టాటా నానోగా మారిపోయిన ఆటో

టాటా నానోగా మారిపోయిన ఆటో రిక్షా... ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా...? ముందు వైపు అచ్చం ఆటోలా మరియు వెనుక వైపున నానోకి ఏ మాత్రం తీసిపోకుండా మోడిఫికేషన్ నిర్వహించారు.

By Anil

కారు మోడిఫికేషన్ మనకు ఇది కాస్త కొత్తే కావచ్చు. కాని పాశ్చ్యాత దేశాల్లో మోడిఫికేషన్లకు అధిక ప్రాధాన్యతనిస్తారు. ఆ ట్రెండు ఇప్పుడు దేశీయంగా విస్తరిస్తోంది. ఇతరుల్ని తికమకపెట్టేందుకు, లేదంటే తమ కార్లలా మరే ఇతర కారు ఉండకూడదనుకునే వారు మోడిఫికేషన్ల మీద ఆధారపడుతుంటారు.

టాటా నానోగా మారిపోయిన ఆటో

స్ట్రీట్ మెకానిక్ నుండి సర్వీసింగ్ టెక్నీషియన్ వరకు అనేక మంది ఇప్పుడు మోడిఫికేషన్స్ చేయడంలో నిష్ణాతులైపోయారు. ఆధునిక కాలంలో కార్ల మోడిఫికేషన్ ఏ స్థాయి వరకు ఉందంటే... మనల్ని నిలువునా ఆయోమయంలోకి నెట్టే రీతిలో ఉన్నాయి.

టాటా నానోగా మారిపోయిన ఆటో

అందులో ఒకటి ఈ నాటి టాటా నానోగా మారిపోయిన ఆటో రిక్షా... ఇదెలా సాధ్యం అనుకుంటున్నారా...? ముందు వైపు అచ్చం ఆటోలా మరియు వెనుక వైపున నానోకి ఏ మాత్రం తీసిపోకుండా మోడిఫికేషన్ నిర్వహించారు.

టాటా నానోగా మారిపోయిన ఆటో

ఆటో వెనుక వైపును అచ్చం కారు తరహాలో మోడిఫికేషన్ చేసేందుకు నానో కారు రియర్ సెక్షన్ సెలక్ట్ చేసుకున్నారు. వెనుక వైపున టెయిల్ లైట్లు, డిక్కీ డోరు, ప్రక్క డోర్లు, రియర్ బంపర్ ఇలా అన్నింటిని నానోను పోలి ఉండేలా డిజైన్ చేశారు.

టాటా నానోగా మారిపోయిన ఆటో

ఆటో ముందు డిజైన్‌ను ఆటోని పోలి ఉండేలా అలాగే వదిలేశారు. అయితే ముందు వైపున భారీగా క్రోమ్ సొబగులు ప్యానెళ్లను అందించారు. మధ్యలో ఆడి కంపెనీకి చెందిన సిగ్నేచర్ లోగోను గుర్తించవచ్చు.

టాటా నానోగా మారిపోయిన ఆటో

మోడిఫైడ్ ఆటో-నానో ఎక్ట్సీరియర్ మీద మ్యాట్ బ్లూ పెయింట్ స్కీమ్ కలదు. రూఫ్ టాప్ మరియు రూఫ్ రెయిల్స్ మ్యాట్ బ్లాక్ పెయింట్ స్కీమ్‌లో ఉన్నాయి.

టాటా నానోగా మారిపోయిన ఆటో

నానో ప్రేరణతో మోడిఫైడ్ చేసిన ఈ ఆటోకు ఎస్‌యూవీ లక్షణాలను అందించేందుకు బాడీ టాప్ మీద రూఫ్ రెయిల్స్, రియర్ క్రోమ్ టెయిల్ గేట్, మరియు ప్రక్కవైపుల ఆఫ్ రోడ్ రేసింగ్ స్టిక్కర్ అందించారు.

టాటా నానోగా మారిపోయిన ఆటో

వెనుక నుండి చూసి టాటా నానో అనుకోవడం, ముందు వైపు చూసి ఓ... ఇది ఆటోనా తికమకపడం ఖాయమే కదా.... ఈ మోడిఫికేషన్ మీకు నచ్చితే మీ స్నేహితులతో పంచుకోగలరు.

Most Read Articles

English summary
Read In Telugu This Modified Auto Rickshaw Is A Three-Wheeled Tata Nano
Story first published: Saturday, May 6, 2017, 14:53 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X