కాలేజ్ స్టూడెంట్స్ కోసం బెస్ట్ కార్లు

ధర, మైలేజ్, స్పెసిఫికేషన్లు మరియు పనితీరుతో పాటు డిజైన్ వంటి అంశాల పరంగా ఇండియన్ కాలేజ్ స్టూడెంట్స్ కోసం అందుబాటులో ఉండే అత్యుత్తమ కార్ల గురించి గురించి ఇవాళ్టి స్టోరీలో మీ కోసం....

By Anil

ఒకప్పుడు కాలేజ్ కు సైకిల్ పై వెళ్లేవాళ్లు. ఆ మోజు కాస్త రై రై మంటూ.. రకరకాల ఫీట్స్ చేస్తూ ఎంజాయ్ చేయడానికి బైకులపై మళ్లింది. కాలంతో పాటు వాహనాల ఎంపికా మారింది. తరం మారిందని తెలుపుతూ.. బైకులను నెట్టేస్తూ.. కార్లు ఆ స్థానాన్ని ఎంచుకున్నాయి. ఇప్పుడు కాలేజీ యువత అంతా.. కార్ల జపం చేస్తోంది.

కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

నలుగురు లేదా ఐదు మంది ప్రయాణించే సౌలభ్యం ఉంటూ, లాంగ్ అండ్ షార్ట్ డ్రైవ్‌ల కోసం ఎంతగానో ఉపయోగపడే కార్ల మీద యువత దృష్టిసారిస్తోంది. మరీ ముఖ్యంగా ధర, మైలేజ్, డిజైన్, పనితీరు, స్పెసిఫికేషన్స్ మరియు ఫీచర్లు వంటి అనేక అంశాలకు అనుగుణంగా కార్లను ఎంచుకోవడంలో కాలేజ్ స్టూడెంట్స్ తర్జనభర్జనలు పడుతుంటారు. వీటన్నింటిని కలిగి ఉంటూ స్టూడెంట్స్ కోసమే మార్కెట్లోకి వచ్చాయనిపించే కార్ల గురించి ఇవాళ్టి స్టోరీలో తెలుకుందాం రండి.

రెనో క్విడ్

రెనో క్విడ్

ప్రస్తుతం దేశీయ మార్కెట్లోని ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లలో హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్న వాటిలో రెనో క్విడ్ మొదటి స్థానంలో ఉంది. యువతకు మరియు కాస్త వయసు మళ్లిన వారిని కూడా ఇది ఎంతగానో ఆకట్టుకుంటోంది. స్ట్రక్చర్ పరంగా ఎస్‌యువి తరహాలో ఎక్ట్సీరియర్ రూపం (బాహ్య డిజైన్) మొత్తం ఎస్‌యువి శైలిలో ఉండటం వలన భారీ అమ్మకాలను సాధిస్తోంది. విడుదలైన అనతి కాలంలోనే లక్ష అమ్మకాల మైలురాయిని చేదించింది ఈ క్విడ్.

కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

దీనికి పోటీగా ఉన్న ఉత్పత్తులకు ముప్పుతిప్పలు పెట్టడానికి గల కారణాల్లో ఇంటీరియర్‌లోని టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు న్యావిగేషన్ ప్రధానం. ఈ సెగ్మెంట్లో మరే ఇతర ఉత్పత్తులకు సాద్యం కాని విధంగా లీటర్‌కు 25.17 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు. అస్తవ్యస్తంగా ఉండే కొన్ని ఇండియన్ రోడ్ల కోసం అన్నట్లుగా 180ఎమ్ఎమ్ గరిష్ట గ్రౌండ్ క్లియరెన్స్ కలదు.

కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

ప్రస్తుతం రెనో క్విడ్ రెండు ఇంజన్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. అవి, 799సీసీ మరియు 1.0-లీటర్ సామర్థ్యంతో ఉన్నాయి. 799సీసీ ఇంజన్‌కు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ మరియు 1.0-లీటర్ ఇంజన్‌కు ఆప్షనల్‌గా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం కలదు.

  • ధర: రూ. 2.65 లక్షల నుండి రూ. 3.96 లక్షల వరకు ఎక్స్‌షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.
  • మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్

    మారుతి సుజుకి స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్

    ఇప్పటికీ ఇండియన్ హ్యాచ్‌బ్యాక్ సెల్లింగ్ జాబితాలో మొదటి స్థానంలో ఉంది. డిజైన్ మరియు ఇంటీరియర్ స్పేస్ పరంగా నూటికి నూరు మార్కులు తెచ్చుకుంది. అయితే ఇంజన్ పనితీరు పరంగా పెద్దగా నిరూపించుకోలేకపోయింది. స్టైల్ మరియు మైలేజ్ పరంగా స్టూడెంట్స్ దీనిపై ఎక్కువ మొగ్గుచూపుతున్నారు.

    కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

    ఫీచర్ల పరంగా ఇండియన్స్‌ను బాగానే ఆకట్టుకుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. ఆడియో సిస్టమ్, బ్లూటూత్, ఆటోమేటిక్ ఎయిర్ కండీషనింగ్, మరియు భద్రత పరంగా డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి ఫీచర్లున్నాయి. స్విప్ట్ పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 20.4 కిలోమీటర్లు మరియు స్విఫ్ట్ డీజల్ వేరియంట్ లీటర్‌కు 25.2 కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు.

    కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

    సాంకేతికంగా స్విఫ్ట్ హ్యాచ్‌బ్యాక్ లో 83బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ అదే విధంగా 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.3-లీటర్ సామర్థ్యం ఉన్న డిడిఐఎస్ డీజల్ ఇంజన్ కలదు.రెండు వేరియంట్లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

    • ధర: రూ. 4.76 లక్షల నుండి 7.44 లక్షల వరకు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.
    • షెవర్లే బీట్

      షెవర్లే బీట్

      ట్రాన్స్‌ఫార్మర్ మూవీ థీమ్‌ను గుర్తుకు తెచ్చే షెవర్లే బీట్ అందరినీ ఆకట్టుకునే డిజైన్‌లో శక్తివంతమైన ఇంజన్ ఆప్షన్‌లతో అందుబాటులో ఉంది. నూతన ఫీచర్లతో మోడ్రన్ డిజైన్ శైలిలో యువతను మరీ ఎక్కువగా యంగ్ కస్టమర్లను మిన్నంగా ఆకట్టుకుంటోంది.

      కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

      ఈ స్మాల్ హ్యాచ్‍‌‌బ్యాక్‌లో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, కీ లెస్ ఎంట్రీ వంటి భద్రత ఫీచర్లున్నాయి. పెట్రోల్ వేరియంట్ బీట్ లీటర్‌కు 17.8కిలోమీటర్లు మరియు డీజల్ వేరియంట్ బీట్ లీటర్‌కు 25.44కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలదు.

      కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

      సాంకేతికంగా 77బిహెచ్‌పి పవర్ మరియు 106.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ మరియు 56బిహెచ్‌పి పవర్ మరియు 142.5ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.0-లీటర్ సామర్థ్యం గల డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో షెవర్లే బీట్‌ అందుబాటులో ఉంది. ఈ రెండు ఇంజన్‌లను కూడా షెవర్లే జనరల్ మోటార్స్ నుండి గ్రహించింది.

      • ధర: రూ. 3.95 లక్షల నుండి 6.35 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్(ఢిల్లీ)గా ఉంది.
      • మారుతి సుజుకి సెలెరియో

        మారుతి సుజుకి సెలెరియో

        మారుతి సుజుకి మొట్టమొదటి సారిగా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన అత్యంత సరసమైన ఆటోమేటిక్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల మోడల్ ఈ సెలెరియో. సిటీ రైడింగ్ కోసం సెలెరియో ఆటోమేటిక్ ను విరివిగా ఎంచుకుంటున్నారు.

        కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

        మారుతి సుజుకి సెలెరియోలో ప్రప్రథమంగా నచ్చే అంశాలు విశాలమైన క్యాబిన్ స్పేస్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్. చార్జింగ్ పోర్ట్, బ్లూటూత్ అనుసంధానం గల ఇంటిగ్రేటెడ్ ఆడియో సిస్టమ్ కలదు. సెలెరియో పెట్రోల్ మరియు డీజల్ రెండు వేరియంట్లు కూడా లీటర్‌కు 23.1కిలోమీటర్ల మైలేజ్ ఇవ్వగలవు.

        కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

        సాంకేతికంగా సెలెరియో రెండు ఇంజన్ వేరియంట్లలో లభిస్తోంది. అందులో 67బిహెచ్‌పి పవర్ మరియు 90ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.0-లీటర్ సామర్థ్యం గల కె10 పెట్రోల్ ఇంజన్ అదే విధంగా 47బిహెచ్‌పి పవర్ మరియు 125ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 793సీసీ సామర్థ్యం ఉన్న డిడిఐఎస్ ఇంజన్ కలదు.

        • ధర: రూ. 4.03 లక్షల నుండి 5.90 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.
        • డాట్సన్ రెడి గో

          డాట్సన్ రెడి గో

          స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు అనే ఈ జాబితాలో అత్యంత చౌక కారు ఈ డాట్సన్ రెడి గో. అత్యుత్తమ మైలేజ్ మరియు గ్రౌండ్ క్లియరెన్స్ కలిగిన ఇది వైబ్రెంట్ మరియు కూల్ కలర్స్ లో అందుబాటులో ఉంది. ఇందులో సౌలభ్యమైన చార్జింగ్ పోర్ట్స్, షిఫ్ట్ అప్ ఇండికేటర్ కలవు. అన్నింటికన్నా సిటి రైడింగ్‌లో దీని అత్యంత సులభంగా డ్రైవ్ చేయవచ్చు.

          కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

          సాంకేతికంగా ఇందులో రెనో క్విడ్ లో ఉపయోగించినటువంటి అదే 800సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. దీనికి 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది.

          కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

          ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 53బిహెచ్‌పి పవర్ మరియు 72ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును. డాట్సన్ రెడి గో లో ఉన్న ఏకైక పెట్రోల్ వేరియంట్ లీటర్‌కు 25.17కిమీల మైలేజ్ ఇవ్వగలదు.

          • ధర: రూ. 2.39 లక్షల నుండి 3.55 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.
          • వోక్స్‌వ్యాగన్ పోలో

            వోక్స్‌వ్యాగన్ పోలో

            గరిష్ట ధరతో అందుబాటులో ఉన్న పోలో తమ హ్యాచ్‌బ్యాక్ లైనప్‌లో అత్యంత శక్తివంతమైనది. ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ ధృడమైన డిజైన్ మరియు శక్తివంతమైన ఇంజన్‌ను కలిగి ఉంది.

            కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

            పోలో ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్‌లో డ్యూయల్-బీమ్ హెడ్ ల్యాంప్స్, ఎలక్ట్రిక్ ద్వారా అడ్జెస్ట్ చేసుకునే వీలున్న సైడ్ మిర్రర్లు, ప్రక్కన మరియు వెనుక వైపున విండో మీదున్న అద్దాలను వేడి చేసి మంచును కరిగించే ఫీచర్, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిర్ రెయిన్ సెన్సింగ్ వైపర్లు, డ్యూయల్ ఎయిర్ బ్యాగులు ఫీచర్లతో పాటు యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్‌ను ఆప్షనల్‌గా కలవు.

            కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

            సాంకేతికంగా శక్తివంతమైన పోలో హ్యాచ్‌బ్యాక్‌లో 74బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ సామర్థ్యం గల ఎమ్‌పిఐ పెట్రోల్ ఇంజన్ అదే విధంగా 86బిహెచ్‌పి పవర్ మరియు 110ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.5-లీటర్ సామర్థ్యం గల టిడిఐ డీజల్ ఇంజన్‌లు కలవు. రెండు వేరియంట్లకు 5-స్పీడ్ మ్యాన్యువల్ ట్రాన్స్‌మిషన్ అనుసంధానం కలదు.

            • ధర: రూ. 5.46 లక్షల నుండి 8.79 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.
            • మారుతి సుజుకి బాలెనొ

              మారుతి సుజుకి బాలెనొ

              ధర ఎక్కువైనా ఫర్వాలేదు ఫీచర్లు మరియు అత్యుత్తమ పనితీరు గల కారును ఎంచుకోవాలనుకునే వారికి బాలెనొ ప్రీమియమ్ హ్యాచ్‌బ్యాక్ అత్యుత్తమ ఎంపిక అని చెప్పవచ్చు. చూడటానికి పదునైన డిజైన్‌లో లేకపోయనా కాస్త గుండ్రటి ఆకారంలో అత్యాధునిక ప్రమాణాలు గల ఫీచర్లకు మరియు దీని ధరలకు చాలా మంది ఆసక్తికనబరుస్తున్నారు.

              కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

              మారుతి ఇందులో డ్యూయల్ ఎయిర్ బ్యాగులు, యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్ వంటి భద్రత ఫీచర్లతో పాటు న్యావిగేషన్ గల తాకే తెర ఇన్పోటైన్‌మెంట్ సిస్టమ్‌ను అందించింది.

              కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

              సాంకేతికంగా బాలెనొలో 83బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న విటివిటి పెట్రోల్ ఇంజన్ అదే విధంగా 74బిహెచ్‌పి పవర్ మరియు 190ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయగల 1.3-లీటర్ సామర్థ్యం గల డిడిఐఎస్ డీజల్ ఇంజన్ కలదు. ఇందులో డీజల్ వేరియంట్‌ను 5-స్పీడ్ మ్యాన్యువల్ అదే విధంగా పెట్రోల్ వేరియంట్ బాలెనొను 5-స్పీడ్ మ్యాన్యువల్ లేదా సివిటి గేర్‌బాక్స్‌తో ఎంచుకోవచ్చు.

              • ధర: రూ. 5.25 లక్షల నుండి 8.36 లక్షల మధ్య ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ఉంది.
              • ఫోర్డ్ ఎకోస్పోర్ట్

                ఫోర్డ్ ఎకోస్పోర్ట్

                ఫోర్డ్ ఇండియన్ మార్కెట్లోకి మొట్టమొదటి సబ్ నాలుగు మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యువిని పరిచయం చేసింది. దీని నిర్వహణ మరియు డ్రైవింగ్ సెడాన్‌తో పోలి ఉంటుంది. గరిష్ట గ్రౌండ్ క్లియరెన్స్‌ మరియు కొలతల పరంగా ఇది ఎస్‌యువి లక్షణాల కలిగి ఉంది. ఇందులో హిల్ లాంచ్ అసిస్ట్, ఎమర్జెన్సీ బ్రేక్ అసిస్ట్, ఎక్ట్రానిక్ స్టెబిలిటి కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ వంటి ఫీచర్లున్నాయి.

                కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

                ఫోర్డ్ ఎకో స్పోర్ట్ లో ఆటోమేటిక్ హెడ్ ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్, స్మార్ట్ ఫోన్ ద్వారా వాయిస్ యాక్టివేటెడ్ సిస్టమ్‌ను అనుసంధానం చేసే పోర్డ్ సింక్ ఫీచర్ కలదు. ఫోర్డ్ ఎకో స్పోర్ట్ లైనప్‌లోని 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న ఎకో బూస్ట్ ఇంజన్ వేరియంట్ అత్యుత్తమ పనితీరు మరియు మైలేజ్‌కి గాను అవార్డ్‌ దక్కింది.

                కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

                సాంకేతికంగా ఫోర్ట్ ఎకో స్పోర్ట్ సబ్-నాలుగు మీటర్ల కాంపాక్ట్ ఎస్‌యువి 1.0-లీటర్ మరియు 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్, అదే విధంగా 1.5-లీటర్ సామర్థ్యం ఉన్న డీజల్ ఇంజన్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

                • ధర రూ. 6.93 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా ప్రారంభమవుతుంది.
                • చివరగా:

                  చివరగా:

                  స్టూడెంట్స్ ఎంచుకోవడానికి ఇండియన్ మార్కెట్లో ఉన్న విభిన్న మోడళ్లను ఎంచుకోవడం జరిగింది. అందులో ధరలు, ఫీచర్లు మరియు నాణ్యత వంటి అంశా పరంగా ఎంపిక చేయడం జరిగింది. ప్రస్తుతం ద్విచక్ర వాహనాల ద్వారా ప్రమాదాలు అధికమవుతున్న నేపథ్యంలో భద్రత పీచర్లతో నిండిన కార్లను ఎంచుకోవడానికి స్టూడెంట్స్ మొగ్గు చూపుతున్నారు.

Most Read Articles

English summary
Best Four-Wheelers For College Students In India
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X