దేశీయ మార్కెట్లో 'సూపర్ మీటియోర్ 650' లాంచ్ చేసిన Royal Enfield.. ధర ఎంతో తెలుసా?

బైక్ విభాగంలో అత్యధిక ప్రాచుర్యం పొందిన 'రాయల్ ఎన్‌ఫీల్డ్' ఎట్టకేలకు దేశీయ మార్కెట్లో కొత్త 'సూపర్ మీటియోర్ 650' (Super Meteor 650) విడుదల చేసింది. ఇది మొత్తం మూడు వేరియంట్స్ కలర్ ఆప్సన్స్ అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త 'సూపర్ మీటియోర్ 650' గురించి గురించి మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకుందాం.

దేశీయ మార్కెట్లో కంపెనీ విడుదల చేసిన సూపర్ మీటియోర్ 650 'ఆస్ట్రల్, ఇంటర్‌స్టెల్లార్ మరియు సెలెస్టియల్' అనే మూడు వేరియంట్స్ లో లభిస్తుంది. వీటి ధరలు వరుసగా రూ. 3.49 లక్షలు, రూ. 3.64 లక్షలు మరియు రూ. 3.79 లక్షలు (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్). సూపర్ మీటియోర్ 650 అనేది కంపెనీ యొక్క 650 సిసి ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడిన మూడవ మోడల్ అవుతుంది.

సూపర్ మీటియోర్ 650 లాంచ్ చేసిన Royal Enfield

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 యొక్క ఆస్ట్రల్ 'బ్లాక్, బ్లూ మరియు గ్రీన్' కలర్ ఆప్సన్స్ లో, ఇంటర్‌స్టెల్లార్ గ్రే మరియు గ్రీన్ పెయింట్ ఆప్షన్‌ లో మరియు సెలెస్టియల్ రెడ్ మరియు బ్లూ కలర్స్ లో లభిస్తుంది. కలర్స్ పరంగా వేరువేరుగా ఉన్నప్పటికీ యాంత్రికంగా ఒకే విధంగా లేదా సమానంగా ఉంటాయి. ఈ బైకులు లేటెస్ట్ డిజైన్ మరియు లేటెస్ట్ ఫీచర్స్ పొందుతాయి.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 సెలెస్టియల్‌ వేరియంట్ పెద్ద ఫ్రంట్ విండ్‌స్క్రీన్, టూరింగ్ సీట్ మరియు పిలియన్ బ్యాక్‌రెస్ట్ వంటి వాటిని స్టాండర్డ్ గా పొందుతుంది. ఆస్ట్రల్ మరియు ఇంటర్‌స్టెల్లార్ వేరియంట్‌లు కొన్ని యాక్ససరీస్ పొందుతాయి. అయితే వీటిలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, క్లాసిక్ టియర్‌డ్రాప్ షేప్ ఫ్యూయెల్ ట్యాంక్, స్టెప్డ్ సీట్ మరియు డ్యూయల్ క్రోమ్ ఎగ్జాస్ట్‌లు చూడవచ్చు. ఇవన్నీ కూడా వాహన వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

సూపర్ మీటియోర్ 650 లాంచ్ చేసిన Royal Enfield

ఫీచర్స్ విషయానికి వస్తే, రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 బైక్ ట్రిప్పర్ నావిగేషన్ సిస్టమ్‌ను ట్విన్-పాడ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌లో విలీనం చేసింది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ మరియు USB ఛార్జింగ్ పోర్ట్‌ వంటి వాటిని కూడా పొందుతుంది. కంపెనీ ఈ లేటెస్ట్ 650 సిసి బైక్ కోసం బుకింగ్స్ స్వీకరించడం కూడా ప్రారంభించింది, డెలివరీలు 2023 ఫిబ్రవరి 01 నుంచి ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది.

రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 బైక్ 648 సిసి ట్విన్ సిలిండర్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 47 బిహెచ్‌పి పవర్ మరియు 52.3 ఎన్ఎమ్ టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేయబడి ఉంటుంది. కావున ఇది మంచి పర్ఫామెన్స్ అందిస్తుంది. ఈ బైక్ యొక్క ముందు వైపు అప్సైడ్ డౌన్ ఫోర్క్ మరియు వెనుక వైపు డ్యూయల్ షాక్ అబ్జార్బర్‌ వంటివి ఉంటాయి.

సూపర్ మీటియోర్ 650 లాంచ్ చేసిన Royal Enfield

ఇక బ్రేకింగ్ విషయానికి వస్తే ఈ బైక్ యొక్క ముందు వైపు 320 మిమీ డిస్క్ మరియు వెనుక వైపు 300 మిమీ డిస్క్ బ్రేకులు అందుబాటులో ఉంటాయి. ఇది డ్యూయల్ ఛానల్ ABS తో జతచేయబడి ఉంటాయి. ఈ బైక్ యొక్క సీటు ఎత్తు 650 మిమీ కాగా, కర్బ్ వెయిట్ 241 కేజీల వరకు ఉంటుంది. ఈ బైక్ యొక్క ఫ్యూయెల్ ట్యాంక్ కెపాసిటీ 15.7 లీటర్లు. కావున ఇవన్నీ కూడా బైక్ రైడర్ కి తప్పకుండా మంచి రైడింగ్ అనుభూతిని ఇస్తుంది.

ప్రస్తుతం మార్కెట్లో ఆధునిక బైకులకు డిమాండ్ భారీగా పెరుగున్న తరుణంలో రాయల్ ఎన్‌ఫీల్డ్ ఇప్పుడు సూపర్ మీటియోర్ 650 విడుదల చేసింది. ఈ బైక్ దేశీయ మార్కెట్లో కొంత పోటీని ఎదుర్కోవాల్సి ఉంటుంది. కావున రానున్న రోజుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ సూపర్ మీటియోర్ 650 ఎలాంటి అమ్మకాలు పొందుతుంది అనేది తెలుస్తుంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాలు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' చూస్తూ ఉండండి.

Most Read Articles

English summary
Royal enfield launched super meteor 650 price features and details
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X