ఇక పెద్ద ఫ్యామిలీలు ఉన్న వాళ్లు డబ్బుల రెడీ చేస్కోండి.. 2026లో 10 కొత్త 7-సీటర్ కార్లు వస్తున్నాయ్

భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో ఇప్పుడు ఎక్కడ చూసినా బిగ్ కార్ల హవానే నడుస్తోంది. మునుపటిలా చిన్న కార్ల కంటే, ఫ్యామిలీ మొత్తం కలిసి ప్రయాణించే 7-సీటర్ కార్లకే కస్టమర్లు మొగ్గు చూపుతున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు మారుతి సుజుకి, మహీంద్రా, ఎంజీ వంటి దిగ్గజ సంస్థలు 2026లో తమ కొత్త మోడళ్లను రంగంలోకి దించుతున్నాయి. మీరు కూడా కొత్త కారు కొనాలని ప్లాన్ చేస్తుంటే, రాబోయే ఈ 10 అద్భుతమైన 7-సీటర్ కార్ల వివరాలు తెలుసుకుందాం.

1. విన్‌ఫాస్ట్ MPV7 (VinFast MPV7):
వియత్నాంకు చెందిన ప్రముఖ ఎలక్ట్రిక్ వాహనాల తయారీ సంస్థ విన్‌ఫాస్ట్, భారత మార్కెట్లోకి తన సరికొత్త ఎలక్ట్రిక్ ఎంపీవీ MPV7ను తీసుకురాబోతోంది. ఇది చూడటానికి చాలా వెరైటీగా, బాక్సీ డిజైన్‌తో ఉంటుంది. దీని సిగ్నేచర్ V షేప్ ఎల్ఈడీ లైట్లు కారుకు రిచ్ లుక్ ఇస్తాయి. ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు 450 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చని కంపెనీ చెబుతోంది. ఎలక్ట్రిక్ కార్లలో పెద్ద కారు కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్.

Family Travel Gets Bigge Maruti Mahindra and MG Set to Launch 10 New 7-Seater MPVs in 2026

2. ఎంజీ మేజెస్టర్ (MG Majester):
లగ్జరీ కార్ల విభాగంలో ఎంజీ మోటార్ తన ఫ్లాగ్‌షిప్ ఎస్‌యూవీ మేజెస్టర్ 3ను లాంచ్ చేయనుంది. ఇందులో మసాజ్ ఫంక్షన్ ఉన్న సీట్లు, లెవల్-2 అడాస్ (ADAS) వంటి హైటెక్ ఫీచర్లు ఉంటాయి. 2.0 లీటర్ ట్విన్-టర్బో డీజిల్ ఇంజిన్‌తో వచ్చే ఈ కారు, అటు లగ్జరీని ఇటు ఆఫ్-రోడింగ్ పవర్ ను రెండింటినీ బ్యాలెన్స్ చేస్తుంది.

3. న్యూ జనరేషన్ టయోటా ఫార్చ్యూనర్ (New Toyota Fortuner):
ఎస్‌యూవీల రారాజు ఫార్చ్యూనర్ సరికొత్త అవతారంలో రాబోతోంది. ఈసారి దీని డిజైన్ మరింత కండలు తిరిగినట్లుగా, మజిల్ లుక్ తో ఉంటుంది. ముఖ్యంగా ఈ కొత్త వెర్షన్‌లో టయోటా మైల్డ్-హైబ్రిడ్ డీజిల్ ఇంజిన్‌ను పరిచయం చేసే అవకాశం ఉంది. దీనివల్ల పవర్ తగ్గకుండానే మైలేజ్ పెరిగే అవకాశం ఉంది.

Family Travel Gets Bigge Maruti Mahindra and MG Set to Launch 10 New 7-Seater MPVs in 2026

4. ఫోక్స్‌వ్యాగన్ టైగన్ నాన్ R-లైన్ (VW Taygun Non R-Line):
ఫోక్స్‌వ్యాగన్ ఇప్పటికే తన 7-సీటర్ టైగన్ R-లైన్ మోడల్‌ను చూపించింది. అయితే ఇప్పుడు సామాన్యులకు అందుబాటులో ఉండేలా రెగ్యులర్ వెర్షన్‌ను తీసుకురానుంది. ఇందులో 2.0 లీటర్ టీఎస్ఐ పెట్రోల్ ఇంజిన్ ఉంటుంది. ఇది కంఫర్ట్ మరియు బడ్జెట్‌కు ప్రాధాన్యత ఇచ్చే ఫ్యామిలీలకు సరిపోతుంది.

5. స్కోడా కొడియాక్ డీజిల్ (Skoda Kodiaq Diesel):
చాలా కాలంగా డీజిల్ ఇంజిన్ కోసం ఎదురుచూస్తున్న స్కోడా ఫ్యాన్స్‌కు ఇది గుడ్ న్యూస్. కొడియాక్ ఎస్‌యూవీని డీజిల్ వెర్షన్‌లో తిరిగి లాంచ్ చేస్తున్నారు. ఇది 2.0 లీటర్ టీడీఐ ఇంజిన్‌తో 400Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది నేరుగా విదేశాల నుంచి ఇంపోర్ట్ (CBU) చేసుకునే అవకాశం ఉన్నందున ధర కొంచెం ఎక్కువగా ఉండవచ్చు.

6. స్కోడా కొడియాక్ RS (Skoda Kodiaq RS):
స్పీడ్ మరియు స్పోర్టీ లుక్ ఇష్టపడే వారి కోసం RS వేరియంట్ రాబోతోంది. ఇది పూర్తిగా బ్లాక్ కలర్ ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్ తో భయంకరమైన లుక్ ఇస్తుంది. దీని ఇంజిన్ 263bhp పవర్‌ను జనరేట్ చేస్తుంది. వేగంగా దూసుకెళ్లే 7-సీటర్ కావాలనుకుంటే ఇదే సరైన ఛాయిస్.

Family Travel Gets Bigge Maruti Mahindra and MG Set to Launch 10 New 7-Seater MPVs in 2026

7. మారుతి అకర్టిగా ఫేస్‌లిఫ్ట్ (Maruti Ertiga Facelift):
భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న ఎంపీవీ అకర్టిగా కొత్త అప్‌డేట్స్‌తో రాబోతోంది. ఈసారి సీఎన్‌జీ సిలిండర్‌ను కారు బాడీ కింద అమర్చడం ద్వారా బూట్ స్పేస్ (డిక్కీ) పెంచే ప్రయత్నం చేస్తోంది మారుతి. కొత్త ఇన్‌ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అదిరిపోయే లుక్ దీని సొంతం.

8. మహీంద్రా స్కోర్పియో N ఫేస్‌లిఫ్ట్ (Mahindra Scorpio N Facelift):
మహీంద్రా తన పాపులర్ స్కోర్పియో N ను మరింత స్మార్ట్ గా మార్చబోతోంది. థార్ రాక్స్ లో ఉన్నట్లుగా పెద్ద టచ్‌స్క్రీన్, అడ్వాన్స్‌డ్ సేఫ్టీ ఫీచర్లు ఇందులో చేరనున్నాయి. ఫ్రంట్ గ్రిల్, అలాయ్ వీల్స్ డిజైన్ కూడా మారబోతోంది.

9. మహీంద్రా స్కోర్పియో క్లాసిక్ ఫేస్‌లిఫ్ట్ (Scorpio Classic Facelift):
పాత స్కోర్పియో లుక్ ఇష్టపడే వారి కోసం స్కోర్పియో క్లాసిక్‌లో కూడా చిన్నపాటి మార్పులు చేయబోతున్నారు. కొత్త రంగులు, చిన్న చిన్న కాస్మెటిక్ మార్పులతో ఇది రోడ్ల మీద మరింత ఫ్రెష్ గా కనిపిస్తుంది. మాన్యువల్ గేర్‌బాక్స్ ఇష్టపడే వారికి ఇది ఫేవరెట్.

10. రెనాల్ట్ బోరియల్ (Renault Boreal):
రెనాల్ట్ సంస్థ తన సరికొత్త 7-సీటర్ ఎస్‌యూవీ బోరియల్ ను ఇండియాకు తీసుకురానుంది. ఇది డస్టర్ కంటే పెద్దదిగా ఉండి, మూడో వరుసలో కూర్చునే వారికి మంచి స్పేస్ ఇస్తుంది. ఇందులో 1.8 లీటర్ స్ట్రాంగ్ హైబ్రిడ్ ఇంజిన్ ఉండే అవకాశం ఉంది, ఇది మంచి మైలేజీని అందిస్తుంది.

More from DriveSpark

Article Published On: Monday, April 6, 2026, 11:13 [IST]
English summary
Family travel gets bigge maruti mahindra and mg set to launch 10 new 7 seater mpvs in 2026
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+