మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్: రైలు, రోడ్డు మీద కూడా నడుస్తుంది

By Anil

ప్రపంచ వ్యాప్తంగా లగ్జరీ కార్లను తయారు చేసే సంస్థ మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్ అనే మల్టీ పర్పస్ వాహనాలను ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోకి తీసుకువచ్చింది. చాలా వరకు అవసరాలకు వీటిని మనం వినియోగించుకోవచ్చు. అయితే మెర్సిడెస్ సరికొత్త యునిమోగ్‌ను రివీల్ చేసింది. దీని ప్రత్యేకత ఏమిటంటే రైలు ట్రాక్ మరియు రోడ్డు రెండింటి మీద కూడా నడుస్తుంది.

మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్ వాహనం గురించి మరిన్ని విశేషాలు క్రింది కథనంలో....

రైలు మరియు రోడ్డు మీద నడిచే మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్

రైలు పట్టాలు మరియు రోడ్డు మీద నడిచే ఈ యునిమోగ్‌ను మెర్సిడెస్ బెంజ్ జర్మనీలో జరిగిన ఇన్నోట్రాన్స్ రైల్ ట్రాన్స్‌పోర్ట్ ప్రదర్శనలో కొలువుచేసింది.

రైలు మరియు రోడ్డు మీద నడిచే మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్

మెర్సిడెస్ బెంజ్ ఇంతకు ముందే చాలా వరకు రైలు మరియు రోడ్డు మీద నడిచే యునిమోగ్ వాహనాలను తయారు చేసింది. అయితే ఈ సరికొత్త యు 423 అనే వాహనాన్ని మరిన్ని అప్‌డేట్స్‌తో అభివృద్ది చేసినట్లు తెలిసింది.

రైలు మరియు రోడ్డు మీద నడిచే మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్

మెర్సిడెస్ బెంజ్ ఈ యునిమోగ్ వాహనంలో అతి ముఖ్యమైన భధ్రత ఫీచర్లయిన అగ్ని ప్రమాదాన్ని గుర్తించి దానిని నిర్మూలించే లక్షణాలను కలిగి ఉంది. తద్వారా దీనిని సురక్షితంగా రైలు పట్టాల మీద కూడా నడపవచ్చు.

రైలు మరియు రోడ్డు మీద నడిచే మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్

ఈ యునిమోగ్ వాహనం ద్వారా రైలు పట్టాల మీదున్న భోగీలను హైడ్రాలిక్ సిస్టమ్ ద్వారా అనుసంధానం చేసుకుని భోగీలను ఒక చోట నుండి మరో చోటకు చేర్చుతుంది.

రైలు మరియు రోడ్డు మీద నడిచే మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్

దీనిని అవసరాలను బట్టి రైలు పట్టాల మీద మరియు రోడ్డు మీద ప్రయాణించే విధంగా మెర్సిడెస్ బెంజ్ రూపొందించింది. అత్యంత ప్రతి కూలమైన రహదారుల్లో కూడా దీనిని నడపవచ్చు.

రైలు మరియు రోడ్డు మీద నడిచే మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్

మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్ వాహనంలో 5.1-లీటర్ సామర్థ్యం ఉన్న నాలుగు సిలిండర్ల టర్భోచార్జ్‌డ్ డీజల్ ఇంజన్ కలదు.

రైలు మరియు రోడ్డు మీద నడిచే మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ సుమారుగా 231బిహెచ్‌పి పవర్ మరియు 664 టార్క్ (అడుగు 664 పౌండ్లు) ను ఉత్పత్తి చేయును.

రైలు మరియు రోడ్డు మీద నడిచే మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్

గంటకు 50 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఈ యునిమోగ్ 1000 టన్నుల బరువున్న రైలు భోగీలను కూడా లాగుతుంది. ఎందుకంటే ఇందులో ఉన్న మెటల్ చక్రాలు పట్టాలు మీద మరియు రబ్బరు చక్రాలు నేల మీద పటిష్టంగా పరుగులు పెడతాయి. తద్వారా ఎక్కువ బరువు లాగడానికి ఆస్కారముంది.

రైలు మరియు రోడ్డు మీద నడిచే మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్

మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్ ఉత్పత్తి అద్భుతం అని చెప్పవచ్చు. రెండు విభిన్న అవసరాలకు ఒకే విధమైన వాహనాన్ని వినియోగించుకునే అవకాశాన్ని కల్పించింది.

రైలు మరియు రోడ్డు మీద నడిచే మెర్సిడెస్ బెంజ్ యునిమోగ్

  • ప్రపంచ వ్యాప్తంగా అత్యంత ఖరీదైన, అతి పెద్ద ట్రక్కు

Most Read Articles

English summary
Can A Road Going Vehicle Run On Rails? Yes! Says Mercedes-Benz Unimog
Story first published: Friday, August 19, 2016, 16:12 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X