ప్రపంచపు అత్యంత ఖరీదైన కారు రోల్స్ రాయిస్ స్వెప్‌టెయిల్: ధర రూ. 84 కోట్లు

Written By:

ఇటలీలోని కంన్కోర్స్ డిఎలిగంజా హోటల్ వార్షికోత్సన వేడుక సందర్భంగా రోల్స్ రాయిస్ సంస్థ అత్యంత ఖరీదైన స్వెప్‌టెయిల్ కారును ఆవిష్కరించింది. వేదిక మీద ప్రదర్శనకు తీసుకొచ్చిన ఈ స్వెప్‌టెయిల్ ధర 10 మిలియన్ యూరోలుగా రోల్స్ రాయిస్ వెల్లడించింది. అంటే మన కరెన్సీలో దీని ధర రూ. 84 కోట్ల రుపాయలు.

కానీ ఈ ప్రపంచపు అత్యంత ఖరీదైన కారును కోరిన ధనవంతుడి వివరాలు మాత్రం వెల్లడి కాలేదు. ఓ సూపర్ రిచ్ పర్సన్ కోరిక మేరకు రోల్స్ రాయిస్ ఈ కోట్ల విలువైన కారును రూపొందించి ఆవిష్కరించింది.

బ్రిటీష్ కార్ల తయారీ సంస్థ తమ కస్టమర్ గురించి మాట్లాడుతూ, స్వెప్‌టెయిల్ కారును కోరిన కస్టమర్ మా ఉత్పత్తులను రెగ్యులర్‌గా కొనుగోలు చేస్తుంటాడు. అదే విధంగా మేము ఆవిష్కరించే అన్నిఅరుదైన కార్లను ఇతనే కొనుగోలు చేస్తాడు. ఖరీదైన కార్లతో పాటు సూపర్ యాచ్ మరియు ప్రయివేట్ జెట్‌లు కూడా ఉన్నట్లు తెలిపింది.

ఈ కారుకు స్వెప్‌టెయిర్ అనే పేరు ఖచ్చితంగా సరిపోయిందని చెప్పవచ్చు. ముందు వైపు బాక్స్ ఆకారంలో సాధారణ రోల్స్ రాయిస్ కారు తరహాలో పెద్ద ఫ్రంట్ గ్రిల్ మరియు మందంగా ఉండే ఎల్ఇడి లైట్లు ఉన్నాయి.

రియర్ డిజైన్ విషయానికి వస్తే ఇది రోల్స్ రాయిస్ కారేనా అనే సందేహం మాత్రం గ్యారంటీ. కారు వెనుక చివరివైపు నుండి వాలును పెంచుతూ ముందు వైపు వరకు టాపును అత్యంత వాలుగా రూపొందించారు. ఇక వెనుక వైపు క్రింది డిజైన్ విషయానికి వస్తే, అధిక బరువులను జోడించిన క్రింది నుండి పైకి మలిచిన తీరు గమనించవచ్చు.

ముందు మరియు వెనుక చక్రాలకు మధ్య చాలా దూరాన్ని గమనించవచ్చు. దీంతో ఇందులో నలుగురు సౌకర్యవంతంగా కూర్చోవచ్చు అనుకుంటే పొరబడినట్లే, ఎందుకంటే ఇది కేవలం ఇద్దరు ప్రయాణించడానికి మాత్రమే రూపొందించారట.

ఇంటీరియర్‌లో మరెక్కడా చూడని లైటింగ్ సిస్టమ్ రోల్స్ రాయిస్ ఇందులో అందించింది. మరియు కారు ముందు వైపు నుండి తోక భాగం వరకు కొనసాగించబడిన ప్యానరోమిక్ సన్ రూఫ్ అత్యద్బుతం అనే చెప్పాలి.

ప్రపంచపు అత్యంత ఖరీదైన కారు ఇంటీరియర్‌లో మృదువైన తోలు పదార్థం మరియు బ్లాక్ డెకరేటివ్ ఎలిమెంట్లతో అత్యంత సుందరంగా అప్‌హో‌ల్‌స్ట్రేని రూపొందించారు. వీటితో పాటు ఎబోని మరియు పాల్డావొ కలప పొరలున్న ఇంటీరియర్ గోడలను తీర్చిదిద్దడం జరిగింది.

కారులో అందించిన రోల్స్ రాయిస్ గడియారం, రోల్స్ రాయిస్ సంస్థ చేతితో తయారు చేయించింది. ఈ గడియారంలో కలప మరియు టైటానియం పదార్థాలను ఉపయోగించారు.

రోల్స్ రాయిస్ మోటార్ కార్స్ సిఇఒ టార్‌స్టన్ ముల్లర్-ఒట్వోస్ మాట్లాడుతూ, " రోల్స్ రాయిస్ స్వెప్‌టెయిల్ నిజంగా ఓ అధ్బుతమైన కారు. ప్రపంచ వ్యాప్తంగా అత్యంత అందమైన మరియు రొమాంటిక్ ట్రావెల్ ఫీల్ కల్పించే కారు, వివిధ ఖండాంతరాలలో డ్రైవ్ చేయడానికి ఇదొక గొప్ప ఎంపిక" అని చెప్పుకొచ్చాడు.

ఈ కారును నిర్మించడానికి నాలుగు సంవత్సరాలు పట్టింది. దీనిని నిర్మించాలనే ఆలోచన తొలుత 2013 వచ్చింది. తరువాత ఆ ఆలోచనను ఓ కస్టమర్ రోల్స్ రాయిస్‌తో పంచుకోవడంతో దీని పూర్తి స్థాయి నిర్మాణం సాధ్యపడింది.

1920 మరియు 30 ల కాలంలో ఉండేటటువంటి ఇద్దరు కూర్చునే సామర్థ్యం ఉన్న కార్లను ప్రేరణగా తీసుకొని విభిన్నంగా ఓ కారును తయారు చేయమని కస్టమర్ స్వయంగా రోల్స్ రాయిస్‍‌‌ను కోరగా, రోల్స్ రాయిస్ ఈ స్వెప్‌టెయిల్‌ను రూపొందించింది. అయితే ఇందులో సాంకేతిక వివరాలను వెల్లడించడానికి రోల్స్ రాయిస్ నిరాకరించింది.

Story first published: Tuesday, May 30, 2017, 11:16 [IST]
English summary
Read In Telugu Unique Rolls Royce Sweptail Revealed — The World's Most Expensive Car
Please Wait while comments are loading...

Latest Photos