లైగర్ మొబిలిటీ సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్: పడిపోతామనే భయం లేకుండా ప్రయాణించండి

ముంబైకి చెందిన లైగర్ మొబిలిటీ కంపెనీ 2023 ఆటో ఎక్స్‌పోలో రెండు కొత్త సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్‌లను ఆవిష్కరించింది. కంపెనీ ఆవిష్కరించిన ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్ల డిజైన్, ఫీచర్స్ మరియు ఇతర వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

లైగర్ మొబిలిటీ విడుదల చేసిన రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఎక్స్ మరియు ఎక్స్+. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఆటో బ్యాలెన్సింగ్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. ఈ టెక్నాలజీ కలిగి ఉండటం వల్ల ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ నిలిపి ఉంచినప్పుడు స్టాండ్ వేయకుండా పోయిన తనకు తానుగా నిలబడుతుంది. ఈ స్కూటర్ యొక్క నిర్ణయించిన వేగాన్ని దాటిన తర్వాత ఈ ఆటోబ్యాలెన్సింగ్ ఫీచర్‌ని మాన్యువల్‌గా స్విచ్ ఆఫ్ చేయవచ్చు.

సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన Liger

ఈ కొత్త Liger X మరియు X+ ఎలక్ట్రిక్ స్కూటర్లు రెండూ కూడా ఒక లెర్నర్ మోడ్‌ను కలిగి ఉన్నాయి. ఇది ఆటోబ్యాలెన్సింగ్ ఫీచర్‌తో కలిసి స్కూటర్ యొక్క గరిష్ట వేగాన్ని పరిమితం చేయడానికి రైడర్‌ని అనుమతిస్తుంది. ఈ లేటెస్ట్ ఎలక్ట్రిక్ స్కూటర్లు OTA (ఓవర్ ది ఎయిర్) సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లను కూడా పొందుతాయి. కావున ఈ ఆధునిక కాలంలో సరైన రైడింగ్ రానివారు కూడా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్లను సులభంగా రైడింగ్ చేయవచ్చు.

లైగర్ ఎక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్లో రిమూవబుల్ లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. కావున అవసరమైన చోట దీనిని బయటకు తీయవచ్చు. ఈ బ్యాటరీ పూతిగా ఛార్జ్ కావడానికి పట్టే సమయం 3 గంటలు. ఇది ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 60 కిమీ రేంజ్ అందిస్తుందని ధృవీకరించబడింది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క గరిష్ట వేగం గంటాకు 65 కిమీ వరకు ఉంటుంది.

సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన Liger

ఇక లైగర్ ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే, ఇందులో ఫిక్స్ బ్యాటరీ లేదా నాన్-రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌ ఉంటుంది. ఈ బ్యాటరీ ఒక ఫుల్ ఛార్జ్ తో గరిష్టంగా 100 కిమీ రేంజ్ అందిస్తుంది. ఇది ఫుల్ ఛార్జ్ కావడానికి పట్టే సమయం 4.5 గంటలు. అంతే కాకుండా లైగర్ ఎక్స్ ప్లస్ ఎలక్ట్రిక్ స్కూటర్ యొక్క TFT డ్యాష్ బోర్డు స్మార్ట్‌ఫోన్‌కి జత చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. దీని ద్వారా నోటిఫికేషన్ అలర్ట్ మరియు టర్న్-బై-టర్న్ నావిగేషన్ వంటి ఫీచర్స్ పొందవచ్చు.

అంతే కాకుండా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ లో లైవ్ లొకేషన్ ట్రాకింగ్, బ్యాటరీ టెంపరేచర్ ఇండికేటర్, టోయింగ్ మరియు యాక్సిడెంట్ అలర్ట్‌లు వంటి ఫీచర్లు పొందుతాయి. ఇవన్నీ కూడా రైడర్లకు చాలా అనుకూలంగా ఉంటాయి. ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లు ఐదు కలర్ ఆప్సన్స్ లో అందుబాటులో ఉంటాయి. అవి గ్రే, పోలార్ వైట్, బ్లూ, టైటానియం మరియు రెడ్ కలర్స్. ఇవన్నీ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.

సెల్ఫ్ బ్యాలెన్సింగ్ ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరించిన Liger

లైగర్ మొబిలిట్రీ యొక్క ఎలక్ట్రిక్ స్కూటర్ చూడగానే వెస్పా డిజైన్ మాదిరిగా అనిపిస్తుంది. అయితే తీక్షణంగా గమనిస్తే ఈ స్కూటర్ డిజైన్ అవగతమవుతుంది. ఈ స్కూటర్ పైభాగంలో సొగసైన క్షితిజ సమాంతర LED డేటైమ్ రన్నింగ్ లైట్ (DRL) మరియు LED హెడ్‌ల్యాంప్ ఉన్నాయి. లైగర్ మొబిలిటీ తన లైగర్ ఎక్స్ మరియు లైగర్ X+ ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం 2023 మధ్యలో బుకింగ్స్ స్వీకరించనుంది. అయితే డెలివరీలు ఈ సంవత్సరం చివరి నాటికి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడతాయి మరియు విడుదలవుతాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడే/విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' ఫై క్లిక్ చేయండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.

Most Read Articles

English summary
Liger mobility unveiled self balancing electric scooters in 2023 auto expo
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X