ఎలక్ట్రిక్ వెహికల్స్ అభివృద్ది కోసం మిత్సుబిషితో చేతులు కలిపిన రెనో-నిస్సాన్ భాగస్వామ్యం

Written By:

ప్రముఖ కార్ల తయారీ సంస్థలు మిత్సుబిషి, రెనో మరియు నిస్సాన్ ఎలక్ట్రిక్ వాహనాల నిర్మాణానికి సంభందించిన నమూనాలను పంచుకోనున్నాయి. వీటి ద్వారా తమ భవిష్యత్ ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్ది చేసే యోచనలో మూడు సంస్థలు ఉన్నాయి. ఈ సంస్థలు ఒక దానికొకటి సాంకేతిక వివరాలను అధికారికంగా పంచుకోవడం ద్వారా భవిష్యత్తులో తక్కువ ధరతో తమ ఉత్పత్తులు మార్కెట్లోకి విడుదల చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న కన్వెన్షనల్ గ్యాసోలీన్ కార్ల కన్నా తక్కువ ధర తమ ఎలక్ట్రిక్ వాహనాల పరిచయం చేయడానికి ఈ ఒప్పందం ఉపయోగపడనుంది.

నిస్సాన్ మరియు రెనో భాగస్వామ్యం నెక్ట్స్ జనరేషన్ ఎలక్ట్రిక్ ఫ్లాట్‌ఫామ్‌ను సంయుక్తంగా అభివృద్ది చేసుకుంటున్నాయి. ఈ వేదిక మీద లీఫ్ మరియు జోయ్ అనే భవిష్యత్ ఎలక్ట్రిక్ మోడళ్ల ను అభివృద్ది చేయనున్నాయి.

ఈ మధ్యనే మిత్సుబిషి నిస్సాన్ సంస్థతో చేతులు కలిపింది. ఇరు సంస్థలు కూడా ఎలక్ట్రిక్ వాహనాల అభివృద్దికి సంభందించిన ప్రత్యేక ఫ్లాట్‌ఫామ్‌ను అభివృద్ది చేయనున్నాయి.

నిక్కీ అనే వార్తా పత్రిక తెలిపిన వివరాల మేరకు నిస్సాన్-రెనో మరియు మిత్సుబిషి సంస్థలు కలిసి ఎలక్ట్రిక్ వాహనాలలో అత్యంత కీలకమైన మోటార్, ఇన్వర్టర్ మరియు బ్యాటరీ వంటి విఢిబాగాలను పరస్పరం పంచుకోనున్నాయి.

ఈ విడి భాగాలను మూడు సంస్థలకు చెందిన ఇంజనీరింగ్ మరియు డెవలప్‌మెంట్ విభాగాలు తయారు చేయనున్నాయి. మూడు సంస్థలు జట్టుగా ఏర్పడి అభివృద్ది చేస్తున్న ఎలక్ట్రిక్ వాహనాలు ధరలు చాలా వరకు తక్కువగా ఉండనున్నాయి.

మూడు సంస్థల యొక్క భాగస్వామ్యానికి ముక్య కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తున్న కార్లోస్ ఘోసన్ మాట్లాడుతూ, ఇంధన తీసుకుని ఉద్గారాలను వెల్లడించే వాహనాల కన్నా తక్కువ ధరలో మార్కెట్లోకి ఎలక్ట్రిక్ వాహనాలను విడుదల చేయడమే ముఖ్య లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపాడు.

నిక్కీ పత్రిక కథనం మేరకు ఈ మూడు సంస్థలు భాగస్వామ్యంతో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ వేదికను అభివృద్ది చేస్తున్నాయనే సమాచారాన్ని ఇంత వరకు ఏ సంస్థ కూడా అధికారికంగా స్పష్టం చేయలేదు.

 

English summary
Renault-Nissan Alliance To Share EV Platform With Mitsubishi
Please Wait while comments are loading...

Latest Photos