క్రిస్టియానో రొనాల్డో ఇంటికి మరో సూపర్ కార్...?

Written By:

ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక పారితోషికం తీసుకునే ఆటగాళ్లలో మొదటి స్థానంలో ఉన్న క్రిస్టియానో రొనాల్డో సూపర్ కార్ల కలెక్షన్ కింగ్‌గా మనకు బాగా సుపరిచితం. ఈ కథనంలోని ఫోటోలు మరియు వీడియోను తిలకిస్తే మరో ఖరీదైన కారును తన గ్యారేజీలోకి చేర్చుకున్నాడా? అనే ప్రశ్న రొనాల్డో అభిమానుల మదిని తొలిచేస్తుంది.

మొదటి ఫోటో క్రిస్టియానో రొనాల్డో మరియు బుగట్టి సంస్థ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లలో వెలువడింది. బుగట్టి చిరాన్‌ను గమనిస్తున్న ఫోటోల మాత్రమే వచ్చాయి. అయితే దీనిని కొన్నాడా లేదా అనే విశయం ఇంకా అధికారికంగా బుగట్టి లేదా రొనాల్డో వెల్లడించలేదు.

సూపర్ కార్ల ప్రేమికుడిగా ప్రపంచ జాబితాలో ఆధిక్యం స్థానంలో చెలామణి అవుతున్న రొనాల్డో వద్ద ఇది వరకే బుగట్టి వేరాన్ కలదు, అయితే ఈ 1,500బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేసే శక్తివంతమైన చిరాన్ మీద మనసుపారేసుకున్నట్లు స్పష్టం అవుతోంది.

గతంలో బుగట్టి మొదటి చిరాన్ కస్టమర్ల కార్ల నిర్మాణం చేపట్టింది. కాబట్టి, క్వాడ్ టుర్బో మాంస్టర్ కారు కూడా సూపర్ కార్ల మార్కెట్లోకి చేరే అవకాశం ఉన్నట్లు అంచనా వేయవచ్చు.

ఇటు బుగట్టి, అటు రొనాల్డో ఈ విశయం ఎలాంటి స్పందన చేయలేదు. అయితే రొనాల్డో మాత్రం బుగట్టి చిరాన్ కారును వోక్స్‌వ్యాగన్ గ్రూప్ ఎహ్రా-లెస్సీన్ టెస్ట్ ట్రాక్ మీద డ్రైవ్ చేసిన వీడియోని తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు.

వీడియోను తిలకించగలరు.....

క్రిస్టియానో ఒక వేళ దీనిని కొనుగోలు చేసినా ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇలా జరగడం ఇది తొలిసారి కాదు. 135 కోట్ల విలువైన దుబాయ్ జెట్ విమానం కొనుగోలు చేసిన ఫుట్‌బాల్ ఆటగాడు క్రిస్టియానో రొనాల్డో మరింత చదవండి.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
Has Cristiano Ronaldo Bought The Bugatti Chiron?
Please Wait while comments are loading...

Latest Photos