డెలివరీల వేగాన్ని పెంచడానికి ‘టోర్క్ మోటార్స్’ [Tork Motors] కొత్త ప్రణాళికలు.. నెలకు 5,000 బైకులు పక్కా

భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ బైకులకు పెరుగుతున్న డిమాండ్ ని దృష్టిలో ఉంచుకుని, ప్రముఖ ఎలక్ట్రిక్ బైక్ తయారీ సంస్థ 'టోర్క్ మోటార్స్' కొత్త ప్లాంట్ ఏర్పాటు చేయడానికి తగిన సన్నాహాలు సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన అధికారిక సమాచారం కంపెనీ వెల్లడించింది.

'టోర్క్ మోటార్స్' ఈ కొత్త ప్లాంట్ ని మహారాష్ట్రలోని చకాన్‌లో సిద్ధం చేస్తోంది. దీనికి సంబంధించిన అన్ని పనులు కూడా దాదాపు 95 శాతం పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇది దాదాపు 60,000 చదరపు అడుగుల విస్తీరణంలో నిర్మించబడి ఉంది. ఇందులో నెలకు 4,000 నుంచి 5,000 యూనిట్లను ఉత్పత్తి చేసే అవకాశం ఉంది. ఇది జరిగితే టోర్క్ ఎలక్ట్రిక్ బైక్ వినియోగించాలనుకునే వారి సులభంగా కొనుగోలు చేయవచ్చు.

టోర్క్ మోటార్స్ కొత్త ప్లాంట్

ఇప్పటికి కంపెనీ గత 8 నుంచి 9 నెలల కాలంగా ఎలక్ట్రిక్ బైకులను ఉత్పత్తి చేస్తూనే ఉంది. అయితే ఇందులో నెలకు కేవలం 500 యూనిట్లను మాత్రమే ఉత్పత్తి చేయగలుగుతోంది. అదే సమయంలో ఈ ప్లాంట్‌లో ఎలక్ట్రిక్ మోటార్లు మరియు బ్యాటరీలను కూడా ఉత్పత్తి కంపెనీ ఉత్పత్తి చేస్తోంది. అంతే కాకుండా కంపెనీ త్రీ వీలర్ ఎలక్ట్రిక్ వాహనాల కోసం మోటార్లను కూడా ఉత్పత్తి చేస్తుంది.

భారతీయ మార్కెట్లో 'టోర్క్ మోటార్స్' (Tork Motors) 'క్రటోస్' (Kratos) మరియు 'క్రటోస్ ఆర్' (Kratos R) అనే ఎలక్ట్రిక్ బైకులను విక్రయిస్తోంది. కంపెనీ దేశీయ విఫణిలో విడుదల చేసిన క్రటోస్ (Kratos) మరియు క్రటోస్ ఆర్ (Kratos R) ధరలు వరుసగా రూ. 1,22,499 మరియు రూ. 1,37,499 (సబ్సిడీ తరువాత ధరలు). ఇప్పటికె ఈ ఎలక్ట్రిక్ బైకుల యొక్క డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి.

టోర్క్ మోటార్స్ యొక్క రెండు ఎలక్ట్రిక్ బైకులు ఆధునిక ఫీచర్స్ మరియు పరికరాలను కలిగి ఉంటాయి. కావున ఆధునిక కాలంలో ఈ బైకులు ఎంతగానో అనుకూలంగా ఉంటాయి. కాగా ఇవి రెడ్, వైట్, బ్లూ మరియు బ్లాక్‌ కలర్ ఆప్సన్స్ లో అందుబటులో ఉన్నాయి. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. డిజైన్ మరియు ఫీచర్స్ మాత్రమే కాకుండా ఈ బైకులు మంచి పనితీరుని కూడా అందించేలా రూపొందించబడ్డాయి.

క్రటోస్ బైక్ 7.5kW ఎలక్ట్రిక్ మోటార్‌తో జత చేయబడి ఉంటుంది. ఈ బైక్ 4 kWh లిథియం-అయాన్ బ్యాటరీతో పనిచేస్తుంది. ఇది 10బిహెచ్‌పి పవర్ మరియు 28ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ ఒక ఫుల్ ఛార్జింగ్‌తో గరిష్టంగా 120 కిలోమీటర్ల పరిధిని అందిస్తుంది. ఇది కేవలం 4 సెకన్లలో గంటకు 0-40 కిమీ వరకు వేగవంతం కాగా, గరిష్ట వేగం గంటకు 100 కిలోమీటర్లు.

ఇక టోర్క్ క్రటోస్-ఆర్ బైక్ విషయానికి వస్తే, ఇది 9kW ఎలక్ట్రిక్ మోటారును కలిగి ఉంటుంది. ఇది 12 బిహెచ్‌పి పవర్ మరియు 38 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. దీని గరిష్ట వేగం గంటకు 105 కిలోమీటర్లు. ఇప్పుడు ఈ వేరియంట్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్సన్ తో కూడా అందుబాటులో ఉంటుంది. కావున ఇది కేవలం 60 నిమిషాల్లో 80 శాతం వరకు ఛార్జ్ చేసుకోగలదు.

టోర్క్ మోటార్స్ యొక్క క్రటోస్ మరియు క్రటోస్-ఆర్ రెండు ఎకో, సిటీ మరియు స్పోర్ట్స్ అనే 3 రైడింగ్ మోడ్‌లను పొందుతాయి. ఈ ఎలక్ట్రిక్ బైక్స్ రివర్స్ మోడ్ కూడా పొందుతాయి. సస్పెన్షన్ విషయానికి వస్తే ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్క్ మరియు వెనుక భాగంలో మోనోషాక్‌ ద్వారా నిర్వహిచబడుతుంది. క్రటోస్ యొక్క రెండు చివర్లలో డిస్క్ బ్రేక్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో సిబిఎస్ స్టాండర్డ్ గా అందుబాటులో ఉంటుంది.

Most Read Articles

English summary
Tork motors to open new plant with capacity of 5000 units per month details
Story first published: Thursday, December 1, 2022, 9:45 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X