2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన కొత్త Tork ఎలక్ట్రిక్ బైకులు, ఇవే

ఇప్పటికే భారతీయ మార్కెట్లో క్రటోస్ మరియు క్రటోస్ ఆర్ బైకులను విడుదల చేసిన టోర్క్ మోటార్స్ 2023 ఆటో ఎక్స్‌పోలో Kratos X ఇ-బైక్‌ ఆవిష్కరించింది. టోర్క్ మోటార్స్ విడుదల్ చేసిన ఈ కొత్త ఎలక్ట్రిక్ బైక్ గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.. రండి.

టోర్క్ మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2023లో కేవలం Kratos X ఎలక్ట్రిక్ బైక్ మాత్రమే కాకుండా అప్డేటెడ్ Kratos R కూడా వెల్లడించింది. ఈ అప్డేటెడ్ Kratos R ఇప్పుడు దాని మునుపటి మోడల్ కంటే మరింత అప్డేటెడ్ డిజైన్ పొందుతుంది. కొత్త టోర్క్ క్రాటోస్ X ఇ-బైక్ మంచి డిజైన్ మరియు ఫీచర్స్ పొందుతుంది. ఇందులో 7 ఇంచెస్ టచ్ కంపర్టబుల్ TFT డాష్ మరియు అల్యూమినియం స్వింగార్మ్ వంటి ఫీచర్స్ పొందుతుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన కొత్త Tork బైకులు

Kratos X అనేది Kratos R కంటే శక్తివంతమైనదని కంపెనీ తెలిపింది, కానీ దాని పర్ఫామెన్స్ మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ ఎలక్ట్రిక్ బైకులో కొత్త ఫ్యూరియస్లీ ఫాస్ట్ మోడ్‌ కూడా ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ బైక్ యొక్క ఉత్పత్తి త్వరలోనే ప్రారంభమయ్యే అవకాశం ఉంది, అదే సమయంలో ఈ బైక్ టెస్ట్ రైడ్ మార్చిలో మరియు డెలివరీలు జూన్ 2023 లో మొదలవుతాయి.

ఇక అప్డేటెడ్ Tork Kratos R ఎలక్ట్రిక్ బైక్ విషయానికి వస్తే, ఇది ఇప్పుడు అప్డేటెడ్ కాస్మొటిక్ డిజైన్ పొందుతుంది. కావున ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఆకర్షణీయంగా ఉంటుంది. అప్డేటెడ్ Kratos R ఇప్పుడు బ్లాక్-అవుట్ బ్యాటరీ ప్యాక్ కలిగి ఉండటమే కాకుండా డార్క్ బ్లూ కలర్ పొందుతుంది. ఇందులో గమనించదగ్గ అతి పెద్ద మార్పు కొత్త LCD డాష్. మొత్తం మీద ఇది మునుపటి కంటే కూడా చాలా ఆధునికంగా కనిపిస్తుంది.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన కొత్త Tork బైకులు

టోర్క్ మోటార్స్ ఆటో ఎక్స్‌పో 2023లో ఎలక్ట్రిక్ బైకులను ఆవిష్కరించడమే కాకుండా, రాబోయే రోజుల్లో తాము ప్రవేశపెట్టనున్న ప్రణాళికలను కూడా వెల్లడించింది. ఇందులో భాగంగానే కంపెనీ కొత్త పోర్టబుల్ ఛార్జర్‌ను విడుదల చేయడంతో పాటు హోమ్ ఛార్జర్ వంటి వాటిని విడుదల చేసే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా బైక్ వినియోగదారులకు చాలా అనుకూలంగా ఉంటాయి.

టోర్క్ మోటార్స్ తన కొత్త ప్లాంట్ 60,000 యూనిట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంటుందని, ఇందులో 2023 మొదటి త్రైమాసికంలో ఉత్పత్తి ప్రారంభించనున్నట్లు తెలిపింది. కంపెనీ గతంలో తాం ఉత్పత్తులను దేశంలోని ఏడు ప్రధాన నగరాల్లో అందుబాటులో తీసుకురానున్న తెలిపింది. అయితే ఆ సంఖ్య ఇప్పుడు 11 కి చేరింది. ప్రస్తుతం కంపెనీ తం ఉత్పత్తులను పూణే, సతారా, హైదరాబాద్ మరియు పాట్నా నగరాల్లో విక్రయిస్తోంది.

2023 ఆటో ఎక్స్‌పోలో అడుగుపెట్టిన కొత్త Tork బైకులు

ఇప్పటికే అందుబాటులో ఉన్న క్రటోస్ మరియు క్రటోస్ ఆర్ బైకుల డెలివరీలు కూడా ప్రారంభమయ్యాయి. క్రటోస్ ఎలక్ట్రిక్ బైక్ 7.5kW, 28Nm మోటార్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది 4 సెకన్లలో 0 నుంచి 40 కిమీ వరకు వేగవంతం అవుతుంది. అయితే ఇందులోని క్రటోస్ ఆర్ 9kW, 38Nm మోటార్‌ని కలిగి ఉంటుంది. ఇది కేవలం 3.5 సెకన్లలో గరిష్టంగా 100kph మరియు 105kph వరకు వేగవంతం అవుతుంది.

ప్రస్తుతం దేశీయ మార్కెట్లో ఆవిష్కరించబడిన Kratos X అనేది Kratos R బైకుల ధరలు కూడా కంపెనీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. అంతే కాకుండా ఇందులోని బ్యాటరీ ప్యాక్ మరియు రేంజ్ వంటి వివరాలు కూడా అందుబాటులో లేదు. ఇవన్నీ కూడా కంపెనీ త్వరలనే వెల్లడించే అవకాశం ఉంటుంది. 2023 ఆటో ఎక్స్‌పోలో ఆవిష్కరించబడే/విడుదలయ్యే వాహనాలను గురించి అప్డేటెడ్ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి 'తెలుగు డ్రైవ్‌స్పార్క్ ఛానల్' ఫై క్లిక్ చేయండి.

Most Read Articles

English summary
Tork motors showcased kratos x electric bike in auto expo 2023 details
Story first published: Wednesday, January 11, 2023, 18:38 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X