2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన Moto Morini బైకులు - వివరాలు

2023 ఆటో ఎక్స్‌పోలో ఇటాలియన్ బైక్ బ్రాండ్ Moto Morini రెండు బైకులను ప్రదర్శించింది. ఇందులో ఒకటి 'మోటో మోరిని X-కేప్ 650' కాగా మరొకటి 'మోటో మోరిని X-కేప్ 650ఎక్స్'. కంపెనీ ప్రదర్శించిన ఈ రెండు బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

హైదరాబాద్ కు చెందిన 'ఆదీశ్వర్ ఆటో రైడ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్' (Adishwar Auto Ride India Pvt Ltd) తో కలిసి మార్కెట్లోకి ప్రవేశించిన మోటో మోరిని అద్భుతమైన బైకులను తీసుకువచ్చింది. ఈ రెండు బైకులు ఆటో ఎక్స్‌పోలో ప్రేక్షకుల దృష్టిని ఎంతగానో ఆకర్శించాయి. కంపెనీ ప్రదర్శించిన ఈ డిజైన్ కలిగి అధునాతన ఫీచర్స్ పొందుతాయి. అంతే కాకుండా రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా కూడా ఉంటాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన Moto Morini బైకులు

కంపెనీ ప్రదర్శించిన బైకుల్లో ఒకటైన Moto Morini X-Cape 650 ఒక కమ్యూటర్ బైక్, కాగా X-Cape 650X అనేది అడ్వెంచర్ టూరర్ మోటార్‌సైకిల్. ఈ రెండు బైకులు రోజు వారీ వినియోగానికి మరియు లాంగ్ రైడ్ చేయడానికి అనుకూలంగా ఉంటాయి. ఎక్స్-కేప్ 650 బైక్ అల్లాయ్ వీల్స్‌ కలిగి ఉంటె, ఎక్స్-కేప్ 650ఎక్స్‌ బైక్ స్పోక్ వీల్స్ పొందుతుంది. అయితే రెండు బైక్‌లు 19 ఇంచెస్ ఫ్రంట్ మరియు 17 ఇంచెస్ రియర్ టైర్లను కలిగి ఉంటాయి.

ఇది వరకు చెప్పుకున్నట్లుగానే Moto Morini యొక్క రెండు బైక్‌లు ఆధునిక ఫీచర్లతో అందుబాటులో ఉంటాయి. కావున వీటిలో బ్లూటూత్ కనెక్టివిటీ, ఎల్‌ఇడి లైట్లు, బాష్ ప్లేట్, పొడవైన విండ్‌స్క్రీన్, నకిల్ గార్డ్, యుఎస్‌బి సాకెట్ వంటి వాటితో పాటు టిఎఫ్‌టి స్క్రీన్ కూడా పొందుతుంది. ఇది బైక్ గురించి రైడర్ కి చాలా సమాచారాన్ని అందిస్తుంది. ఈ బైకులు మెరుగైన బ్రేకింగ్ కోసం, ముందువైపు డ్యూయల్ డిస్క్ బ్రేక్‌లు మరియు వెనుకవైపు సింగిల్ డిస్క్ పొందుతాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన Moto Morini బైకులు

Moto Morini X-Cape 650X బైకులో లిక్విడ్ కూల్డ్ 649 సిసి ట్విన్ సిలిండర్ ఇంజన్ ఉపయోగించారు. ఇది 8,250 ఆర్‌పిఎమ్ వద్ద 59 బిహెచ్‌పి పవర్‌ మరియు 7,000 ఆర్‌పిఎమ్ వద్ద 54 ఎన్ఎమ్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్‌బాక్స్ కి జతచేయబడి ఉంటుంది. కావున మంచి పనితీరుని అందిస్తుంది. పరిమాణం పరంగా Moto Morini X-Cape 650X చాలా అనుకూలంగా ఉంటుంది.

ఈ బైక్ పొడవు 2,200 మిమీ, వెడల్పు 900 మిమీ మరియు ఎత్తు 1,390 మిమీ వరకు ఉంటుంది. కాగా ఈ బైక్ యొక్క వీల్ బేస్ విషయానికి వస్తే ఇది 1,490 మిమీ వరకు ఉంటుంది మరియు గ్రౌండ్ క్లియరెన్స్ 650X 175 మిమీ ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ కెపాసిటీ 18 లీటర్ల వరకు ఉంటుంది, కావున లాంగ్ రైడ్ చేయడానికి కూడా ఈ బైక్ ఉపయోగకరంగా ఉంటుంది. మొత్తం మీద ఈ బైక్ బరువు కేవలం 215 కేజీలు మాత్రమే. కావున రైడర్ కి మంచి రైడింగ్ అనుభూతిని అందిస్తుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో కనిపించిన Moto Morini బైకులు

మోటో మోరిని ఇప్పటికె ఈ రెండు బైకులను దేశీయ మార్కెట్లో విడుదల చేసింది. కావున ఈ రెండు బైకుల (Moto Morini X-Cape 650 మరియు X-Cape 650X) ధరలు రూ. 7.20 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ. 7.40 లక్షలు (ఎక్స్-షోరూమ్) గా ఉన్నాయి. ఈ రెండు బైకులు పేర్లు కూడా దేశీయ మార్కెట్లో చాలామందికి తెలియకపోవచ్చు. అయితే అద్భుతమైన పనితీరుని మాత్రం ఖచ్చితంగా అందిస్తాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడ్డాయి మరియు విడుదలయ్యాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడిన/విడుదలైన వాహనాలను గురించి తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.

Most Read Articles

English summary
Auto expo 2023 moto morini x cape 650 and 650x showcased features details in telugu
Story first published: Friday, January 13, 2023, 19:48 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X