బజాజ్ వి12 విడుదల ఖాయం: ధర మరియు ఇతర వివరాల కోసం...

దేశీయ దిగ్గజ మోటార్ సైకిళ్ల తయారీ సంస్థ బజాజ్ తమ వి శ్రేణి ద్వారా మార్కెట్లోకి విడుదల చేయనున్న ఉత్పత్తికి వి12 అనే పేరును ఖరారు చేసింది. దీని విడుదలకు సంభందించి పూర్తి వివరాలు...

By Anil

దేశీయ పరిజ్ఞానంతో విభిన్నమైన ఉత్పత్తులను అందిస్తున్న ప్రముఖ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థ తమ "వి" లోకి వి15 కు తోడుగా మరో మోడల్‌ను 125సీసీ సామర్థ్యం విడుదల చేయడానికి సన్నద్దం అయ్యింది. ఆ మోటార్ సైకిల్‌కు వి12 అనే పేరును కూడా ఖరారు చేసినట్లు బజాజ్ ఓ ప్రకనలో తెలిపింది.

బజాజ్ వి12

బజాజ్ వి సిరీస్ లో విడుదల కానున్న వి12 కమ్యూటర్ మోటార్ సైకిల్‌ను రూ. 56,200 ల ఎక్స్ షోరూమ్ (ఢిల్లీ)గా విడుదల చేయనున్నట్లు బజాజ్ స్పష్టం చేసింది.

బజాజ్ వి12

ఇన్విసిబుల్ ఇండియన్స్ అనే వేదికను ప్రారంభించిన కార్యక్రమంలో బజాజ్ వి12 ధరను బజాజ్ ఆటో ప్రెసిడెంట్ (మోటార్ సైకిల్ బిజినెస్) ఎరిక్ వాస్ ప్రకటించాడు. ఈ సరికొత్త కమ్యూటర్ బైకును డిసెంబర్ 2016 విడుదల చేయనున్నట్లు కూడా ఆయన తెలిపారు.

బజాజ్ వి12

వి సిరీస్ లో వి15 మోటార్ సైకిల్‌కు తోబుట్టువుగా విడుదల కానున్న వి12 బైకు నిర్మాణాన్ని ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ద నౌక యొక్క లోహాన్ని కొద్ది మొత్తంలో వినియోగిస్తున్నారు. అయితే వి15 తో పోల్చుకుంటే తక్కువ పరిమాణంలో ఉపయోగిస్తున్నట్లు తెలిసింది.

బజాజ్ వి12

వి12 బైకు పూర్తిగా వి15 డిజైన్‌ శైలిలో వస్తోంది. అయితే గతంలో సింగల్ సీటు ద్వారా అందుబాటులో ఉన్న వి15 మాదిరి కాకుండా పొడవాటి సీటును అందిస్తున్నారు.

బజాజ్ వి12

బజాజ్ వి12 మార్కెట్లోకి విడుదలైతే హీరో సూపర్ స్ల్పెండర్, యమహా సెల్యూటో, హోండా సిబి షైన్ ఎస్‌పి మరియు ఇతర 125సీసీ ఉత్పత్తులకు గట్టి పోటీని సృష్టించనుంది.

బజాజ్ వి12

ఒకప్పుడు కాలేజ్ కు సైకిల్ పై వెళ్లేవాళ్లు. ఆ మోజు కాస్త రై రై మంటూ.. రకరకాల ఫీట్స్ చేస్తూ ఎంజాయ్ చేయడానికి బైకులపై మళ్లింది. కాలంతో పాటు వాహనాల ఎంపికా మారింది. తరం మారిందని తెలుపుతూ.. బైకులను నెట్టేస్తూ.. కార్లు ఆ స్థానాన్ని ఎంచుకున్నాయి. ఇప్పుడు కాలేజీ యువత అంతా.. కార్ల జపం చేస్తోంది.కాలేజ్ స్టూటెండ్స్ కోసం బెస్ట్ కార్లు

Most Read Articles

Read more on: #బజాజ్
English summary
Bajaj Confirms New V12 Commuter Motorcycle — Price, Launch Date Revealed
Story first published: Wednesday, November 30, 2016, 14:29 [IST]
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X