'వెస్పా 946' స్కూటర్‌ను విడుదల చేయనున్న పియాజ్జియో

By Ravi

ఇటలీకి చెందిన ప్రముఖ ఆటో దిగ్గజం పియాజ్జియోకు పూర్తి భారతీయ అనుబంధ సంస్థ అయిన పియాజ్జియో వెహికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇప్పుడు మరొక ఖరీదైన, అత్యంత విలాసవంతమైన స్కూటర్‌ను భారత మార్కెట్‌కు తీసుకుంది. ప్రస్తుతం పియాజ్జియో దేశీయ విపణిలో వెస్పా ఎల్ఎక్స్ 125, వెస్పా విఎక్స్ 125 మోడళ్లను మాత్రమే అందిస్తోంది. కాగా.. మరికొద్ది రోజుల్లోనే వెస్పా బ్రాండ్‌లో ఓ సరికొత్త ప్రీమియం స్కూటర్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది.

పియాజ్జియో ఇటీవలే ప్రపంచ మార్కెట్లలో ఆవిష్కరించిన వెస్పా 946 (Vespa 96) మోడల్‌ను ఈ ఏడాది అక్టోబరు-డిసెంబరు మధ్య భారత్‌లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. గడచిన నెలలోనే ఇది యూరప్‌ మార్కెట్లో విడుదలైంది. విశిష్టమైన డిజైన్‌తో ఇది కొద్దిరోజుల్లోనే మంచి పాపులారిటీని దక్కించుకుంది. వెస్పా 946పై అనేక మంది భారతీయులు ఆసక్తి చూపుతున్నారని, మరో రెండు మూడు నెలల్లో ఈ స్కూటర్‌ను భారత్‌లో విడుదల చేస్తామని కంపెనీ చైర్మన్, ఎమ్‌డి రవి చోప్రా తెలిపారు.

వెస్పా 946 ఆషామాషీ స్కూటర్ కాదు. ఇది ఈ సెగ్మెంట్లో కెల్లా విశిష్టమైన డిజైన్, ఫీచర్లను కలిగి ఉండనుంది. ఈ లగ్జరీ స్కూటర్‌ను 2011లో జరిగిన మిలాన్ మోటార్ షోలో తొలిసారిగా ఆవిష్కరించారు. పైకి తేలినట్టుండే విశాలమైన సీట్ (సింగిల్ సీట్ మాత్రమే), విభిన్నమైన హ్యాండిల్‌బార్, డిజిటల్ డిస్‌ప్లే, ఇటాలియన్ స్టయిల్‌ను ప్రతిభింభింపజేసే బాడీ డిజైన్ ఇంకా మరెన్నో ప్రత్యేకతలు ఈ వెస్పా 946 స్కూటర్ సొంతం. ఈ స్కూటర్ పూర్తిగా చేతుల్తో తయారు చేయబడినది (హ్యాండ్ మేడ్).

మరిన్ని వివరాలను క్రింది స్లైడ్‌లలో పరిశీలించండి..!

వెస్పా 946 విడుదల

వెస్పా 946 విడుదల

పియాజ్జియో ఇటీవలే ప్రపంచ మార్కెట్లలో ఆవిష్కరించిన వెస్పా 946 (Vespa 96) మోడల్‌ను ఈ ఏడాది అక్టోబరు-డిసెంబరు మధ్య భారత్‌లో విడుదల చేసేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తుంది. గడచిన నెలలోనే ఇది యూరప్‌ మార్కెట్లో విడుదలైంది.

డిజైన్

డిజైన్

ఈ స్కూటర్ బాడీ, హ్యాండిల్ బార్, శాడల్ సపోర్ట్, సైడ్ ప్యానెల్స్, ఫ్రంట్ మడ్‌గార్డ్‌లను అల్యూమినియం మూలకాలతో కూడిన ధృడమైన షీట్ స్టీల్‌తో తయారు చేశారు.

ఇంజన్

ఇంజన్

వెస్పా 946 లగ్జరీ స్కూటర్‌లో 4 స్ట్రోక్, 125 సీసీ, మోనో సిలిండర్ ఇంజన్‌ను ఉపయోగించారు. ఎలక్ట్రానిక్ ఫ్యూయెల్ ఇంజెక్షన్, 3 వాల్వ్ డిస్ట్రిబ్యూషన్ ఈ ఇంజన్ సొంతం. ప్రస్తుతం భారత్‌లో లభిస్తున్న వెస్పా స్కూటర్లలో ఉపయోగించిన ఇంజన్ కన్నా ఇది భిన్నమైనది.

సేఫ్టీ ఫీచర్స్

సేఫ్టీ ఫీచర్స్

ఏబిఎస్ బ్రేకింగ్ సిస్టమ్, ఏఎస్ఆర్ ఎలక్ట్రానిక్ ట్రాక్షన్ కంట్రోల్, పెద్ద 12 ఇంచ్ వీల్స్, డ్యూయెల్ డిస్క్ బ్రేక్స్‌తో వెస్పా 946 ఈ సెగ్మెంట్లో కెల్లా సురక్షితమైన స్కూటర్‌గా నిలువనుంది.

టెక్నాలజీ

టెక్నాలజీ

ఎల్ఈడి హెడ్‌లైట్, ఎల్ఈడి ఇండికేటర్స్ మరియు ఎల్‌సిడి డ్యాష్‌బోర్డ్ వంటి అధునాతన టెక్నాలజీ ఫీచర్లు ఈ స్కూటర్ సొంతం.

ధరలు

ధరలు

గ్లోబల్ మార్కెట్లో వెస్పా 946 స్కూటర్ ధరలు ఆయా దేశాలను బట్టి రూ.6 లక్షల నుంచి రూ.7 లక్షల రేంజ్‌లో ఉన్నాయి.

సిబియూ రూట్లో దిగుమతి

సిబియూ రూట్లో దిగుమతి

పూర్తిగా విదేశాల్లో తయారైన వెస్పా 946 స్కూటర్‌ను భారత్‌కు దిగుమతి చేసుకొని ఇక్కడి మార్కెట్లో విక్రయించనున్నారు.

ఆ పేరు ఎందుకు పెట్టారు

ఆ పేరు ఎందుకు పెట్టారు

పియాజ్జియో వెస్పా స్కూటర్‌ను తొలిసారిగా 1946లో తయారు చేసింది. అందుకే ఈ స్కూటర్‌కు 'వెస్పా 946' (ఆ సంవత్సరంలోని చివరి 3 అంకెలు) అనే పేరును పెట్టారు.

2014లో లిమిటెడ్ ఎడిషన్

2014లో లిమిటెడ్ ఎడిషన్

2014 సంవత్సరంలో వెస్పా 946 స్కూటర్‌లో లిమిటెడ్ ఎడిషన్లను కూడా కంపెనీ ప్రవేశపెట్టనుంది.

సిటీ, లాంగ్ డ్రైవ్

సిటీ, లాంగ్ డ్రైవ్

ఈ స్కూటర్‌పై సుదూర ప్రయాణానికే కాకుండా సిటీ డ్రైవింగ్‌కి కూడా అనుకూలంగానే ఉంటుంది.

వెస్పా 946 స్కూటర్

వెస్పా 946 స్కూటర్

తర్వాతి స్లైడ్‌లలో వెస్పా హ్యాండ్ మేడ్ ఫొటోలను చూడండి.

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 హ్యాండ్‌మేడ్

వెస్పా 946 స్కెచ్

వెస్పా 946 స్కెచ్

వెస్పా 946 స్కూటర్

వెస్పా 946 స్కూటర్

వెస్పా 946 స్కూటర్

వెస్పా 946 స్కూటర్

వెస్పా 946 స్కూటర్

వెస్పా 946 స్కూటర్

వెస్పా 946 స్కూటర్

వెస్పా 946 స్కూటర్

Most Read Articles

English summary
Italian auto major Piaggio said it will launch the latest Vespa 946 scooter in India by the end of this year. Vespa 946 was rolled out in Europe in June 2013. The model will be brought into the country in a CBU (completely built unit) route.
Story first published: Friday, July 12, 2013, 16:05 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X