ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్

By Anil

క్రౌడ్ ఫండింగ్ ద్వారా మంచి విజయాన్ని అందిపుచ్చుకున్న స్పెరొ సంస్థ తమ మొదటి రౌండ్ అమ్మకాల తరువాత రెండవ రౌండ్ అమ్మకాలకు సిద్దమైంది. తమ ఇ-సైకిళ్ల అమ్మకాలకు మరో మారు సర్వం సిద్దం చేసుకుంది.

ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్

ఇండియాలో మొదటి సారిగా క్రౌండ్ ఫండింగ్ పొందిన ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ సంస్థ స్పెరొ. ఇది తమ విసృత స్థాయి ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చింది.

ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్

స్పెరొ ఎలక్ట్రిక్ సైకిళ్ల తయారీ సంస్థ తమ ప్రారంభం వేరియంట్ సైకిల్ ధర రూ. 29,999 లు మరియు టాప్ ఎండ్ వేరియంట్ సైకిల్ ధర రూ. 47,999 లుగా ఉన్నట్లు ప్రకటించింది.

ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్

బెంగళూరు ఆధారిత ఈ క్రౌండ్ ఫండింగ్ సంస్థ తమ అధికారిక వెబ్‌సైట్‌ నుండి తమ ఉత్పత్తులను అమ్మకాలు సిద్దంగా అందుబాటులో ఉంచింది.

ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్

స్పెరొ సంస్థ తమ శ్రేణిలో ఇ30, ఇ60 మరియు ఇ100 అనే సైకిళ్లను అందుబాటులో ఉంచింది. వీటిలో ఇ30 మరియు ఇ100 సైకిళ్లు పురుషుల కోసం అదే విధంగా ఇ60 అనే సైకిల్‌ను మహిళల కోసం రూపొందించినట్లు తెలిపారు.

ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్

ఇ30 సైకిల్‌ ఒక్క సారి ఛార్జింగ్ ద్వారా 30 కిలోమీటర్లు మరియు ఇ60 సైకిల్ ఒక్క సారి ఛార్జింగ్ ద్వారా 60 కిలోమీటర్లు అదే విధంగా ఇ100 సైకిల్ ఒక్కసారి ఛార్జింగ్ ద్వారా నిరంతరాయంగా 100 కిలోమీటర్ల వరకు నడుస్తుంది.

ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్

స్పెరొ సంస్థ తమ అన్ని ఉత్పత్తుల్లో కూడా 48వోల్ట్‌ల సామర్థ్యం గల లిథియమ్ ఐయాన్ బ్యాటరీని అందించింది. ఇది 250వాట్స్‌ సామర్థ్యం ఉన్న గేర్లు గల బ్రష్‌లెస్ ఎలక్ట్రిక్ మోటార్‌తో అనుసంధానమై ఉంటుంది.

ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్

స్పెరొ సంస్థ తమ ఉత్పత్తుల్లో అత్యంత వేగవంతమైన ఛార్జింగ్ వ్యవస్థను అందించారు. కేవలం రెండే గంటల్లో80 శాతం ఛార్జింగ్ అయ్యే విధంగా అభివృద్ది చేశారు. అయితే మొత్తం ఛార్జింగ్ చేయాలనుకుంటే మరో రెండు గంటల పాటు వేచి ఉండాల్సి ఉంటుంది.

ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్

ఛార్జింగ్ చేయడం ద్వారా మాత్రమే కాకుండా ఇందులో రీజనరేటింగ్ వ్యవస్థ కూడా కలదు. ఇందులోని పెడల్స్‌ను తొక్కినపుడు మరియు ముందు వైపున ఉన్న డిస్క్ బ్రేకులను అప్లై చేసినపుడు ఉత్పత్తి అయ్యే శక్తి విద్యుత్ శక్తిగా మారి బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది.

ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్

స్పెరొ ఎలక్ట్రిక్ సైకిళ్ల యొక్క గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లుగా ఉంది. మరియు ఈ వేగాన్ని కేవలం 10 సెకండ్లలోనే చేరుకుంటుంది.

ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్

స్పెరొ వారి ఎలక్ట్రిక్ సైకిల్ బరువు కేవలం 24 కిలోలు మాత్రమే ఉంటుంది. మరియు ఇది గరిష్టంగా100 కిలోల బరువును మోయగలదు.

ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్

ఒక వేళ మీరు ఈ సైకిల్‌ను నడుపుతున్నపుడు చిన్న చిన్న గుంతలు వస్తే వాటిని వీలైనంత వరకు తప్పించడానికి ప్రయత్నించండి ఎందుకంటే ఇందులో ముందువైపు ఉన్నట్లు వెనుకన సస్పెన్షన్ సిస్టమ్ లేదు.

ఒక్క సారి ఛార్జింగ్‌తో 100 కిమీలు నడిచే ఎలక్ట్రిక్ సైకిల్

హీరో నుండి మూడు కొత్త ఉత్పత్తులు: హీరో ప్లాన్ కేక

బైకుల ప్రపంచాన్ని మూసేస్తున్న స్కూటర్లు

స్వయం చాలక బైకులు

Most Read Articles

English summary
Spero's E-Bikes Are Available Once Again, Grab Yours Before The Rest Of The Crowd
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X