ఆల్ట్రావైలెట్ ఎఫ్77 సూపర్‌బైక్ లాంచ్ ఖరారు.. విడుదల తేదీ మరియు బుకింగ్స్ సమాచారం..

బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఆల్ట్రావైలెట్ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ (Ultraviolette Automotive Pvt Ltd) గత కొన్నేళ్లుగా అభివృద్ధి చేస్తున్న భారతదేశపు మొట్టమొదటి హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'ఆల్ట్రావైలెట్ ఎఫ్77' (Ultraviolette F77) విడుదలకు ముహుర్తం ఖరారైంది. గత కొన్ని వారాలుగా మార్కెట్లో బజ్ క్రియేట్ చేస్తున్న ఈ స్టన్నింగ్ ఎలక్ట్రిక్ బైక్ నవంబర్ 24, 2022వ తేదీన భారత మార్కెట్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని ఆల్ట్రావైలెట్ కంపెనీ అధికారికంగా ధృవీకరించింది.

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 సూపర్‌బైక్ లాంచ్ ఖరారు.. విడుదల తేదీ మరియు బుకింగ్స్ సమాచారం..

అల్ట్రావైలెట్ కంపెనీ గత కొన్నేళ్లుగా తమ ఎలక్ట్రిక్ బైక్ ఎఫ్77ను రోడ్ టెస్ట్ చేస్తోంది. వాస్తవానికి గతేడాదిలోనే ఈ బైక్ మార్కెట్లో విడుదల కావల్సి ఉంది. అయితే, కోవిడ్-19 తెచ్చిన అవాంతరాల కారణంగా దీని విడుదల వాయిదా పడుతూ వచ్చింది. అయితే, ఈ సమయాన్ని కంపెనీ తమ బైక్‌ను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దేందుకు ఉపయోగించుకుంది. ఈ ఖాలీ సమయంలో కంపెనీ తమ ఎఫ్77 బైక్ లో అనేక టెక్నికల్ అప్‌గ్రేడ్స్ చేసింది. తాజాగా ఈ బైక్ యొక్క ఉష్ణోగ్రత పరీక్షకు సంబంధించిన వీడియోని కూడా విడుదల చేశారు.

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 సూపర్‌బైక్ లాంచ్ ఖరారు.. విడుదల తేదీ మరియు బుకింగ్స్ సమాచారం..

ఈ పరీక్షలో ఆల్ట్రావైలెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ బైక్ ను కఠినమైన సూర్యకాంతిలో పరీక్షిస్తున్నట్లు చూపబడింది. బైక్ యొక్క ఉష్ణోగ్రతను పరీక్షించడానికి, కంపెనీ సీఈఓ నారాయణ్ సుబ్రమణ్యం స్వయంగా వేడి ఉష్ణోగ్రతలపై ఈ బైక్‌ని నడిపారు. కాగా, ఇటీవలే ఈ బైక్ యొక్క ట్రైల్ ప్రొడక్షన్‌ను కూడా విజయవంతంగా పూర్తి చేశారు. బెంగుళూరులోని హోసూర్ ప్లాంట్‌లో ఈ ఎలక్ట్రిక్ బైక్ ట్రైల్ రన్ విజయవంతంగా ప్రారంభమైంది. కంపెనీ ప్రకారం, F77 ఇ-బైక్ ఐదు సంవత్సరాల పరిశోధన మరియు కఠినమైన పరీక్షల తర్వాత రూపొందించబడింది.

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 సూపర్‌బైక్ లాంచ్ ఖరారు.. విడుదల తేదీ మరియు బుకింగ్స్ సమాచారం..

కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఎలక్ట్రిక్ బైక్ కోసం ఇప్పటికే 190 దేశాల నుండి 70,000 యూనిట్లకు పైగా ప్రీ-లాంచ్ బుకింగ్‌లు వచ్చినట్లు తెలిపింది. ఆల్ట్రావైలెట్ ఎఫ్77 ఎయిర్‌స్ట్రైక్, షాడో మరియు లేజర్ అనే మూడు వేరియంట్‌లలో విడుదల కానుంది. ఆల్ట్రావైలెట్ ఎఫ్77 ను మొదటిసారిగా ఆవిష్కరించబడినప్పటి నుండి ఇది సాధారణ ఎలక్ట్రిక్ బైక్ మాదిరిగా కాకుండా, ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన హై-స్పీడ్ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా ప్రచారం చేయబడింది.

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 సూపర్‌బైక్ లాంచ్ ఖరారు.. విడుదల తేదీ మరియు బుకింగ్స్ సమాచారం..

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 ఇ-బైక్ ను తొలిసారిగా 2019లో హైటెక్ ఫీచర్‌లతో ఆవిష్కరించారు. ఇది పూర్తిగా భారతదేశంలో రూపొందించబడిన మరియు ఇంజనీరింగ్ చేయబడిన అర్బన్ స్పోర్ట్స్ బైక్. విమానయాన పరిశ్రమలో ఉపయోగించే సూత్రాలతో దీనిని రూపొందించారు. దీని గరిష్ట వేగం గంటకు 150 కిలోమీటర్ల వరకు ఉంటుంది. ఇది కేవలం 7.5 సెకన్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. పూర్తి ఛార్జింగ్‌తో ఇది 130 కిలోమీటర్ల నుండి 150 కిలోమీటర్ల రేంజ్ ను అందిస్తుంది.

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 సూపర్‌బైక్ లాంచ్ ఖరారు.. విడుదల తేదీ మరియు బుకింగ్స్ సమాచారం..

ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో ఉపయోగించిన ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 33.5 బిహెచ్‌పి పవర్ ను మరియు 90 ఎన్ఎమ్ టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఆల్ట్రావైలెట్ ఎఫ్77 ఒక అధునాతనమైన స్మార్ట్ అండ్ కనెక్టెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. దీనిని ధృడమైన స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించారు. ఇందులో ముందు వైపు ఇన్‌వర్టెడ్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో గ్యాస్ ఛార్జ్డ్ ప్రీలోడెడ్ అడ్జస్టబల్ మోనో షాక్‌ అబ్జార్వర్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్ మరియు 420 పిస్టన్ కాలిపర్ మరియు వెనుక బాగంలో 230 మిమీ డిస్క్ మరియు పిస్టన్ కాలిపర్‌‌లు ఉంటాయి.

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 సూపర్‌బైక్ లాంచ్ ఖరారు.. విడుదల తేదీ మరియు బుకింగ్స్ సమాచారం..

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 ఫాస్ట్ ఛార్జింగ్‌ను కూడా సపోర్ట్‌ చేస్తుంది. ఇది ఫాస్ట్ ఛార్జర్ సాయంతో కేవలం 30 నిమిషాల్లోనే 0 నుండి 80 శాతం వరకు ఛార్జ్ అవుతుంది. అయితే పూర్తిగా 100 శాతం ఛార్జ్ చేయడానికి సుమారు 50 నిమిషాలు పడుతుంది. అదే సాధారణ ఛార్జర్‌తో ఈ బైక్ ను పూర్తిగా చార్జ్ చేయాలంటే, సుమారు 5 గంటల సమయం పడుతుంది. ఇంకా ఇందులో డ్యూయల్-ఛానల్ ఏబిఎస్, సర్దుబాటు సస్పెన్షన్, మల్టిపుల్ డ్రైవ్ మోడ్‌లు, రీజెనరేటివ్ బ్రేకింగ్ వంటి హార్డ్‌వేర్ మరియు సాఫ్ట్‌వేర్ ఫీచర్‌లు కూడా ఉన్నాయి.

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 సూపర్‌బైక్ లాంచ్ ఖరారు.. విడుదల తేదీ మరియు బుకింగ్స్ సమాచారం..

ఈ ఎలక్ట్రిక్ బైక్ లో ఇరువైపులా 17 ఇంచ్ అల్లాయ్ వీల్స్ ఉంటాయి. వాటిపై ముందు వైపు 110/70 R17 ప్రొఫైల్ టైర్ మరియు వెనుక వైపు 150/60 R17 ప్రొఫైల్ టైర్ అమర్చబడి ఉంటాయి. అంతేకాకుండా, ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో బోష్, గాబ్రియేల్, మిండా, బ్రెంబో వంటి ప్రసిద్ధ అంతర్జాతీయ బ్రాండ్‌లకు చెందిన విడిభాగాలను కూడా ఉపయోగించారు. మొదటి చూపులో ఈ బైక్ చాలా ఆధునికంగా మరియు భవిష్యత్ నుండి స్ఫూర్తి పొంది తయారు చేసినట్లుగా కనిపిస్తుంది. మార్కెట్లో దీని ధర సుమారు రూ.3 లక్షల రేంజ్‌లో ఉండొచ్చని అంచనా. మరిన్ని లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం తెలుగు డ్రైవ్‌స్పార్క్ ని గమనిస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Ultraviolette f77 electric sports bike launch confirmed for 24th november 2022 details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X