బజాజ్ పల్సర్ ఆర్ఎస్200: ఈ బైక్‌లోని 10 ప్రత్యేకతలు

By Ravi

బజాజ్ ఆటో నేడు (మార్చ్ 26, 2015) తమ సరికొత్త 'పల్సర్ ఆర్ఎస్200' (Pulsar RS200) అనే ఫుల్లీ ఫెయిర్డ్ స్పోర్ట్స్ బైక్‌ను భారత విపణిలో విడుదల చేసిన సంగతి తెలిసినదే. ఈ బైక్ నాన్ ఏబిఎస్, ఏబిఎస్ వెర్షన్లలో లభ్యం కానుంది. బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 పేరులో ఆర్ఎస్ అంటే రేసింగ్ స్పోర్ట్ అని అర్థం.

బజాజ్ ఆటో నుంచి తొలిసారిగా ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్) సేఫ్టీ ఫీచర్‌తో వస్తున్న మొట్టమొదటి మోటార్‌సైకిల్ పల్సర్ ఆర్ఎస్200 కావటం విశేషం. వాస్తవానికి కంపెనీ 2012లో విడుదల చేసిన పల్సర్ 200ఎన్ఎస్ నేక్డ్ బైక్‌కి ఫెయిర్డ్ వెర్షనే ఈ కొత్త 2015 పల్సర్ ఆర్ఎస్200.

మరి ఈ సరికొత్త బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 బైక్‌లోని టాప్ 10 ఫీచర్లేంటో ఈ కథనంలో తెలుసుకుందాం రండి..!

1. ట్విన్ ప్రొజెక్టర్ ల్యాంప్స్

1. ట్విన్ ప్రొజెక్టర్ ల్యాంప్స్

కొత్త పల్సర్ ఆర్ఎస్200 బైక్‌లో పక్కపక్కనే అమర్చిన రెండు ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్ తొలిచూపులోనే స్పోర్ట్స్ బైక్ ప్రియులను ఆకట్టుకుంటాయి. ఇంత వరకూ బజాజ్ నుంచి ఈ తరహా స్టయిలింగ్‌తో కూడిన బైక్ రాలేదు. ఇందులో డేటైమ్ రన్నింగ్ లైట్స్ మరో అదనపు ఆకర్షణగా నిలుస్తాయి.

2. క్లిస్టల్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్

2. క్లిస్టల్ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్

కొత్త పల్సర్ ఆర్ఎస్200 బైక్‌లో టెయిల్ ల్యాంప్ డిజైన్ కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ బైక్ వెనుక టెయిల్ ల్యాంప్‌ను బట్టే ఇది పల్సర్ ఆర్ఎస్200 అని సులువుగా గుర్తించేంత విశిష్టంగా ఉంటుంది.

3. మంచి స్టయిలింగ్

3. మంచి స్టయిలింగ్

పల్సర్ ఆర్ఎస్200 స్టయిలింగ్ విషయంలో బజాజ్ డిజైన్ డిపార్ట్‌మెంట్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంది. ఇప్పటి వరకూ మార్కెట్లో పల్సర్ బైక్‌ల డిజైన్‌ను మరపించేలా సరికొత్త స్టయిలింగ్‌తో, బెటర్ ఏరోడైనమిక్స్‌తో ఈ కొత్త బైక్‌ను డిజైన్ చేశారు. హైస్పీడ్స్ వద్ద సైతం బెటర్ కంట్రోల్ ఉండేలా దీని ఫెయిరింగ్‌ను డిజైన్ చేశారు.

4. బట్టర్‌ఫ్లై డిస్క్ బ్రేక్స్

4. బట్టర్‌ఫ్లై డిస్క్ బ్రేక్స్

కొత్త పల్సర్ ఆర్ఎస్200 బైక్‌లో బట్టర్‌ఫ్లై ఫ్రంట్ అండ్ రియర్ డిస్క్ బ్రేక్స్‌ను ఆఫర్ చేస్తున్నారు. ఈ డిస్క్ బ్రేక్స్ త్వరగా చల్లబడుతాయి.

5. ఏబిఎస్

5. ఏబిఎస్

ఇదివరకు చెప్పుకున్నట్లు బజాజ్ బైక్‌లలో ఏబిఎస్ (యాంటీ-లాక్ బ్రేకింగ్)ను ఆఫర్ చేయటం ఇదే మొదటి సారి. కొత్త పల్సర్ ఆర్ఎస్200 టాప్ వేరియంట్లో ఈ ఫీచర్ లభిస్తుంది. ఏబిఎస్ వలన బ్రేకింగ్ కాన్ఫిడెన్స్ మరింత పెరుగుతుంది. ఎలాంటి రోడ్లపైనైనా సమర్థవంతమైన బ్రేకింగ్ సాధ్యమవుతుంది.

6. మీటర్ కన్సోల్

6. మీటర్ కన్సోల్

పల్సర్ ఆర్ఎస్200 బైక్‌లో అనలాగ్ అండ్ డిజిటల్ మీటర్ కన్సోల్ ఉంటుంది. ఇందులో ఓ పెద్ద ఆర్‌పిఎమ్ మీటర్ (అనలాగ్) మరియు డిజిటల్ ఫ్యూయెల్ గేజ్, స్పీడోమీటర్ ఉంటాయి. ఎడమచేతి వైపు వార్నింగ్ లైట్స్, ఇండికేటర్స్ ఉంటాయి.

7. అల్లాయ్ వీల్స్

7. అల్లాయ్ వీల్స్

కొత్త పల్సర్ ఆర్ఎస్200 బైక్‌లో మరో విశిష్టత దీని 10-స్పోక్ డిజైన్ అల్లాయ్ వీల్స్. మ్యాట్ బ్లాక్ ఫినిష్‌లో ఉండే స్టయిలిష్ అల్లాయ్ వీల్స్ బైక్ ఓవరాల్ లుక్ అండ్ ఫీల్‌ని పెంచడంలో తోడ్పడుతాయి.

8. ఇంజన్ డిటేల్స్

8. ఇంజన్ డిటేల్స్

బజాజ్ పల్సర్ ఆర్ఎస్200 లోని 199.5సీసీ, సింగిల్ సిలిండర్, లిక్విడ్ కూల్డ్ ఇంజన్ గరిష్టంగా 23.2 బిహెచ్‌పిల శక్తిని, 1.9 కెజిఎమ్‌ల టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. ఈ ఇంజన్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో కనెక్ట్ చేయబడి ఉంటుంది.

9. సస్పెన్షన్

9. సస్పెన్షన్

పల్సర్ ఆర్ఎస్ 200 బైక్‌లో ముందు వైపు టెలిస్కోపిక్ సస్పెన్షన్‌ను, వెనుక వైపు మోనోషాక్ (బాక్స్ సెక్షన్ స్వింగ్ఆర్మ్) సస్పెన్షన్‌ను ఆఫర్ చేస్తున్నారు.

10. ధరలు

10. ధరలు

దేశీయ విపణిలో ఈ సరికొత్త పల్సర్ బైక్ ధరలు ఇలా ఉన్నాయి:

  • పల్సర్ ఆర్ఎస్200 (స్టాండర్డ్): రూ.1.18 లక్షలు
  • పల్సర్ ఆర్ఎస్200 (ఏబిఎస్): రూ.1.30 లక్షలు
  • (అన్ని ధరలు ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

Most Read Articles

English summary
Bajaj Pulsar RS 200 launched in India. Let’s take a look at 10 stand out features, along with its engine specification and pricing.
Story first published: Thursday, March 26, 2015, 15:35 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X