జనవరిలో విడుదల కానున్న Tork Motors మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ Kratos

భారతదేశంలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల మార్కెట్ శరవేగంగా విస్తరిస్తోంది. మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వలన కలిగే ప్రయోనాజల పట్ల ప్రజల్లో కూడా అవగాహన పెరగడంతో ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ జోరందుకుంది. ఈ నేపథ్యంలో, మార్కెట్లో ఎలక్ట్రిక్ టూవీలర్లకు పెరుగుతున్న డిమాండ్ ను దృష్టిలో ఉంచుకొని అనేక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్‌ కంపెనీలు తమ ఎలక్ట్రిక్ వాహనాలను మార్కెట్లో విడుదల చేస్తున్నాయి. తాజాగా, మరొక కొత్త ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ తమ అధునాతన స్పోర్టీ లుకింగ్ టూవీలర్ మార్కెట్లో విడుదల చేసేందుకు సిద్ధమైంది.

జనవరిలో విడుదల కానున్న Tork Motors మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ Kratos

పూణేకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ టార్క్ మోటార్స్ (Tork Motors) భారతదేశంలో తమ మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'టార్క్ క్రాటోస్ టి6ఎక్స్' (Tork Kratos T6X) ఈ జనవరి నెలలో మార్కెట్లో విడుదల చేయనుంది. సమాచారం ప్రకారం, టార్క్ మోటార్స్ తమ లేటెస్ట్ మోటార్‌సైకిల్‌ను జనవరి చివరి వారంలో వర్చువల్ పద్ధతిలో విడుదల చేయవచ్చని తెలుస్తోంది. దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ వైరస్ విస్తరిస్తున్న నేపథ్యంలో, కంపెనీ ఈ నిర్ణయం తీసుకోనుంది.

జనవరిలో విడుదల కానున్న Tork Motors మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ Kratos

టార్క్ క్రాటోస్ నిజంగా 'మేడ్ ఇన్ ఇండియా' స్మార్ట్ మోటార్‌సైకిల్ అని మరియు ఆరు సంవత్సరాలుగా విస్తృతమైన పరిశోధన మరియు అభివృద్ధికి తుది రూపమే ఈ మోడల్ అని కంపెనీ తెలిపింది. టార్క్ మోటార్స్ తమ T6X మోటార్‌సైకిల్ కాన్సెప్ట్ ను మొదటిసారిగా 2016 సంవత్సరంలో ఆవిష్కరించింది. ఆ సమయంలో కంపెనీ ఈ ఇ-బైక్ ను రూ. 1,25,000 ప్రమోషనల్ ధరతో అందుబాటులో ఉంచాలని భావించింది. మరి ఇదే ధర ఇప్పుడు కూడా వర్తిస్తుందో లేదో చూడాలి.

జనవరిలో విడుదల కానున్న Tork Motors మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ Kratos

వర్చువల్ లాంచ్ జరిగిన వెంటనే టార్క్ క్రాటోస్ బుకింగ్‌లు కూడా ప్రారంభం కానున్నాయి. టార్క్ క్రాటోస్ టి6ఎక్స్ ఇ-బైక్ ధర దాదాపు రూ. 1.5 లక్షల (ఎక్స్-షోరూమ్) వద్ద రిటైల్ అవుతుందని అంచనా. ఇది 125cc-150cc మధ్యలో ఉండే పెట్రోల్ పవర్డ్ మోటార్‌సైకిళ్లకు పోటీగా నిలిచే అవకాశం ఉంది. కంపెనీ పేర్కొన్న సమాచారం ప్రకారం, అత్యధిక పీక్ పవర్ మరియు రేంజ్ కోసం అధునాతన యాక్సిల్ ఫ్లక్స్ మోటార్ టోపోలాజీని ఉపయోగించి కంపెనీ యాజమాన్యంలో ఉన్న టోర్క్ లియోన్ బ్యాటరీ ప్యాక్‌తో వచ్చిన భారతదేశపు మొట్టమొదటి నిలువుగా ఇంటిగ్రేటెడ్ ఎలక్ట్రిక్ వాహనం అని తెలిపింది.

జనవరిలో విడుదల కానున్న Tork Motors మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ Kratos

టార్క్ మోటార్స్ ప్రకారం, టార్క్ క్రాటోస్ దాని సిగ్నేచర్ TIROS (టోర్క్ ఇంట్యూటివ్ రెస్పాన్స్ ఆపరేటింగ్ సిస్టమ్) ఇంటెలిజెన్స్ సిస్టమ్‌తో వస్తుంది, ఇది పట్టణ ప్రయాణికులకు అసమానమైన రైడింగ్ అనుభూతిని అందించడంలో సహాయపడుతుంది. సాంకేతిక విశ్లేషణతో పాటు, ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో కనిపించే టిరోస్ దాని పవర్ మేనేజ్‌మెంట్, రియల్ టైమ్ పవర్ వినియోగం, డేటా కంపైలేషన్ మరియు ప్రతి రైడ్‌లో రేంజ్ ఫోర్కాస్టింగ్‌తో రైడర్ మరియు మెషీన్‌ను పూర్తి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

జనవరిలో విడుదల కానున్న Tork Motors మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ Kratos

ఈ మోటార్‌సైకిల్‌లో డేటా మరియు సర్వీస్ సపోర్ట్ కోసం 4G టెలిమెట్రీ ఉన్నాయి. ఇది స్టాండర్డ్ మరియు ఫాస్ట్ ఛార్జింగ్ సామర్థ్యాలను కలిగి ఉంటుంది. ఈ సందర్భంగా టార్క్ మోటార్స్ సీఈఓ మరియు వ్యవస్థాపకుడు కపిల్ షెల్కే మాట్లాడుతూ, "సంవత్సరాల విస్తృత పరిశోధన మరియు పునరావృతాల తర్వాత, తాము భారతదేశపు మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌తో ముందుకు వస్తున్నామని, తమ అధునాతన టార్క్ క్రాటోస్ ను ప్రపంచానికి పరిచయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని" తెలిపారు.

జనవరిలో విడుదల కానున్న Tork Motors మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ Kratos

ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ పేరు సూచించినట్లుగానే, ఇందులో క్రాటోస్ అంటే బలం మరియు శక్తి యొక్క వ్యక్తిత్వం. దీనికి క్రాటోస్‌గా అనే పేరును పెట్టడమే కాకుండా, దీనిని అంతర్గత మరియు బాహ్య బృందాలతో కఠినమైన పరీక్షల ద్వారా సాధించబడిన మరియు రీడిజైన్ చేయబడిన ఫ్రేమ్ మరియు స్టైలింగ్‌తో గతంలోని T6X కంటే పూర్తిగా సరికొత్త మోటార్‌సైకిల్‌గా క్రాటోస్ అభివృద్ధి చేయబడిందని కంపెనీ తెలిపింది.

జనవరిలో విడుదల కానున్న Tork Motors మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ Kratos

ఈ మోటార్‌సైకిల్ లోని ప్రధాన ఫీచర్లను గమనిస్తే, ఇందులో మెరుగైన ఎర్గోనామిక్స్, ఎల్ఈడి హెడ్‌లైట్ మరియు టైల్‌లైట్, సిటీ రైడ్‌ల సమయంలో సౌకర్యవంతమైన సీటింగ్ కోసం స్ప్లిట్ సీట్ మొదలైన ఫీచర్లు ఉన్నాయి. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ లో కంపెనీ ఓ పెద్ద బ్యాటరీ ప్యాక్‌ ను ఉపయోగించింది, ఇది సుధీర్ఘ రేంజ్ ను ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతానికి కంపెనీ దీని బ్యాటరీ మరియు ఎలక్ట్రిక్ మోటార్ గణాంకాలను ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

జనవరిలో విడుదల కానున్న Tork Motors మొట్టమొదటి ఎలక్ట్రిక్ బైక్ Kratos

లాంచ్ సయంలో కంపెనీ దీని బ్యాటరీ, రేంజ్ మరియు చార్జింగ్ టైమ్ వంటి పలు కీలక విషయాలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రారంభం నుండి, టార్క్ మోటార్స్ కంపెనీ తన ఆర్ అండ్ డి మరియు స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ టెక్నాలజీని బలోపేతం చేసిందని పేర్కొంది. దీన్ని బలోపేతం చేయడానికి, కంపెనీ IPR (ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్) కింద 50కి పైగా పేటెంట్లు మరియు డిజైన్లను కూడా దాఖలు చేసింది. వర్చువల్ లాంచ్ తర్వాత కంపెనీ టోర్క్ క్రాటోస్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను బుక్ చేయడం ప్రారంభిస్తుంది మరియు కొన్ని నెలల్లోనే డెలివరీలు ప్రారంభమవుతాయని భావిస్తున్నారు.

Most Read Articles

English summary
Tork motors first electric motorcycle kratos set to be launched in india very soon details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X