జాన్ చెంతకు చేరిన నిస్సాన్ జిటి-ఆర్ బ్లాక్ ఎడిషన్

జాన్ అబ్రహాం ఏరి కోరి ఎంచుకుని మరీ ఆర్డర్ ఇచ్చిన నిస్సాన్ జిటి-ఆర్ బ్లాక్ ఎడిషన్ మొత్తానికి ఇంటికి తీసుకెళ్లాడు.

Written By:

నిస్సాన్ ఇండియా ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసిన జిటి-ఆర్ ను చూడంగానే ఎవరికైనా మనసు మళ్లుతుంది. నిస్సాన్ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న జాన్ అబ్రహాం ఈ అంశం పరంగా ముందే ఉన్నాడు. అందర్లానే మనసు పారేసుకున్న జాన్ వెంటనే బ్లాక్ ఎడిషన్ జిటి-ఆర్ గాడ్జిల్లాకు ఆర్డర్ ఇచ్చేశాడు. ఇప్పుడు నిస్సాన్ ఇండియా అత్యంత రహస్యంగా జాన్ గారికి డెలివరీ కూడా ఇచ్చుకుంది.

అయితే జాన్ అబ్రహాం స్వయంగా తన నిస్సాన్ జిటి-ఆర్ బ్లాక్ ఎడిషన్ గాడ్జిల్లాను వీడియో తీసి ఫేస్‌బుక్‌లో ప్రేక్షకుల కోసం పోస్ట్ చేశారు. భారత దేశపు మొట్టమొదటి నిస్సాన్ జిటి-ఆర్ తన వద్ద ఉందంటూ చెప్పుకొచ్చాడు.

నిస్సాన్ ఇండియా ఈ జిటి-ఆర్ సూపర్ కారును ఈ ఏడాది ప్రారంభంలో జరిగిన 2016 ఇండియన్ ఆటో ఎక్స్ పో వేదిక మీద ప్రదర్శించింది మరియు ఈ మాసం ప్రారంభంలో ఈ జిటి-ఆర్ ను ఇండియన్ మార్కెట్లోకి విడుదల చేసింది.

నిస్సాన్ భారత దేశపు మొదటి జిటి-ఆర్ ను స్పెషల్ బ్లాక్ ఎడిషన్‌లో జాన్ ఆబ్రహాంకు డెలివరీ ఇచ్చింది. జాన్ అబ్రహాం జిటి-ఆర్ ను అందుకున్న తరువాత నిస్సాన్‌కు థ్యాంక్స్ కూడా చెప్పుకున్నాడు.

డిజైన్ పరంగా జిటి-ఆర్ పూర్తిగా బ్లాక్ పెయింట్ జాబ్‌లో కలదు. హెడ్ ల్యాంప్స్ ఇప్పుడు మరింత వివరంగా ఉన్నాయి. ఫ్రంట్ గ్రిల్ వి-ఆకృతిలో కలదు మరియు ఇందులో నిస్సాన్ సగ్నేచర్ కలదు.

జిటి-ఆర్ రియర్ సెక్షన్‌లో రెండు గుండ్రటి ఆకారంలో ఉన్న లైట్ల కాంబినేషన్ కలదు. నిస్సాన్ జిటి-ఆర్ వెనుక భాగపు డిజైన్‌లో పూర్తిగా నల్లటి రంగులో ఉన్న స్పాయిలర్ మరియు డిఫ్యూసర్ కలదు.

ఇంటీరియర్ పరంగా సరికొత్త గాడ్జిల్లాలో బటన్లను చాలా వరకు తగ్గించారు, పెద్ద పరిమాణంలో ఉన్న తాకే తెర గల ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ మరియు సౌకర్యవంతమైన సీట్లు డిజైన్ చేయబడ్డాయి.

సాంకేతికంగా నిస్సాన్ జిటి-ఆర్ లో 3.6-లీటర్ సామర్థ్యం ఉన్న వి6 ట్విన్ టుర్బో పెట్రోల్ ఇంజన్ కలదు.

ఇందులోని శక్తివంతమైన ఇంజన్ గరిష్టంగా 582బిహెచ్‌పి పవర్ ఉత్పత్తి చేయగలదు. క్రితపు జిటి-ఆర్ తో పోల్చితే ఈ సరికొత్త జిటి-ఆర్ 20 బిహెచ్‌పి పవర్ ఎక్కువగా ఉత్పత్తి చేయును.

నిస్సాన్ జిటి-ఆర్ లోని వి6 ఇంజన్‌కు 6-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ గల గేర్‌బాక్స్ అనుసంధానం చేయడం జరిగింది. ఇంజన్ ఉత్పత్తి చేసే పవర్ వెనుక చక్రాలకు అందుతుంది.

2017 సరికొత్త జిటి-ఆర్ సూపర్ కేవలం మూడు సెకండ్ల కాలంలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.

జాన్ ఆబ్రహాం తన నిస్సాన్ జిటి-ఆర్ బ్లాక్ ఎడిషన్ డెలివరీ తీసుకున్న తరువాత తీసిన వీడియోను వీక్షించగలరు.

 

Click to compare, buy, and renew Car Insurance online

Buy InsuranceBuy Now

English summary
John Abraham With His New Nissan GT-R Black Edition
Please Wait while comments are loading...

Latest Photos