సూపర్‌బైక్ అవతారంలో బజాజ్ పల్సర్ 220 బైక్!

By Ravi

ఈ ఫొటోల్లో కనిపిస్తున్న బైక్‌ను చూసి ఇదేదో సూపర్‌‌బైక్ అని అనుకుంటున్నారా..? అయితే మీరు బ్రేకుపై కాలేసినట్లే. ఎందుకంటే, ఇది మన మేడ్ ఇన్ ఇండియా బజాజ్ పల్సర్ బైక్ కాబట్టి. అవును ఈ ఫొటోలో మీరు చూస్తున్నది మోడిఫైడ్ బజాజ్ పల్సర్ 220.

బైక్‌లను తమకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేయించుకోవటం కొందరికి మహా ఇష్టం. అలా పుట్టుకొచ్చిందే ఈ సూపర్‌బైక్ స్టయిల్ పల్సర్. ఇండోనేషియాలోని జకార్తాకు సమీపంలో ఉన్న టాంగెరాంగ్‌కు చెందిన బన్జార్ విజయాకు సంబంధించిన బైక్ ఇది.

వివిధ బైక్‌లు సంబంధించిన విడిభాగాలను సేకరించి బన్జార్ ఈ బైక్‌ను మోడిఫై చేశాడు. ఆ వివరాలంటే ఈ కథనంలో తెలుసుకుందా రండి..!

సూపర్‌బైక్ అవతారంలో బజాజ్ పల్సర్ 220

ఈ కస్టమైజ్డ్ బజాజ్ పల్సర్ 200 బైక్‌లోని ఫ్యూయెల్ ట్యాంక్, ఫెయిరింగ్ మరియు రియర్ టెయిల్ మోడళ్లను కస్టమ్ సుజుకి జిఎస్ఎఖ్స్ మోడల్ నుంచి గ్రహించారు. డెల్టా బాక్స్ ఫ్రేమ్‌ను ఆప్రిలియా నుంచి గ్రహించారు.

సూపర్‌బైక్ అవతారంలో బజాజ్ పల్సర్ 220

ఇందులోని ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌లో కవర్ కస్టమ్ స్పీడోమీటర్ (కార్బోనైజ్డ్ అసెంట్‌తో) కనిపిస్తుంది.

సూపర్‌బైక్ అవతారంలో బజాజ్ పల్సర్ 220

ఫ్రంట్ హెడ్‌ల్యాంప్స్ మరియు రియర్ టెయిల్ ల్యాంప్‌లలో ఎలాంటి మార్పులు చేయకుండా, ఒరిజినల్ పల్సర్ లైట్లనే ఇందులో ఉపయోగించారు.

సూపర్‌బైక్ అవతారంలో బజాజ్ పల్సర్ 220

సస్పెన్షన్ విషయానికి వస్తే, ముందువైపు అమర్చిన అప్‌సైడ్ డౌన్ ఫోర్క్‌ను యమహా ఆ6 నుంచి గ్రహించగా వెనుక స్వింగ్ ఆర్మ్‌ను హోండా ఆర్‌విఎఫ్ 400 ప్రొఆర్మ్ నుంచి మోనోషాక్‌ను యునిట్రాక్స్ నిన్జా 250 నుంచి గ్రహించారు.

సూపర్‌బైక్ అవతారంలో బజాజ్ పల్సర్ 220

రిమ్ములను హోండా ఆర్‌విఎఫ్ 400 నుంచి గ్రహించారు. ఇవి ముందు వైపు 3.5 ఇంచ్, వెనుక వైపు 4.5 ఇంచ్ సైజును కలిగి ఉంటాయి. వీటిని ముందు వైపు 120-70-17 సైజు మిచెలీన్ టైరుతో, వెనుక వైపు 180-55-17 మిచెలీన్ టైరుతో అమర్చారు.

సూపర్‌బైక్ అవతారంలో బజాజ్ పల్సర్ 220

ఇందులోని సైలెన్సర్‌ను బిఎమ్ కస్టమ్ సిబి 1000 ఫుల్ సిస్టమ్ మోడళ్ల నుంచి గ్రహించారు.

సూపర్‌బైక్ అవతారంలో బజాజ్ పల్సర్ 220

ఫుట్‌స్టెప్‌లను నిన్జా 250 మరియు జూపిటర్-జెడ్ మోడళ్ల నుంచి గ్రహించారు.

సూపర్‌బైక్ అవతారంలో బజాజ్ పల్సర్ 220

ముందు వైపు ఉపయోగించిన మాస్టర్ బ్రేక్‌లను కవాసకి ఈఆర్6ఎన్ బైక్ నుంచి గ్రహించారు.

సూపర్‌బైక్ అవతారంలో బజాజ్ పల్సర్ 220

ముందు వైపు ఫెండర్‌ను యమహా ఆర్6 బైక్ నుంచి వెనుక వైపు ఫెండర్‌ను నిన్జా 250 బైక్ నుంచి గ్రహించారు.

సూపర్‌బైక్ అవతారంలో బజాజ్ పల్సర్ 220

ఈ బైక్ కస్టమైజేషన్ కోసం ఎంత మేర ఖర్చు చేసిన విషయాన్ని మాత్రం సదరు బైక్ యజమాని వెల్లడించలేదు.

Image Source: Stephenlangitan

Via: Rushlane

Most Read Articles

English summary
Banjar Wijaya of Tangerang near Jakarta, Indonesia has modified his Pulsar 220, which is impressive enough for the title of best modified Pulsar 220. Below is the image gallery of Banjar’s Pulsar modified with the help from Rudy of Blessing Motor.
Story first published: Friday, March 28, 2014, 13:44 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X