పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహన ప్రదర్శన వేదిక

ప్రపంచ పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శన మూడు రోజుల పాటు దేశీయంగా ప్రారంభం కానుంది. పూర్తి వివరాల కోసం....

By Anil

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు ఉద్గార రహిత మరియు పర్యావరణ హితమైన ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది మరియు అమ్మకాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయి. ఈ కాలుష్య కోరల నుండి పర్యావరణ రక్షణ కోసం ఇప్పటికే చాలా వరకు స్వచ్ఛంద సంస్థలు ప్రజలను మేల్కొపుతున్నాయి. ఈ కోవకు చెందినదే ఢిల్లీలో జరగనున్న ప్రపంచ పర్యావరణహితమైన ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శన. మూడు రోజుల పాటు ఈ ఇవి-ఎక్స్‌పో వేదిక ఎకో ఫ్రెండ్లీ వాహన ప్రదర్శన జరగనుంది.

 పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహన ప్రదర్శన వేదిక

ఢిల్లీ వేదికగా ప్రగతి మైదాన్‌లో ఈ ఎకో ఫ్రెండ్లీ ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శన ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్స్ పో 2016 ని జాతీయ రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు డిసెంబర్ 23, 2016 న ప్రారంభించనున్నారు. ఈ అంతర్జాతీయ ఎలక్ట్రిక్ వాహనాల ప్రదర్శన మూడు రోజుల పాటు జరగనుంది.

 పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహన ప్రదర్శన వేదిక

ఎలక్ట్రిక్ రిక్షా తయారీదారుల ఆర్గనైజేషన్ మరియు అసోసియేషన్ వ్యవస్థాపకులు మరియు సభ్యులయిన రాజీవ్ అరోరా గారు ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ప్రదర్శనను ఆర్గనైజ్ చేస్తున్నారు. వరుసగా మూడు రోజుల పాటు జరిగే ఈ వాహన ప్రజర్శనకు ఈ సారి ఓ ప్రత్యేకత ఉందని తెలిపాడు. ఇంత వరకు కేవలం ఎలక్ట్రిక్ వాహనాలను మాత్రమే ప్రదర్శన వేదిక ఇదొక్కటే అని తెలియజేశారు.

 పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహన ప్రదర్శన వేదిక

రాజీవ్ గారు మాట్లాడుతూ, దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది, తయారీ మరియు అమ్మకాలకు భారత ప్రభుత్వం సుముఖంగా ఉంది. అందుకోసం కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పలుమార్లు ఇ-రిక్షాలను మరియు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రమోట్ చేసింది.

 పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహన ప్రదర్శన వేదిక

ప్రస్తుతం పర్యావరణానికి హాని కలిగించని, పర్యావరణహితమైన రవాణాని కల్పించటం మరియు తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం ప్రయాణించే వాహనాల మీద ప్రజలు మరియు ప్రభుత్వం ఎక్కువ దృష్టి సారిస్తున్నారు. భారత ప్రభుత్వం ప్రకారం 2020 నాటికి పెడల్స్ ద్వారా తొక్కే 7.5 కోట్ల రిక్షాలను ఎలక్ట్రిక్ రిక్షాలతో రీప్లేస్ చేస్తూ 2030 నాటికి 100 శాతం ఎలక్ట్రిక్ వాహనాలను వినియోగించే దేశంగా మార్చాలనే సంకల్పంతో ఉంది.

 పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహన ప్రదర్శన వేదిక

ఢిల్లీలో ప్రారంభం కానున్న 2016 ఎలక్ట్రిక్ వాహన ప్రదర్శన వేదిక మీద ఆల్టీయిస్ టెక్నాలజీస్, సోని ఎలక్ట్రిక్, లోహియా ఆటో, విక్టరీ ఎలక్ట్రిక్, నన్యా, గోయెంకా, మిని మెట్రో, థుక్రల్ ఎలక్ట్రిక్ బైక్స్, హైటెక్,ఇండో వ్యాగన్, జెజ్జా మోటార్స్, డిఎమ్‌డబ్ల్యూ, ఎస్ట్‌మ్యాన్,బజోరియా మోటార్స్ వంటి సంస్థలు తమ ఎలక్ట్రిక్ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి.

 పర్యావరణహిత ఎలక్ట్రిక్ వాహన ప్రదర్శన వేదిక

  • 2019 నాటికి డీజల్ ఇంజన్ స్థానంలోకి మిల్డ్ హైబ్రిడ్ ఇంజన్‌లు
  • అత్యంత సరసమైన కార్ల విడుదలకు సిద్దమవుతున్న హ్యుందాయ్
  • షెవర్లే వారి కళ్లు చెదిరే సంవత్సరాంతపు ఆఫర్లు

Most Read Articles

English summary
Third Eco-Friendly Electric Vehicle Expo Set To Begin
Story first published: Saturday, December 17, 2016, 21:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X