ఐదు లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు

ఐదు లక్షల బడ్జెట్లో అత్యుతమ ఫీచర్లు, మైలేజ్ మరియు ఇంజన్ గల కార్లు గురించి ప్రత్యేక కథనం: పూర్తి వివరాలు ...

By Anil

దేశీయ ప్యాసింజర్ కార్ల తయారీ సంస్థలు మార్కెట్లోకి అత్యుత్తమ కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి. పనితీరు, ఇంజన్, మైలేజ్, ఫీచర్లు అన్నింటికంటే సరసమైన ధరతో కార్లను ఉత్పత్తి చేస్తున్నాయి కొన్ని కంపెనీలు. వినియోగదారుల ఎంపికను బట్టి విభిన్నమైన ఉత్పత్తులను తమ షోరూమ్‌ల ద్వారా అందుబాటులో ఉంచాయి.

దేశీయంగా మైలేజ్, పనితీరు, ధర వంటి అంశాల పరంగా కార్లను ఎంచుకుంటున్న వారి సంఖ్యను బట్టి ఈ జాబితాలో సేకరించడం జరిగింది. తయారు దారుడు ఉత్పత్తి చేసిన మోడల్‌లోని వేరియంట్‌ గురించిన వివరాలుగా గుర్తించగలరు.

10. ఫోర్డ్ ఫిగో ప్రారంభ వేరియంట్ 1.2 టిఐ-విసిటి

10. ఫోర్డ్ ఫిగో ప్రారంభ వేరియంట్ 1.2 టిఐ-విసిటి

ఫోర్డ్ మోటార్స్ ఇండియన్ మర్కెట్లోకి ఫిగో హ్యాచ్‌బ్యాక్‌ను విడుదల చేసిన సమయంలో తీవ్ర పోటీ ఉండేది. అయితే ఆ తరువాత కాలంలో అప్‌డేటెడ్ ఫిగోను విడుదల చేసింది. దేశీయంగా ఫిగోను అంతగా స్వీకరించకపోయినా, ఇండియా నుండి విదేశాలకు ఎక్కువగా ఎగుమతవుతోంది.

ఐదు లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు

ఫోర్డ్ ఫిగో లో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 87బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

  • ధర - రూ. 4.47 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)
  • మైలేజ్ - లీటర్‌కు 18.16 కిలోమీటర్లు
  • 9. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఎరా 1.2 కప్పా విటివిటి

    9. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఎరా 1.2 కప్పా విటివిటి

    మారుతి సుజుకి స్విఫ్ట్ మరియు ఫోర్డ్ ఫిగోలకు ఇది గొప్ప ప్రత్యామ్నాయం. అమ్మకాల పరంగా హ్యుందాయ్‌కి బాగా కలిసొస్తున్న మోడల్ ఇదే. హ్యుందాయ్ వారి నిర్మాణ, నాణ్యత విలువలు దీని అమ్మకాల్లో స్పష్టంగా ప్రతిబింబిస్తాయి.

    ఐదు లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు

    హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 ఎరా 1.2 కప్పా విటివిటి లో 1.2-లీటర్ సామర్థ్యం ఉన్న పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 81బిహెచ్‌‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

    • ధర - రూ. 4.92 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)
    • మైలేజ్ - లీటర్‌కు 18.9 కిలోమీటర్లు
    • 8. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ

      8. మారుతి సుజుకి వ్యాగన్ఆర్ ఎల్ఎక్స్ఐ

      మారుతి సుజుకిలో తిరుగులేని చిన్న హ్యాచ్‌బ్యాక్‌లలో ఒకటి వ్యాగన్ఆర్. విడుదలైన దశాబ్దం కాలం నుండి నిలకడగా భారీ అమ్మకాలను సాధిస్తోంది వ్యాగన్ఆర్. స్పేస్ మరియు స్టోరేజ్ పరంగా భారతీయులు దీనికి నీరాజనాలు పడుతున్నారు.

      ఐదు లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు

      మారుతి సుజుకి వ్యాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ వేరియంట్లో కె-సిరీస్ 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 67బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

      • ధర - రూ. 4.10 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)
      • మైలేజ్ - లీటర్‌కు 20.51 కిలోమీటర్లు
      • 7. మారుతి సుజుకి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ

        7. మారుతి సుజుకి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ

        మారుతి సుజుకి ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన స్విప్ట్ హ్యాచ్‌బ్యాక్ విప్లవాత్మక ఉత్పత్తి. విడుదల చేసిన కాలం నుండి నేటి వరకు విప్లవాత్మకమైన విక్రయాలు జరుపుతోంది. నానాటికీ అప్‌డేట్ అవుతున్న స్విఫ్ట్ చివరికి స్పోర్టివ్ తరహాలోకి మారిపోయింది.

        ఐదు లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు

        మారుతి సుజుకి స్విఫ్ట్ ఎల్ఎక్స్ఐ వేరియంట్లో 1.2-లీటర్ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు. ఇది గరిష్టంగా 83 బిహెచ్‌పి పవర్ మరియు 115ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

        • ధర - రూ. 4.76 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)
        • మైలేజ్ - లీటర్‌కు 20.4 కిలోమీటర్లు
        • 6. మారుతి ఆల్టో 800 ఎస్‌టిడి

          6. మారుతి ఆల్టో 800 ఎస్‌టిడి

          మారుతి సుజుకి లైనప్‌లో ఆల్టో 800 మోడల్ అత్యుత్తమ అమ్మకాలు సాధిస్తూ మొదటి స్థానంలో ఉంది. రెనో క్విడ్ విడుదలతో ఆల్టో అమ్మకాల్లో కాస్త తగ్గుదల కనబడింది.

          ఐదు లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు

          మారుతి ఆల్టో 800 లో 800సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 47బిహెచ్‌పి పవర్ మరియు 69ఎన్ఎమ్ గరిష్ట టార్క్ ఉత్పత్తి చేయును.

          • ధర - రూ. 2.42 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)
          • మైలేజ్ - లీటర్‌కు 24.7 కిలోమీటర్లు
          • 5. డాట్సన్ రెడి గో డి

            5. డాట్సన్ రెడి గో డి

            ఇండియన్ మార్కెట్లోకి రెడి గో ఉత్పత్తిని విడుదల చేసే వరకు అంతగా డాట్సన్ పేరు పెద్దగా ఎవరికీ తెలియదు. నానోను తప్పించి ఇండియన్ మార్కెట్లో ఉన్న అత్యంత సరసమైన ఉత్పత్తుల్లో రెడి గో మొదటి స్థానంలో ఉంది. సిటి రోడ్ కండీషన్‌లో డ్రైవ్ చేయడానికి రెడి గో చాలా బెస్ట్ కారు.

            ఐదు లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు

            డాట్సన్ తమ రెడి గో డి వేరియంట్లో 800సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ అందించింది. దీనిని రెనో క్విడ్‌లో కూడా గమనించవచ్చు. ఇది గరిష్టంగా 53బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు.

            • ధర - రూ. 2.42 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)
            • మైలేజ్ - లీటర్‌కు 25.17 కిలోమీటర్లు
            • 4. మారుతి ఆల్టో కె10 ఎల్ఎక్స్

              4. మారుతి ఆల్టో కె10 ఎల్ఎక్స్

              మారుతి విక్రయాల్లో మొదటి స్థానంలో ఉంది ఆల్టో. గడిచిన దశాబ్దం కాలంలో ఎంతో మంది భారతీయులు దీనిని ఎంచుకున్నారు. విసృతమైన షోరూమ్‌లు, సరైన ధర మంచి మైలేజ్ కారణంతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

              ఐదు లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు

              మారుతి ఆల్టో కె10 ఎల్ఎక్స్ వేరియంట్లో 1.0-లీటర్ సామర్థ్యం గల కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ కలదు, సెలెరియో మరియు వ్యాగన్ ఆర్ ఉత్పత్తుల్లో ఈ ఇంజన్ గుర్తించవచ్చు.

              • ధర - రూ. 3.26 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)
              • మైలేజ్ - లీటర్‌కు 24.07 కిలోమీటర్లు
              • 3. మారుతి సుజుకి సెలెరియో ఎల్ఎక్స్ఐ

                3. మారుతి సుజుకి సెలెరియో ఎల్ఎక్స్ఐ

                సాధారణంగా కార్ల తయారీదారులు తమ మ్యాన్యువల్ ఉత్పత్తుల ధరల కన్నా ఆటోమేటిక్ కార్ల ధరలు ఎక్కువగా ఉండేట్లు కార్లను విడుదల చేస్తుంటారు. అయితే మారుతి సుజుకి మొదటి సారిగా తమ సెలెరియోలో ప్రప్రథమంగా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ అందించింది.

                ఐదు లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు

                ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ద్వారా కార్లను సులభంగా డ్రైవ్‌చేయాలనుకునే వారు సెలెరియోను ఎంచుకుంటున్నారు. ఇందులో 67బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగల 1.0-లీటర్ సామర్థ్యం ఉన్న కె-సిరీస్ పెట్రోల్ ఇంజన్ కలదు.

                • ధర - రూ. 4.03 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)
                • మైలేజ్ - లీటర్‌కు 23.1 కిలోమీటర్లు
                • 2. టాటా టియాగో రివట్రాన్ ఎక్స్‌బి

                  2. టాటా టియాగో రివట్రాన్ ఎక్స్‌బి

                  టాటా మోటార్స్ తమ టియాగోతో మొత్తం డిజైన్ భాషను మార్చేసింది. అత్యంత సరసమైన ధరతో, నాణ్యమైన నిర్మాణ విలువలతో టాటా ఈ టియాగోను విడుదల చేసింది.

                  ఐదు లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు

                  సాంకేతికంగా టాటా టియాగో రివట్రాన్ ఎక్స్‌బి వేరియంట్లో 1.2-లీటర్ సామర్థ్యం గల రివట్రాన్ పెట్రోల్ ఇంజన్ కలదు, ఇది గరిష్టంగా 84బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

                  • ధర - రూ. 3.20 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)
                  • మైలేజ్ - లీటర్‌కు 23 కిలోమీటర్లు
                  • 1. రెనో క్విడ్ 800 ఎస్‌టిడి

                    1. రెనో క్విడ్ 800 ఎస్‌టిడి

                    ఇండియన్ ఆటోమొబైల్ ఇండస్ట్రీలోని ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్ సెగ్మెంట్లో క్విడ్ సునామీ సృష్టించింది. దీని విజయంతో ఫ్రెంచ్ కార్ల తయారీ సంస్థ రెనో పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. చూడటానికి చిన్న కారుగానే ఉన్నప్పటికీ డిజైన్ పరంగా చాలా అద్బుతం అని చెప్పాలి.

                    ఐదు లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు

                    అత్యంత సరసమైన ధరకు రెనో క్విడ్‌లో భారీ ఫీచర్లను అందించారు. ఇందులోని800సీసీ సామర్థ్యం గల పెట్రోల్ ఇంజన్ గరిష్టంగా 53బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయును.

                    • ధర - రూ. 2.62 లక్షలు ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)
                    • మైలేజ్ - లీటర్‌కు 25.17 కిలోమీటర్లు
                    • ఐదు లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు

                      దేశీయ మార్కెట్లో 5 లక్షల లోపు ధర గల సెగ్మెంట్లో అనేక కార్ల తయారీ సంస్థల మధ్య తీవ్ర పోటీ ఉంది. ప్రతి తయారీ సంస్థ కూడా ఎంట్రీ లెవల్ హ్యాచ్‌బ్యాక్‌లో తమ ఉత్పత్తిని ప్రవేశపెట్టింది. ఇలాంటి పోటీ ఉండటం వలన తక్కువ ధరలో నాణ్యమైన మరియు ఉత్తమ ఫీచర్లు లభిస్తాయి. అదే విధంగా ఎంచుకోవడానికి ఎక్కువ ఉత్పత్తులు ఉంటాయి.

                      ఐదు లక్షల బడ్జెట్లో బెస్ట్ కార్లు

                      • ఈ దారులు వెంబడి వెళితే వెనక్కి రావడం అసాధ్యం
                      • ఎన్ని బైకులున్నా... ఈ ఆరు మాత్రమే ప్రత్యేకం !!
                      • విడుదలకు సిద్దమైన మారుతి సుజుకి స్విఫ్ట్ స్పోర్ట్

Most Read Articles

English summary
Best Cars Under Rs 5 Lakh In India — Value For Money Proposition
Story first published: Saturday, November 12, 2016, 17:52 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X