ట్రైల్ ప్రొడక్షన్‌కు చేరుకున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77 పెర్ఫార్మెన్స్ ఇ-బైక్.. ఇక విడుదలకు అంతా సిద్ధమైనట్లే..

బెంగుళూరుకి చెందిన ఎలక్ట్రిక్ వెహికల్ స్టార్టప్ కంపెనీ ఆల్ట్రావైలెట్ ఆటోమోటివ్ ప్రైవేట్ లిమిటెడ్ (Ultraviolette Automotive Pvt Ltd) గత ఐదేళ్లుగా అభివృద్ధి చేస్తున్న భారతదేశపు మొట్టమొదటి హై-పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ 'ఆల్ట్రావైలెట్ ఎఫ్77' (Ultraviolette F77) ఎట్టకేలకు ఉత్పత్తి దశకు చేరుకుంది. బెంగుళూరులోని హోసూర్ ప్లాంట్‌లో ఈ ఎలక్ట్రిక్ బైక్ ట్రైల్ రన్ విజయవంతంగా ప్రారంభమైంది. దీన్నిబట్టి చూస్తుంటే, త్వరలోనే ఇది భారత రోడ్లపై పరుగులు తీసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ట్రైల్ ప్రొడక్షన్‌కు చేరుకున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77 పెర్ఫార్మెన్స్ ఇ-బైక్.. ఇక విడుదలకు అంతా సిద్ధమైనట్లే..

ఆల్ట్రావైలెట్ సంస్థ ఇటీవలే ఈ పెర్ఫార్మెన్స్ ఇ-బైక్ నుమొదటిసారిగా టెస్ట్ రైడ్ చేసే అవకాశాన్ని భారతదేశ పైలట్ కమ్యూనిటీకి కల్పించింది. గడచిన ఆగస్ట్ నెలలో భారతదేశం యొక్క 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని, ఈ కంపెనీ భారతదేశ పైలట్ కమ్యూనిటీతో తమ హై పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ Ultraviolette F77 కోసం ప్రత్యేక టెస్ట్ రైడ్‌ను కూడా నిర్వహించింది. ఆల్ట్రావైలెట్ ఎఫ్77 ట్రయల్ ప్రొడక్షన్‌లోకి ప్రవేశించడం అనేది ఈ బైక్ లాంచ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న వారికి గొప్ప శుభవార్త అని చెప్పవచ్చు.

ట్రైల్ ప్రొడక్షన్‌కు చేరుకున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77 పెర్ఫార్మెన్స్ ఇ-బైక్.. ఇక విడుదలకు అంతా సిద్ధమైనట్లే..

ఆల్ట్రావైలెట్ కంపెనీ తమ ఎఫ్77 ను మొదటిసారిగా ఆవిష్కరించనప్పటి నుండి ఇది సాధారణ ఎలక్ట్రిక్ బైక్ మాదిరిగా కాకుండా, ఔత్సాహికుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన హై-స్పీడ్ పెర్ఫార్మెన్స్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌గా పరిచయం చేసింది. అప్పటి నుండి మార్కెట్లో ఈ ఎలక్ట్రిక్ బైక్ భారీ హైప్‌ను కలిగి ఉంది. ఆల్ట్రావైలెట్ ఎఫ్77 తొలిసారిగా 2019లో హైటెక్ ఫీచర్‌లతో ఆవిష్కరించబడింది.

ట్రైల్ ప్రొడక్షన్‌కు చేరుకున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77 పెర్ఫార్మెన్స్ ఇ-బైక్.. ఇక విడుదలకు అంతా సిద్ధమైనట్లే..

వాస్తవానికి, ఈ మోటార్‌సైకిల్ 2020 నాటికి విడుదల చేయబడుతుందని అందరూ భావించారు. అయితే, కోవిడ్-19 మహమ్మారి కంపెనీ ప్లాన్స్‌ని తలక్రిందులు చేసింది. అయితే, కంపెనీ ఈ విరామ సమయాన్ని వృధా చేసుకోకుండా, తమ హై-పెర్ఫార్మెన్స్ బైక్‌ను మరిన్ని కొత్త సాంకేతికలతో అప్‌గ్రేడ్ చేయడానికి ఉపయోగించుకుంది. ఆల్ట్రావైలెట్ ఆటోమోటివ్ తమ ఎఫ్77 మోటార్‌సైకిల్‌ను ఆవిష్కరించినప్పటి నుండి ఇప్పటి వరకూ అనేక పారామితులలో మరియు అనేక దశల ప్రధాన పురోగతిని సాధించింది.

ట్రైల్ ప్రొడక్షన్‌కు చేరుకున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77 పెర్ఫార్మెన్స్ ఇ-బైక్.. ఇక విడుదలకు అంతా సిద్ధమైనట్లే..

భారతదేశంలో రూపొందించబడిన మరియు ఇంజనీరింగ్ చేయబడిన, ఆల్ట్రావైలెట్ ఎఫ్77 అనేది విమానయాన పరిశ్రమలో ఉపయోగించే సూత్రాలతో రూపొందించబడిన ఓ అర్బన్ స్పోర్ట్స్ బైక్. సాధారణ ఇ-బైక్‌లకు ఆల్ట్రావైలెట్ ఇ-బైక్‌కు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రస్తుతం, భారత మార్కెట్లోనే అత్యంత అధునాతనమైన అధిక పనితీరు గల ఎలక్ట్రిక్ బైక్‌లలో ఒకటిగా ఉన్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77 త్వరలోనే వినియోగదారులకు అందుబాటులోకి రానుంది.

ట్రైల్ ప్రొడక్షన్‌కు చేరుకున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77 పెర్ఫార్మెన్స్ ఇ-బైక్.. ఇక విడుదలకు అంతా సిద్ధమైనట్లే..

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 మోటార్‌సైకిల్ కంపెనీ ఇటీవల చేసిన మేజర్ అప్‌గ్రేడ్స్ లో దాని బ్యాటరీ ప్యాక్ కూడా ఒకటి. ఇందులో ఇదివరకు ఉపయోగించిన 18,650 కెపాసిటీ సెల్స్ కు బదులుగా మరింత శక్తివంతమైన మరియు సమర్థవంతమైన 21,700 కెపాసిటీ సెల్స్ ను ఆల్ట్రావైలెట్ ఉపయోగించింది. ఈ బ్యాటరీ ప్యాక్ లో ఉపయోగించిన సెల్ సామర్థ్యం పెరిగిన కారణంగా ఆల్ట్రావైలెట్ ఎఫ్77 యొక్క రేంజ్ మరియు పనితీరు రెండూ కూడా పెరిగాయని కంపెనీ తెలిపింది. మునుపటి బ్యాటరీతో పోలిస్తే, ఈ పెరుగుదల దాదాపు 20 శాతం వరకూ ఉంటుందని అంచనా వేయబడింది.

ట్రైల్ ప్రొడక్షన్‌కు చేరుకున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77 పెర్ఫార్మెన్స్ ఇ-బైక్.. ఇక విడుదలకు అంతా సిద్ధమైనట్లే..

ఈ బైక్‌లో చేసిన కొత్త అభివృద్ధి ఫలితంగా, ఈ మోటార్‌సైకిల్ రేంజ్ ఇప్పుడు దాదాపు 200 కిలోమీటర్లు ఉంటుందని అంచనా వేయబడింది. ఇది 2019లో వాగ్దానం చేసిన 130-150 కిలోమీటర్ల కంటే చాలా ఎక్కువ. అయితే ఈ బైక్ స్టైలింగ్ పరంగా పెద్దగా ఏమీ మారలేదు. గతంలో కంపెనీ ఆవిష్కరించినప్పుడు ఇది ఎలా ఉందో, ఉత్పత్తి దశకు చేరుకునేటప్పుడు కూడా అలానే ఉంది. పెరిగిన బ్యాటరీ ప్యాక్ కారణంగా, ఇందులోని ఎలక్ట్రిక్ మోటార్ పనితీరు కూడా పెరిగింది.

ట్రైల్ ప్రొడక్షన్‌కు చేరుకున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77 పెర్ఫార్మెన్స్ ఇ-బైక్.. ఇక విడుదలకు అంతా సిద్ధమైనట్లే..

ఆల్ట్రావైలెట్ ఎఫ్77 ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌లో బిఎల్‌డిసి ఎలక్ట్రిక్ మోటార్ గరిష్టంగా 33 బిహెచ్‌పి శక్తిని మరియు 90 ఎన్ఎమ్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 2.8 సెకన్లలోనే గంటకు 0 నుండి 60 కిలోమీటర్ల వేగాన్ని చేరుకుంటుంది. అలాగే, 7.5 సెకండ్లలోనే గంటకు 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ టాప్ స్పీడ్ గంటకు 150 కిలోమీటర్లుగా ఉంటుంది.

ట్రైల్ ప్రొడక్షన్‌కు చేరుకున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77 పెర్ఫార్మెన్స్ ఇ-బైక్.. ఇక విడుదలకు అంతా సిద్ధమైనట్లే..

మెకానికల్స్ విషయానికి వస్తే, ఆల్ట్రావైలెట్ ఎఫ్77 ఒక అధునాతనమైన స్మార్ట్ అండ్ కనెక్టెడ్ ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్. దీనిని ధృడమైన స్టీల్ ట్రెల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించారు. ఇందులో ముందు వైపు ఇన్‌వర్టెడ్ ఫ్రంట్ ఫోర్కులు మరియు వెనుక భాగంలో గ్యాస్ ఛార్జ్డ్ ప్రీలోడెడ్ అడ్జస్టబల్ మోనో షాక్‌ అబ్జార్వర్ ఉంటాయి. బ్రేకింగ్ విషయానికి వస్తే, ముందు భాగంలో 320 మిమీ డిస్క్ బ్రేక్ మరియు 420 పిస్టన్ కాలిపర్ మరియు వెనుక బాగంలో 230 మిమీ డిస్క్ మరియు పిస్టన్ కాలిపర్‌‌లు ఉంటాయి.

ట్రైల్ ప్రొడక్షన్‌కు చేరుకున్న ఆల్ట్రావైలెట్ ఎఫ్77 పెర్ఫార్మెన్స్ ఇ-బైక్.. ఇక విడుదలకు అంతా సిద్ధమైనట్లే..

ఈ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ పెర్ఫార్మెన్స్ ఓరియెంటెడ్ మోడల్ కాబట్టి, ఇది స్టీల్-బ్రాండెడ్ బ్రేక్ లైన్లు మరియు 110/70 R17 ఫ్రంట్ టైర్ మరియు 150/60 R17 రియర్ టైర్ ను కలిగి ఉంటుంది. ఇప్పుడు, ఈ మోటార్‌సైకిల్ ట్రయల్ ప్రొడక్షన్ దశకు చేరుకుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్‌లో Bosch, Gabriel, Minda, Brembo మొదలైన ప్రసిద్ధ బ్రాండ్‌లకు చెందిన విడిభాగాలను ఉపయోగించినట్లు కంపెనీ తెలిపింది.

Most Read Articles

English summary
Ultraviolette f77 performance electric motorcycle trail production commenced
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X