వెహికల్స్‌కు ఫ్యూయల్ ఫిల్లర్స్ ఒకే వైపు ఎందుకు ఉండవు ?

వెహికల్‌లో డ్రైవర్‌కు వ్యతిరేకంగా ఎడమ చేతివైపున ఇంధనం నింపే ట్యాంకు మూత ఉంటుంది. ఎందుకో తెలుసా....?

Written By:

మీరు మీ స్నేహితుడి కార్ లేదంటే, ఎదయినా అద్దె కారు నడుపుతున్నారనుకోండి. ఉన్నట్లుండి ఫ్యూయల్ అయిపోయింది. అయితే ఇంధనం నింపేందుకు మూత ఏవైపు ఉందో నిజంగా మీకు తెలియదు. అప్పుడు మీకు తెలియకుండానే మీలో కోపం రగిలిపోతుంటుంది. కొన్ని సార్లు మీ సొంతం వెహికల్ నడుపుతున్నా కూడా ఇలాంటి అనుభవమే ఎదురవుతుంది.

కొన్ని వెహికల్స్‌కు ఎడమ వైపు, మరి కొన్నింటికి కుడి వైపున ఇంధనం నింపే మూత ఉంటుంది, దీనికి గల కారణం ఎంటో ఎప్పుడయినా ఆలోచించారా....? అయితే నేటి కథనంలో దీనికి సమధానం తెలుసుకుందురు రండి...

ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఏ వైపు, ఎందుకు ఉంటుందో తెలుసుకోవాలంటే, ముందుగా కార్ల తయారీదారుల గురించి తెలుసుకోవాలి. ఉదాహరణకు, జపాన్ కార్లకు ఇంధనం నింపే క్యాప్ ఎడమ వైపున, జర్మనీ కార్లకు కుడి వైపున అదే విధంగా అమెరికా కార్లకు కుడి వైపున ఉంటుంది.

పొగను విడుదల చేసే వాహనాలకు గుర్తుగా వీటిని ఒక్కో కంపెనీ ఒక్కో వైపున అందివ్వడం జరుగుతోంది. అంటే పొగ గొట్టం ఉన్న భాగానికి వ్యతిరేకంగా ఇంధన ట్యాంకును నింపే క్యాపును అందివ్వడం జరుగుతుంది. ఉదాహరణకు, ఎడమ వైపున పొగగొట్టం ఉంటే కుడి వైపున ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఇవ్వడం అన్నమాట.

చాలా వరకు జపాన్ కార్లకు పొగపొట్ట కుడివైపులో ఉంటుంది, అదే విధంగా అమెరికా మరియు జర్మనీ కార్లకు పొగ గొట్టం ఎడమ వైపున ఉంటుంది.

కొన్ని కార్ల తయారీ సంస్థలు డ్రైవర్ ఉన్న వైపునే ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ అందిస్తారు. ఎందుకో తెలుసా ? హై వేలలో ఇంధన కొరత కారణంగా వాహనం ఆగిపోతే, ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఉండటం కోసం అని డ్రైవర్ వెంటనే దిగి ఇంధనం నింపుకునే అవకాశం ఉంటుందనే కారణం చేత డ్రైవర్ ఉన్న సైడ్‌లోని క్యాప్ అందివ్వడం జరిగిందంట.

మరికొన్ని కార్ల తయారీ సంస్థలు డ్రైవర్ కుడి వైపున ఉంటే, అతడికి ఎడమ వైపున ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ అందిస్తున్నాయి. దీనికి కూడా ఓ కారణం ఉంది. డ్రైవర్ మరియు ఫ్యూయల్ ఫిల్లర్ క్యాప్ ఒకే వైపు ఉంటే పెట్రోల్ బంకుల్లో రద్దీగా ఉన్న సందర్బంలో మాకే ముందు ఫ్యూయల్ నింపాలి అని తొందరపెడతారనే ఉద్దేశ్యంతో ఇలా అందించారనే సమాచారం ఉంది.

ఇండియాలో రోడ్డుకు ఎడమవైపునే ఎందుకు డ్రైవ్ చేయాలి ? వివరంగా...!!
ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాలు రోడ్డుకు కుడివైపున డ్రైవ్‌ చేస్తారు. ఇండియా మరియు కొన్ని దేశాలు మాత్రమే రోడ్డుకు ఎడమవైపున డ్రైవ్ చేస్తారు. ఈ పద్దతులకు చరిత్ర వద్ద ఎలాంటి సమాధానం ఉందో చూద్దాం రండి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Why Aren’t All Fuel Tank Fillers On The Same Side? The Real Reason Revealed
Please Wait while comments are loading...

Latest Photos