స్టీవ్ జాబ్స్ కారుకు ఇప్పటికీ నెంబర్ ప్లేట్ లేదు!! ఎందుకో తెలుసా ?

Written By:

స్టీవ్ జాబ్స్ విడుదల చేసే ప్రతి ప్రొడక్ట్ యొక్క ప్రత్యేకత ప్రతి టెక్నాలజీ ప్రియులకు తెలుసు. ఆపిల్ వ్యవస్థాపకుడు చేసే ప్రతి పనిలో కూడా ఏదో ఒక అర్థాన్ని వెతుక్కోవచ్చు. అచ్చం అలాంటిదే... ఈ నెంబర్ ప్లేట్ రహిత కారును జాబ్స్ నడపడం. చట్టానికి దొరక్కుండా దర్జాగా చట్టం ముందే ఈ కారులో తిరుగుతూ వచ్చాడు. అయినప్పటికీ చట్టం స్టీవ్ జాబ్స్‌ను ఏమీ చేయలేకపోయింది.

స్టీవ్ బాజ్స్ ఇలా ఎలా చేయగలిగాడు. ప్రపంచ వ్యాప్తంగా అతనికున్న పేరు, పలుకుబడితో పోలీసులు ఇతన్ని టచ్ చేయలేకపోయారా అని చాలా మందే ప్రశ్నించారు. కాని చట్టాన్ని ఏ మాత్రం తప్పుదోవపట్టించకుండా దర్జాగా తన మెర్సిడెస్ బెంజ్ ఎస్ఎల్55 ఏఎమ్‌జిలో తిరిగాడు.

ఎలా సాధ్యమైందంటే ఆపిల్ సంస్థ యొక్క స్లోగన్ ఆధారంగా చేసుకుని కాలిఫోర్నియా వెహికల్ చట్టంలోని లొసుగును ఆసరాగా చేసుకుని ఇలా నెంబర్ ప్లేట్ లేకుండా కారుని వినియోగించాడు. అయితే చట్ట ప్రకారం అక్కడి పోలీసులు ఇతన్ని ఏమీ చేయలేకపోయారు.

చట్ట ప్రకారమే, కారును రిజిస్ట్రేషన్ చేయకుండా ఎలా వాడుకోవచ్చో ఆపిల్ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ ఎలా వివరించాడో చూద్దాం రండి...

నిజానికి కాలిఫోర్నియా వెహికల్ రూల్స్ ప్రకారం, షోరూమ్ నుండి బయటికి వచ్చిన కారును ఆరు నెలల కాలవ్యవధిలోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుది. అయితే శాస్వతంగా రిజిస్ట్రేషన్ చేయించకుండానే కారును వినియోగిస్తూ వచ్చాడు.

స్టీవ్ జాబ్స్ ఓ కార్ రెంటల్ సంస్థ నుండి ఈ రిజిస్ట్రేషన్ కాని కారును ఆరు నెలల కోసం అద్దెకు తీసుకున్నాడు. కాలిఫోర్నియా రూల్స్ ప్రకారం కొత్త కారును కొన్న వారు ఆరు నెలల లోపు రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది.

సరిగ్గా ఆరు నెలలు గడిచే సమయానికి అద్దె ముగియటంతో కార్లను అద్దెకిచ్చే సంస్థలు ఈ కారును తీసుకెళ్లిపోతారు. యథావిధిగా మరో రిజిస్ట్రేన్ కాని మరో కారును కార్ రెంటల్ సంస్థ నుండి అద్దెకు తీసుకుంటాడు.

ముగింపు లేని కార్ల సప్లే తీసుకునే కస్టమర్ ఉన్నందుకు సంభందిత కార్ లీసింగ్ కంపెనీ సంతోషంగా ఉంది. అయితే కాలిఫోర్నియా యొక్క అర్థం లేని వెహికల్ రూల్ ద్వారా కస్టమర్లు ఎన్నిరోజులయినా రిజిస్ట్రేషన్ చేయించకుండా చట్టబద్దంగా నడుపుకోవచ్చని స్టీవ్ జాబ్స్ నిరూపించాడు.

నెరవేరని స్టీవ్ జాబ్స్ కల..!!
ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ఆఖరి కోరిక ఉంటుంది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. అలాగే జాబ్స్ తన కోరికలలో చివరిది తను పిక్నిక్ కోసం ఒక యాచ్‌లో తిరగాలనేది. 

 

English summary
Steve Jobs’ Car Never Had A Registration Plate — Here's Why Cops Never Caught Him
Please Wait while comments are loading...

Latest Photos