ఆటో ఎక్స్‌పో 2023: ఒకే వేదికపై రెండు ఎలక్ట్రిక్ బైకులు ఆవిష్కరించిన Matter

2023 ఆటో ఎక్స్‌పోలో ఎలక్ట్రిక్ వాహనాలు భారీగానే ఆవిష్కరించబడ్డాయి. ఇందులో మ్యాటర్ (Matter) కంపెనీ కూడా ఉంది. మ్యాటర్ కంపెనీ ఆటో ఎక్స్‌పోలో రెండు ఎలక్ట్రిక్ బైకులను ఆవిష్కరించింది. కంపెనీ ప్రదర్శించిన ఈ కొత్త ఎలక్ట్రిక్ బైకుల గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

మ్యాటర్ కంపెనీ ఆటో ఎక్స్‌పో 2023 లో ప్రదర్శించిన ఎలక్ట్రిక్ బైకులలో ఒకటి EXE కాగా, మరొకటి UT ఎలక్ట్రిక్ బైక్. ఈ రెండు బైకులు ఒకే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. ఇందులో రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్‌ కలిగి యాంగ్యులర్ స్టైలింగ్‌లో ఉంటాయి. ఈ బైకులు రెండూ కూడా చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే ఇందులో అప్డేటెడ్ ఫీచర్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

ఒకే వేదికపై రెండు ఎలక్ట్రిక్ బైకులు ఆవిష్కరించిన Matter

మ్యాటర్ EXE కాన్సెప్ట్ ఎలక్ట్రిక్ బైక్‌లో క్లిప్ ఆన్ హ్యాండిల్‌బార్, LED హెడ్‌లైట్, టెయిల్ లైట్ మరియు LED టర్న్ ఇండికేటర్‌లతో కూడిన ఫ్లాట్ సీట్ ఉన్నాయి. ఇందులోని సీటు రైడర్ కి మరియు పిలియన్ కి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ స్పోర్టీ డిజైన్ కమ్యూటర్ బైక్. ఈ బైక్‌ యొక్క ముందువైపు టెలిస్కోపిక్ ఫోర్కులు మరియు వెనుకవైపు మోనోషాక్ సస్పెన్షన్ ఉన్నాయి.

మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ముందు మరియు వెనుక వైపు డిస్క్ బ్రేక్‌లు పొందుతుంది. ఈ బైక్ రైడింగ్ చేయడానికి చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ బైక్ ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై నిర్మించబడి ఉంటుంది. అంతే కాకుండా ఈ బైక్ రైడింగ్ చేయడానికి అనుకూలంగా ఉండటానికి మరియు మంచి గ్రిప్ అందించడానికి పిరెల్లి ఏంజెల్ జిటి టైర్లను పొందుతుంది. ఆటో ఎక్స్‌పోలో కనిపించిన ఈ రెండు బైకులలో ఒకటి వైట్ కలర్ మరొకటి నియాన్ కలర్ లో ఉంది.

ఒకే వేదికపై రెండు ఎలక్ట్రిక్ బైకులు ఆవిష్కరించిన Matter

ఇక మ్యాటర్ యొక్క మరో ఎలక్ట్రిక్ బైక్ 'UT కాన్సెప్ట్' విషయానికి వస్తే, ఇది అడ్వెంచర్ బైక్ అని తెలుస్తుంది. ఇందులో డ్యూయల్ పర్పస్ టైర్లు, విశాలంగా మరియు అనుకూలంగా ఉండే సీటు, శాడిల్ స్టేలు, నకిల్ గార్డ్, పెద్ద స్టోరేజ్ బాక్స్ మరియు చిన్న ఫ్రంట్ వైజర్‌ వంటి వాటిని పొందుతుంది. ఇది కూడా ట్రేల్లిస్ ఫ్రేమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ బైక్ చూడటానికి చాలా కొత్తగా అనిపిస్తుంది.

మ్యాటర్ ఎలక్ట్రిక్ బైక్‌లు గేర్ లివర్‌లను కూడా పొందుతాయి. ఇది ఇందులో చెప్పుకోదగ్గ ఫీచర్. నిజానికి భారతీయ మార్కెట్లో ఏ ఎలక్ట్రిక్ మోటార్ సైకిల్ లోనూ గేర్‌బాక్స్ ఆప్సన్ లేదు. బహుశా దేశీయ మార్కెట్లో గేర్‌బాక్స్ తో వచ్చే మొదటి ఎలక్ట్రిక్ బైక్ ఇదే కావచ్చు. కంపెనీ ఈ ఎలక్ట్రిక్ బైకులను అధికారికంగా ఆవిష్కరించింది. అయితే ధరలను ఇంకా వెల్లడించలేదు. ధరలు త్వరలోనే వెల్లడవుతాయి.

కంపెనీ ఈ బైక్‌లో లిక్విడ్ కూల్డ్ మోటార్‌ను కూడా ఉపయోగించింది. కావున ఇది పనితీరు పరంగా సాధారణ మోటార్ కంటే చాలా మెరుగ్గా ఉండబోతోంది. ఈ ఎలక్ట్రిక్ బైకులో ఆధునిక ఫీచర్స్ అందుబాటులో ఉంటాయి. ఇందులో 7 ఇంచెస్ టచ్ స్క్రీన్, 4G కనెక్టివిటీ, బ్లూటూత్ మరియు ఆండ్రాయిడ్ సాఫ్ట్‌వేర్ సపోర్ట్, కాల్, మ్యూజిక్, నావిగేషన్ మరియు వాయిస్ కమాండ్ వంటి ఫీచర్స్ ఉంటాయి.

2023 ఆటో ఎక్స్‌పోలో అద్భుతమైన మరియు అధునాతన మోడల్స్ ఆవిష్కరించడతాయి మరియు విడుదలవుతాయి. ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడే/విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' ఫై క్లిక్ చేయండి. అదే విధంగా కొత్త వాహనాలను గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మా అధికారిక సోషల్ మీడియా పేజీలను అనుసరిస్తూ మీకు కావాల్సిన సమాచారం పొందండి.

Most Read Articles

English summary
Matter exe and ut concept e bikes unveiled auto expo 2023 telugu details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X