రోబోలతో వాలెట్ పార్కింగ్; జర్మనీలో ప్రయోగాత్మకంగా ప్రారంభం

By Ravi

వాలెట్ పార్కింగ్ విధానంలో ఓ కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఇప్పటి వరకు మనుషులు మాత్రమే వాహనాలను వాలెట్ పార్కింగ్ చేస్తుండేవారు. ఇకపై మనుషులకు బదులుగా మరమనుషులు (రోబోలు) కార్లను వాలెట్ పార్కింగ్ చేయనున్నాయి. జర్మనీలోని ఎయిర్‌పోర్ట్‌లో ఇప్పటికే రే (Ray) అనే రోబో కార్లను వాలెట్ పార్కింగ్ చేస్తోంది.

కస్టమర్లు తమ స్మార్ట్ ఫోన్ల సాయంతో రే రోబోను బుక్ చేసుకోవచ్చు. ఆ తర్వాత కస్టమర్లు ఒక నిర్దేశిత ప్రాంతంలో తమ కారును వదిలి వెళ్లితే, మిగతాదంతా రోబోనే చూసుకుంటుంది. కారును అక్కడి నుంచి వాలెట్‌కు చేర్చి పార్క్ చేస్తుంది. ఈ రోబో లేజర్ స్కానర్ల సాయంతో కారు యొక్క పొడవు, వెడల్పును లెక్కించుకుంటుంది. బంపర్లు, మిర్రర్లను కూడా లెక్కలోకి తీసుకుంటుంది.

New Valet Parking Robots

ఆ తర్వాత రే రోబోట్ ఆ కారును పిక్ చేసుకొని, ఇందుకోసం ప్రత్యేకంగా కేటాయించిన పార్కింగ్ స్థలంలో వదిలిపెడుతుంది. రే రోబోట్‌కు ఆటోమేటెడ్ ఫోర్క్‌లిఫ్ట్స్ ఉంటాయి. ఈ రోబోట్లు 3 టన్నుల వరకు బరువును మోయగలవు. కస్టమర్లు కారుకు సంబంధించి రోబో వాలెట్ టికెట్ ఇస్తుంది. అయితే, వాలెట్ టికెట్ పోతే ఏం జరుగుతుందనే దానికి సంబంధించి మాత్రం సమాచారం లేదు.

ఒక రోజుకు వాలెట్ పార్కింగ్ ఖర్చు 39 డాలర్లు. ఎవ్వరైనా తమ వాహనాలను రోబో సాయంతో వాలెట్ పార్కింగ్ చేయించుకోవచ్చు. ప్రధానంగా వ్యాపార నిమిత్తం నిత్యం ప్రయాణాలు చేసే వారిని లక్ష్యంగా చేసుకొని ఈ సేవలను ప్రారంభించినట్లు తెలుస్తోంది. బాగుంది కదూ ఈ రోబో వాలెట్ పార్కింగ్.

Most Read Articles

English summary
Germany has recently taken valet parking one notch higher by introducing robots to park cars for customers at airports. Ray, the robot, began work last Tuesday.
Story first published: Thursday, July 3, 2014, 10:10 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X