీడ్ గంటకు 80 కిమీ వరకు ఉంటుంది.

దేశీయ విఫణిలో ఈ సంవత్సరం విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్

ఏథర్ 450X మూడవ జనరేషన్:

బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ భారత మార్కెట్లో విక్రయిస్తున్న తమ 450 సిరీస్ ఎలక్ట్రిక్ స్కూటర్లో మూడవ తరం స్కూటర్ విడుదల చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క బేస్ వేరియంట్ ప్రారంభ ధర రూ. 116,101 కాగా, టాప్-ఎండ్ వేరియంట్ రూ. 137,612 (ధరలు ఎక్స్-షో-రూమ్). కొత్త తరం ఏథర్ 450ఎక్స్ మరియు ఏథర్ 450 ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ ‌ల డిజైన్ పెద్దగా మార్చలేదు.

దేశీయ విఫణిలో ఈ సంవత్సరం విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్

కంపెనీ తన మునుపటి మోడల్ ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లలో 2.9kWh బ్యాటరీ ప్యాక్‌ అందించేది. అయితే, ఇప్పుడు జెన్ 3 ఏథర్ 450 ఎలక్ట్రిక్ స్కూటర్లలో పెద్ద 3.7kWh బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఈ కొత్త బ్యాటరీ ప్యాక్ 19 కేజీల బరువును కలిగి ఉంటుంది. ఈ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 146 కిలోమీటర్ల రేంజ్ (పరిధి) అందిస్తుందని కంపెనీ తెలిపింది.

దేశీయ విఫణిలో ఈ సంవత్సరం విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్

Ola S1 ఎయిర్:

ఓలా ఎలక్ట్రిక్ ఈ సంవత్సరం దీపావళి సందర్భంగా ఎస్1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్ చేసింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర రూ. 84,499. ఇందులో 2.5-కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ మరియు 4.5-కిలోవాట్ హబ్-మౌంటెడ్ మోటారు ఉంటుంది. కావున ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 101 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. అదే సమయంలో ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ గరిష్ట వేగం గంటకు 90 కిలోమీటర్ల వరకు ఉంటుంది.

దేశీయ విఫణిలో ఈ సంవత్సరం విడుదలైన టాప్ ఎలక్ట్రిక్ టూ వీలర్స్

ఓబెన్ రోర్:

బెంగళూరుకు చెందిన ఎలక్ట్రిక్ మొబిలిటీ స్టార్టప్ కంపెనీ ఒబెన్ ఈవీ దేశీయ మార్కెట్లో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'ఓబెన్ రోర్' (Oben Rorr) విడుదల చేసింది. దేశీయ విపణిలో ఒబెన్ రోర్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ ధర రూ.1.25 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది పూర్తి చార్జ్ పై గరిష్టంగా 200 కిలోమీటర్ల రేంజ్ ను ఆఫర్ చేస్తుందని సర్టిఫై చేయబడింది. అయితే, రియల్ వరల్డ్ లో ఈ రేంజ్ కొంత మారే అవకాశం ఉంటుంది.

Most Read Articles

English summary
Top five electric two wheeler launched in 2022 telugu details
Story first published: Saturday, December 31, 2022, 12:17 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X